
Daily Current Affairs in Telugu 26&27-April-2022
పాకిస్తాన్ కొత్త విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిలావల్ భుట్టో :

పాకిస్తాన్ కొత్త ప్రభుత్వంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్దారీ పాత్రపై ఊహాగానాలకు తెరపడింది. ఆయన పాక్ ఇటీవల విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్27న పాక్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి షెహజాద్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ హాజరయ్యారు. అంతర్జాతీయంగా ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరవుతోందన్న వాదనల నేపథ్యంలో విదేశాంగ మంత్రిగా ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
- పాకిస్తాన్ దేశ రాజధాని :ఇస్లామాబాద్
- పాకిస్తాన్ దేశ కరెన్సీ :పాకిస్తాన్ రుపయ
- పాకిస్తాన్ దేశ ప్రధాని : శేహబాజ్ షరీఫ్
- పాకిస్తాన్ దేశ అద్యక్షుడు : ఆరిఫ్ ఆల్వి
క్విక్ రివ్యు ;
ఏమిటి: పాకిస్తాన్ కొత్త విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిలావల్ భుట్టో
ఎవరు: బిలావల్ భుట్టో
ఎక్కడ: పాకిస్తాన్ దేశం
ఎప్పుడు: ఏప్రిల్ 26
UNDP జెండర్ ఈక్వాలిటీ సీల్ ప్రోగ్రాం లో గోల్డ్ సెర్టిఫీకేషన్ పొందిన మొదరి దేశం ఐస్ ల్యాండ్ :

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) జెందర్ ఈక్వాలిటీ సీల్ ప్రోగ్రామ్ కింద లింగ సమానత్వంపై బంగారు ధృవీకరణ (gold certification) పొందిన మొదటి దేశంగా ఐస్లాండ్ నిలిచింది. సంస్థలు మరియు సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఇది లింగ సమానత్వం మరియు మహిళలను ప్రోత్సహించడానికి ప్రమాణాలలో శ్రేష్ఠతను సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు మరియు సంస్థలతో కలిసి పనిచేస్తుంది. UNDP యొక్క వినూత్న లింగ సమానత్వ ముద్ర కార్యక్రమం లింగ సమానత్వంపై అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సంస్థలను గుర్తిస్తుంది.
క్విక్ రివ్యు ;
ఏమిటి: UNDP జెండర్ ఈక్వాలిటీ సీల్ ప్రోగ్రాం లో గోల్డ్ సెర్టిఫీకేషన్ పొందిన మొదరి దేశం ఐస్ ల్యాండ్
ఎవరు: ఐస్ ల్యాండ్
ఎప్పుడు: ఏప్రిల్ 26
పారిస్ బుక్ ఫెస్టివల్ 2022లో గౌరవ అతిథిగా ఎంపికైన భారత్ :

పారిస్ బుక్ ఫెస్టివల్ 2022లో భారతదేశం గౌరవ దేశానికి అతిథిగా ఎంపిక చేయబడింది. పారిస్ బుక్ ఫెస్టివల్ 2022 21 ఏప్రిల్ 2022 మరియు 24 ఏప్రిల్ 2022 మధ్య నిర్వహింబడింది. పారిస్ బుక్ ఫెస్టివల్ 2022లో గౌరవ అతిథిగా భారతదేశం పాల్గొనడం మన సాహిత్య మరియు భాషా వైవిధ్యాన్ని జరుపుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యు ;
ఏమిటి: పారిస్ బుక్ ఫెస్టివల్ 2022లో గౌరవ అతిథిగా ఎంపికైన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: ఏప్రిల్ 26
చైనియుల పర్యాటక వీసాలపైన సస్పెన్షన్ విధించిన భారత్ :

చైనీయులకు జారీ చేసిన పర్యాటక వీసాలను సస్పెండ్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ (ఐఏటీఏ) ఈ మేరకు వెల్లడించింది.చైనీయులకు జారీ చేసిన పదేళ్ల కాల పరిమితితో కూడిన పర్యాటక వీసాలు కూడా చెల్లబోవని పేర్కొంది. చైనా వర్సిటీల్లో 22వేల దాకా భారత స్టూడెంట్ల లు చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో 2020లో తిరిగొచ్చిన వాళ్లను నేటికీ చైనా తిరిగి తమ దేశంలో అడుగు పెట్టనివ్వడం లేదు. వారి భవిష్యత్తు దృష్ట్యా సానుభూతితో ఆలోచించాలని చైనాకు భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసింది విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ తో దీన్ని ప్రస్తావించారు. అయినా లాభం లేకపోవడంతో భారత్ తాజాగా వీసాల ప్రేమకుంది.
క్విక్ రివ్యు ;
ఏమిటి: చైనియుల పర్యాటక వీసాలపైన సస్పెన్షన్ విధించిన భారత్
ఎవరు: చైనియుల ఫై
ఎక్కడ: భారత్
ఎప్పుడు: ఏప్రిల్ 27
జాతీయ అవార్డు పిసి చంద్ర పురస్కారం గెలుచుకున్న ఉస్తాద్ అమ్హద్ అలీ ఖాన్ :

భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సరోద్ విద్వాంసుడు పద్మవిభూషణ ఉస్తాద్ అమ్హద్ అలీ ఖాను పిసి చంద్ర గ్రూప్ నుండి వార్షిక జాతీయ అవార్డు పిసి చంద్ర పురస్కారం లభించింది. ఇది వార్షిక అవార్డు వేడుక యొక్క 29వ ఎడిషన్. కోల్కత్తాలోని సైన్స్ సిటీ ఆడిటోరియంలో జరిగింది. ఉస్తాద్ అమ్హద్ అలీ ఖాన్ అతని ప్రముఖ కుటుంబంలో ఆరవ తరం నరోద్ వాద్యకారుడు. అతనిది ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రయాణం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అసంఖ్యాక క్రెడీట్లు మరియు సమర్పణలతో సుసంపన్నం చేసింది. అతని స్పష్టమైన మరియు వేగవంతమైన ‘ఏభారా తాన్స్’కి ప్రసిద్ధి చెందిన ఉస్తాదికి 2001లో ‘పద్మ విభూషణ్’, సంగీత నాటక అకాడమీ అవార్డు లబించింది.
క్విక్ రివ్యు ;
ఏమిటి: జాతీయ అవార్డు పిసి చంద్ర పురస్కారం గెలుచుకున్న ఉస్తాద్ అమ్హద్ అలీ ఖాన్
ఎవరు: ఉస్తాద్ అమ్హద్ అలీ ఖాన్
ఎప్పుడు: ఏప్రిల్ 27
ప్రపంచంలోనే కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని నిలిపివేసిన మొదటి దేశం డెన్మార్క్ :

కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని నిలిపివేసిన దేశంగా ప్రపంచంలోనే మొదటి దేశంగా డెన్మార్క్ దేశం అవతరించింది. కాగా ఈ అంటువ్యాధి నియంత్రణలోకి వచ్చిందని మరియు దేశం మంచి స్థితిలో ఉందని డానిష్ హెల్త్ అథారిటీ తెలిపింది. అందువలన మే 15 తర్వాత టీకాల ఆహ్వానాలు జారీ చేయబడవని డెన్మార్క్ ఆరోగ్య అధికారులు తెలిపారు.
- డెన్మార్క్ దేశ రాజధాని :కోపెన్ హాగ్
- డెన్మార్క్ దేశ కరెన్సీ : డేనిష్ క్రోన్
క్విక్ రివ్యు ;
ఏమిటి: ప్రపంచంలోనే కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని నిలిపివేసిన మొదటి దేశం డెన్మార్క్
ఎవరు: డెన్మార్క్
ఎక్కడ: డెన్మార్క్ దేశంలో
ఎప్పుడు: ఏప్రిల్ 27
మేధో సంపత్తి (ఐపీ) హక్కుల పరిరక్షణ అమలులో భారత్, చైనా, రష్యా లను ప్రయారిటీ లిస్టు లో ఉంచిన అమెరికా :

మేధో సంపత్తి (ఐపీ) హక్కుల పరిరక్షణ, అమలుకు సంబంధించి అమెరికా మరోసారి భారత్, చైనా, రష్యా సహా 7 దేశా తన ‘ప్రాధాన్యత పరిశీలన జాబితా (ప్రయారిటీ వాచ్ లిస్ట్) లోనే ఉంచింది. ఈమేరకు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్ టీఆర్) కార్యాలయం వార్షిక ‘స్పెషల్ 301 రిపోర్ట్ ను విడుదల చేసింది. అర్జెంటినా. చిలీ, ఇండొనేసియా, వెనెజువెలాతో కలిపి 7 దేశాలూ గత ఏడాది కూడా ఇదే జాబితాలో ఉండటం గమనార్హం. మేధో హక్కుల పరిరక్షణ. అమలుకు సంబంధించి ప్రపంచవ్యాప్త పరిస్థి తిపై యూఎన్టీఆర్ ఈ నివేదికను రూపొంది ఈమేరకు 100కు పైగా వాణిజ్య భాగస్వామ్య దేశాల అమెరికా దేశాల పరిస్థితులను సమీక్షించినట్లు యూఎన్టీఆర్ ఆమోదం తెలిపింది. రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ పరిస్థితిపై సమీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొంది. తగినంతగా ఐపీ హక్కుల రక్షణ, అమలు లేనట్లు భావించే దేశాలను ఈ జాబితాలో ఉంచుతుంది. కాగా తాజా నివేదికలో పాకిస్తాన్, కెనడా, బ్రెజిల్, ఈజిప్ట్, మెక్సికో సహా 20 వాణిజ్య భాగస్వామ్య దేశాలను ‘పరిశీలన జాబితా (వాచ్ లిస్ట్)’లో ఉంచింది..
క్విక్ రివ్యు ;
ఏమిటి: మేధో సంపత్తి (ఐపీ) హక్కుల పరిరక్షణ అమలులో భారత్, చైనా, రష్యా లను ప్రయారిటీ లిస్టు లో ఉంచిన అమెరికా
ఎవరు: అమెరికా
ఎప్పుడు: ఏప్రిల్ 26
షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్ గా నియమితులైన విజయ్ సాంప్లా :

భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్ ‘సాంప్లా గారు షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (ఎన్సీ ఎస్సీ) చైర్ పర్సన్ గా రెండోసారి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏప్రిల్ 27న నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఇదే పదవిలో ఉన్న సాంప్లా ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. అనంతరం ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో పంజాబ్ లోని హోశియార్పుర్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికైన ఆయన అనంతరం కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
- షెడ్యుల్ కులాల జాతీయ కమిషన్ ఏర్పాటు :1978
- షెడ్యుల్ కులాల జాతీయ కమిషన్ ప్రాధాన్ కార్యాలయం :న్యు డిల్లి
- షెడ్యుల్ కులాల జాతీయ కమిషన్ స్థాపించింది : పార్లమెంట్
క్విక్ రివ్యు ;
ఏమిటి: షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్ గా నియమితులైన విజయ్ సాంప్లా
ఎవరు: విజయ్ సాంప్లా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: ఏప్రిల్ 26
జాతీయ రికార్డు సృష్టించిన వెయిట్ లిఫ్టర్ మరియా :

ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో వెయిట్ లిఫ్టర్ ఆన్ మరియా అదరగొట్టింది. మంగళూర్ విశ్వవిద్యాలయం తరపున బరిలో దిగిన ఆమె +87 కేజీల విభాగం క్లీన్ అండ్ జర్క్ 129 కేజీల బరువెత్తి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జాతీయ ఛాంపియన్షిప్స్ మన్ ప్రీత్ కౌర్ నమోదు చేసిన రికార్డు (128)ను ఆమె తిరగరాసింది. సాచ్లో 101 కేజీలు ఎత్తిన మరియా. మొత్తం 230 కేజీల ప్రదర్శనతో పసిడి సొంతం చేసుకుంది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ కలిపి ఓవరాల్ ప్రదర్శనలో జాతీయ రికార్డు (281 కేజీలు) మరియా పేరు మీదే ఉండడం విశేషం. బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల టీమ్ విభా గాల్లో స్వర్ణాలను జైన్ విశ్వవిద్యాలయం సొంతం చేసుకుంది. మహిళల బాస్కెట్ బాల్ తుదిపో రులో మద్రాస్ విశ్వవిద్యాలయం 65-48 తేడాతో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంపై విజయం సాధించింది. ప్రస్తుతానికి 10 స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో పతకాల పట్టికలో జైన్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో కొనసాగుతోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ రికార్డు సృష్టించిన వెయిట్ లిఫ్టర్ మరియా
ఎవరు: మరియా
ఎప్పుడు: ఏప్రిల్ 27
నాస్కామ్‘ చైర్ పర్సన్ గా కృష్ణన్ రామానుజం నియామకం :

ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్’ చైర్ పర్సన్ గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా కృష్ణన్ రామానుజమ్ గారు నియమితులయ్యారు. 2022-23 సంవత్సరానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఆయన నాస్కామ్ కు వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. 2021-22 కాలానికి నాస్కామ్ చైర్పర్సన్ గా ఉన్న యాక్సెంచర్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ రేఖ ఎం మీనన్ గారి స్థానంలో రామానుజమ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ‘మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరిని 2022-23 సంవత్సరానికి వైస్ చైర్పర్సన్ నాస్కామ్ నియమించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: నాస్కామ్’ చైర్ పర్సన్ గా కృష్ణన్ రామానుజం నియామకం
ఎవరు: కృష్ణన్ రామానుజం
ఎప్పుడు: ఏప్రిల్ 27
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |