Daily Current Affairs in Telugu 26 December- 2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 26 December- 2022

రైల్వే బోర్డు చైర్మన్ గా ప్రదాన కార్యనిర్వాహక అధికారి సియివో గా అనిల్ కుమార్ నియమకం :

రైల్వే బోర్డు చైర్మన్ గా ప్రదాన కార్యనిర్వాహక అధికారి సియివో గా అనిల్ కుమార్ లాహోటి ని నియమిస్తూ కేంద్ర కేబినేట్ నియామకాల కమిటి ఆమోదించినట్లు కార్యదర్శి దీప్తి ఉమాశంకర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన ప్రస్తుతం రైల్వే బోర్డ్ సభ్యుడిగా మౌళిక వసతులుగా పని చేస్తున్నారు.ఈ నియామకం జనవరి 01 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : రైల్వే బోర్డు చైర్మన్ గా ప్రదాన కార్యనిర్వాహక అధికారి సియివో గా అనిల్ కుమార్ నియమకం

ఎవరు : అనిల్ కుమార్

ఎప్పుడు : డిసెంబర్ 26

ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారి సంస్థ సియివో గా కమల వర్ధన్ రావు నియామకం :

భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎస్.ఎస్ ఎస్.ఎఐ) ముఖ్య కారనిర్వాహక అధికారి గా 1990 బ్యాచ్  కేరళకు చెందిన ఐఎఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ కు చెందిన గంజి కమల వర్ధన్ రావు గారు నియమితులయ్యారు.ప్రస్తుతం భారత పర్యాటక అబివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్న ఆయనను ఎస్.ఎస్ ఎస్.ఎఐసియివో గా బదిలీ చేస్తూ నియమాక వ్యవహారాల కేబినేట్ కమిటి నిర్ణయించినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ డిసెంబర్ 26 న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈయన కార్యదర్శి స్థాయిలో ఈ పదవిలో పని చేస్తారు.అలాగే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ గా 1995 బ్యాచ్ యుపి కేడర్ ఐఎఎస్ అధికారి సంతోష్ కుమార్ యాదవ్ గారు నియమితులయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారి సంస్థ సియివో గా కమల వర్ధన్ రావు నియామకం

ఎవరు : కమల వర్ధన్ రావు

ఎప్పుడు : డిసెంబర్ 26

నేపాల్ ప్రధాని పీఠాన్ని మూడోసారి అధిష్టించిన పుష్పకమల్ దహాల్ ప్రచండ :

సీపీఎన్-మావోయిస్టు సెంటర్(ఎంసీ) పార్టీ చైర్మన్ పుష్పకమల్ దహాల్ ప్రచండ గారు మూడోసారి నేపాల్ దేశ  ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. గెరిల్లా ఉద్యమ నేతగా పేరొందిన ఆయనతో దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ గారు డిసెంబర్ 26న  ప్రమాణం చేయించారు. ప్రచండతో పాటు కొత్త సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. నూతన మాజీ మంత్రివర్గంలో ముగ్గురు ఉప ప్రధానులు బిష్ణు  పౌడల్ (సీపీఎన్-యూఎం ఎల్), నారాయణ్ కాజీ శ్రేష్ఠ (సీపీఎన్-ఎంసీ), రబి లామిచానే (ఆర్ఎస్పీ) ఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : నేపాల్ ప్రధాని పీఠాన్ని మూడోసారి అధిష్టించిన పుష్పకమల్ దహాల్ ప్రచండ

ఎవరు : పుష్పకమల్ దహాల్ ప్రచండ

ఎప్పుడు : డిసెంబర్ 26

గ్వాలియర్లో భారీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం :

గ్వాలియర్ లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయీ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాజ్ పేయీ  గారి స్వస్థలంలో భారీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం గ్వాలియర్ లో సుమారు 10వేల ఎకరాలు (1050) హెక్టార్ల) భూమిని కేటాయించింది. ఈ విషయాన్ని వాజ్ పేయీ గారు పుట్టిన రోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడి అధికారులు వెల్లడించారు

క్విక్ రివ్యు :

ఏమిటి : గ్వాలియర్ భారీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎవరు : మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ: మధ్యప్రదేశ్

ఎప్పుడు : డిసెంబర్ 26

దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ పేరిట అవార్డు ఇవ్వాలని నిర్ణయించిన క్రికెట్ ఆస్ట్రేలియా :

ప్రతి ఏడాది ‘అత్యుత్తమ టెస్టు ఆటగాడు’ అవార్డును దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ పేరిట ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించింది. షేన్ వార్న్ గౌరవార్ధం డిసెంబర్ 26 న ఈ అవార్డుకు అతని పేరు పెట్టింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం సందర్భంగా షేన్ వార్న్ నివాళిగా అవార్డుకు అతని పేరు పెడుతున్నట్లు సీఏ సీఈఓ నిక్ హాకే. ఆసీస్ క్రికెటర్ల సంఘం సీఈఓ టాడ్ గ్రీన్ బేర్ ప్రకటించారు. ఈ ఏడాది ఆరంభంలో థాయ్ లాండ్లో అనుమానాస్పద రీతిలో గుండెపోటుతో వార్న్ మరణించాడు. 2005లో 40 వికెట్లు తీసిన వారు 2006లో ‘ఈ’ అవార్డు లభించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ పేరిట అవార్డు ఇవ్వాలని నిర్ణయించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఎవరు : క్రికెట్ ఆస్ట్రేలియా

ఎక్కడ:  ఆస్ట్రేలియా

ఎప్పుడు : డిసెంబర్ 26

జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న నిఖత్ జరీన్ :

జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ అదరగొట్టింది. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన నిఖత్ జరీన్ జాతీయ టోర్నీలో ఛాంపియన్ గా  నిలిచింది. డిసెంబర్ లో జరిగిన 50 కేజీల ఫైనల్లో నిఖత్ 4-1తో అనామిక (ఆర్ఎస్పీబీ)పై నెగ్గి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. బౌట్ లో అత్యధిక శాతం ఆది పత్యం కనబరిచిన నిఖత్.. ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురి పించింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గో హైన్ అంచనాలకు తగ్గట్లుగా రాణించి బంగారు పతకంతో మెరిసింది. 75 కేజీల ఫైనల్లో లవ్లీనా 5-0తో ఆరుందతి చౌదరి (ఎస్ఎస్ఏసీబీ)పై గెలుపొందింది. 18 రేజీల ఫైనల్లో మంజు రాణి (ఆర్ఎఎస్ పీబీ) 5-0తో క వాణి (తమిళనాడు)పై నెగ్గి స్వర్ణం సాధించింది. రైల్వేసే చెందిన శిక్ష (54 కేజీలు), పూనమ్ (6 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుషర్ (ఫస్ 81 కేజీలు) బంగారు పతకాలతో సత్తాచాటారు

క్విక్ రివ్యు :

ఏమిటి : జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న నిఖత్ జరీన్

ఎవరు : నిఖత్ జరీన్

ఎక్కడ:  భోపాల్

ఎప్పుడు : డిసెంబర్ 26

సామాజిక పురోగతి సూచీలో దేశంలో 23వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ :

సామాజిక పురోగతి సూచీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 23వ స్థానంలో ఉంది. దక్షిణాదినే ఉన్న తమిళనాడు  అగ్రస్థానాన్ని సాధించింది., , కేరళ రాష్ట్రాలు తదుపరి స్థానంలో  ఉన్నాయి.అస్సాం ,బీహార్ ,జార్ఖండ్ రాష్ట్రాలు చివరి స్థానం లో ఉన్నాయి.అంతేకాక  రాష్ట్రంలో ఉమ్మడి ఉమ్మడి జిల్లాల వారిగా వాటి ప్రాతిపదికన చూస్తే, కడప, చిత్తూరు జిల్లాలు అగ్రస్థానంలో నిలి చాయి. 2022 సంవత్సరానికి దేశంలోన 36 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, 707 జిల్లాల సామాజిక పురోగతికి సంబంధించి ‘సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్’ నివేదికను ఇటీవల ప్రధానమంత్రి ర్థిక, సలహా మండలి విడుదల చేసింది అబివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : సామాజిక పురోగతి సూచీలో దేశంలో 23వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్

ఎవరు : ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు : డిసెంబర్ 26

Download Manavidya app

Daily current affairs in Telugu Pdf November - 202
Daily current affairs in Telugu 01-11-2022
>Daily current affairs in Telugu 02-11-2022
Daily current affairs in Telugu 03-11-2022
Daily current affairs in Telugu 04-11-2022</strong>
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 06-11-2022</strong>
Daily current affairs in Telugu 07-11-2022
Daily current affairs in Telugu 08-11-2022
>Daily current affairs in Telugu 09-11-2022
Daily current affairs in Telugu 10-11-2022
Daily current affairs in Telugu 11-11-2022
Daily current affairs in Telugu Pdf October 2022
Daily current affairs in Telugu Pdf Octobe r01 - 2022
Daily current affairs in Telugu Pdf October 02 - 2022
Daily current affairs in Telugu Pdf October03 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October04 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October05 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October 6 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October07 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October08 - 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf October09 - 2022
Daily current affairs in Telugu Pdf October 10 - 2022
Daily current affairs in Telugu Pdf October 11 - 2022
Daily current affairs in Telugu Pdf October 12 - 2022
Daily current affairs in Telugu Pdf October 13 - 2022
Daily current affairs in Telugu Pdf October 14 - 2022
Daily current affairs in Telugu Pdf October 15 - 2022
Daily current affairs in Telugu Pdf October 16 - 2022
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *