Daily Current Affairs in Telugu 26 July -2022
మలేరియా వ్యాప్తికి కారణమవుతున్న ప్రొటీన్ ను కనుగొన్న హెచ్.సి యు :

మలేరియా వ్యాప్తికి కారణమవుతున్న ప్రొటీన్ ను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) పరిశోధకులు గుర్తించారు. మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసే పరాన్నజీవిలో ఉండే ప్రొటీన్ నిర్మాణంలో మార్పులు చేస్తే ఈ వ్యాధిని అరికట్టవచ్చని వీరు కనిపెట్టారు. హెచ్ సీయూ జంతుశాస్త్ర ఆచార్యుడు కోట అరుణ్ కుమార్ గారి నేతృత్వంలోని స్మిత పత్రి, సందీప్, వేద సరహరి, దీప్తిసింగ్ బృందం: ఈ పరిశోధనలో పాల్గొన్నారు.
- తెలంగాణా రాష్ట్ర రాజదాని : హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్రశేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి : మలేరియా వ్యాప్తికి కారణమవుతున్న ప్రొటీన్ ను కనుగొన్న హెచ్.సి యు
ఎవరు : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జులై 26
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఎండి గా బాద్యతలు చేపట్టిన కుమార్ చౌహాన్ :

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ కుమార్ చౌహాన్ జులై 26న బాధ్యతలు చేపట్టారు. కుమార్ అంతకు ముందు ఆయన బీఎస్ఈ ఎండీ, సీఈఓగా రాజ్ కుమార్ చౌహాన్ రాజినామా చేశారు. కొత్త ఎండీ, సీఈఓ నియామకం వరకు ఎక్స్ఛేంజీ ఎంజీ వ్యవహారాలను ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ కమిటీ చూసుకుంటుందని బీఎస్ఈ వెల్లడించింది. ఎన్ఎస్ఈ గత ఎక్చేంజీల్లో సీఈఓ విక్రమ్ లిమాయే స్థానాన్ని చౌహాన్ భర్తీ చేశారు. ఎన్ఎస్ఈలో పదవీకాలం పొడిగింపునకు అవకాశం ఉన్నప్ప టి. లిమాయే కోరలేదు. జులై 15న ఆయన అయిదేళ్ల కాల వ్యవధి ముగిసింది.’ ఎన్ఎస్ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్ కుమార్ చౌహాన్ ఉన్నారు. 2000లో ఆయన ఎన్ఎస్ఈని విడిచిపెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ లో పలు పదవులు నిర్వహించారు. 2009లో బీఎస్ఈ డిప్యూటీ సీఈఓగా స్టాక్ ఎక్స్చేంజీల్లోకి అడుగుపెట్టారు. 2012 నుంచి బీఎస్ఈ సీఈ ఓగా పనిచేస్తున్నారు.
- : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపన : 1992
- : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రధాన కార్యాలయం : ముంబాయ్
క్విక్ రివ్యు :
ఏమిటి : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఎండి గా బాద్యతలు చేపట్టిన కుమార్ చౌహాన్
ఎవరు : కుమార్ చౌహాన్
ఎప్పుడు: జులై 26
2025 మహిళల ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వనున్న భారత్ :

భారత్ 2025 మహిళల ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వనుంది. ఐసీసీ వార్షిక సమావేశంలో బీసీసీఐ, ఈ మెగా ఈవెంట్ కు విజయవంతంగా బిడ్ వేసింది. చివరిసారి 2013లో భారత్ లో మహిళల వన్డే ప్రపంచకప్ జరిగింది. 2024 టీ20 ప్రపంచకప క్కు బంగ్లాదేశ్, 2026 టీ20 ప్రపంచ కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తాయి. మహిళల మొదటి టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ (2027)ని శ్రీలంకలో నిర్వహిస్తారు. పురుషులు, మహిళల భవిష్య పర్యటన ప్రణాళిక (2023 2027)లను ఐసీసీ ‘బోర్డు’ ద్రువీకరించింది. తర్వాతి ఐసీసీ చైర్మన న్ను ఎన్నుకునే ప్రక్రియకు కూడా ఆమోదం తెలిపింది. ఎన్నికలు నవంబ రులో జరుగుతాయి కొత్త చైర్మన్ డిసెంబరు 1 నుంచి రెండేళ్లు పదవిలో ఉంటాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2025 మహిళల ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వనున్న భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు: జులై 26
అంతరిక్ష కేంద్రం (ISS) నుండి వైదొలగుతున్న రష్యా అంతరిక్ష సంస్థ రోస్కో :

అమెరికా, యూరప్, జపాన్, కెనడా, రష్యా సంయుక్తంగా నిర్మించిన అంతర్జాతీయ కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి రష్యా వైదొలగనుంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పశ్చిమ దేశాలతో సఖ్యత పాడవడంతో రష్యా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 2024 ఏడాది తర్వాత ఐఎస్ఎస్ లో రష్యా భాగస్వామిగా ఉండబోదనీ రష్యా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ( రోస్ స్కోస్) చీఫ్ యూరీ బొరిసోవ్ జులై 26న చెప్పారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించు కుంటామని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ సంఘర్షణ కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.
- ,.రష్యా రాజధాని : మాస్కో
- రష్యా దేశ కరెన్సీ : రూబెల్
- రష్యా దేశ అద్యక్షుడు : వ్లాదిమిర్ పుతిన్
- యుక్రయిన్ దేశ రాజధాని: కీవ్
- యుక్రయిన్ దేశ కరెన్సీ : యుక్రయిన్ హ్రిన్వియా
- యుక్రయిన్ దేశ అద్యక్షుడు :వోలోదిమిర్ జేలస్కి
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతరిక్ష కేంద్రం (ISS) నుండి వైదొలగుతున్న రష్యా అంతరిక్ష సంస్థ రోస్కో
ఎవరు : రోస్కో
ఎప్పుడు: జులై 26
ఒక్క రూపాయి వైద్యునిగా పేరున్న సోశోవన్ బందోపాద్యాయ కన్నుమూత :

ఒక్క రూపాయి డాక్టర్ గా పేరు గడించిన బెంగాల్ వైద్యుడు సుషోషన్ బంధోపాధ్యాయ(84) జులై 26న కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూ శారు. కిడ్నీ సంబంధ అనారోగ్య సమస్యలతో ఆయన రెండేళ్లుగా ఇబ్బం’ది పడుతున్నారు. ఫీజుగా ఒక్క రూపాయి మాత్రమే తీసుకునే ఈ వైద్యుడిని అంతా ఏక్ టాకర్ డాక్టర్(ఒక్క రూపాయి డాక్టర్) అని బెంగాల్లో పిలుచుకునేవారు. ఒక పర్యాయం ఎమ్మెల్యే కూడా అయిన ఈయన వైద్య వృత్తిలో 60 ఏళ్లపాటు సేవలందించారు. 2020లో ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అదే ఏడాది ఆయన్ను ఆత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఒక్క రూపాయి వైద్యునిగా పేరున్న సోశోవన్ బందోపాద్యాయ కన్నుమూత
ఎవరు : సోశోవన్ బందోపాద్యాయ
ఎప్పుడు: జులై 26
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |