Daily Current Affairs in Telugu 26-11-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
అత్యధికంగా పేదరికం ఉన్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన బీహార్ :

దేశంలో అత్యధికంగా పేదరికం ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు బహుముఖ షేదరిక సూచీ(ఎంపీఐ) వివరాలను తాజాగా విడుదల చేసింది. ఈ సూచీ ప్రకారం బీహార్ జనాభాలో 51.91 శాతం మందిపేదలు ఉన్నారు. జార్ఖండ్, యూపీల్లో ఇది వరుసగా 42.16, 37.79 శాతంగా ఉంది. ఇక 36.65 శాతం మంది పేదలతో మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో, మేఘాలయ (32.67) ఐదో స్థానంలో ఉంది. కేరళ(0.71%), గోవా(3.76%), సిక్కిం (3.82%), తమిళనాడు (4.89%), ఢిల్లీ(4.79%), పంజాబ్ (5.59%)ల్లో పేదల సంఖ్య తక్కువగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొన్నది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 13.74%, ఆంధ్ర పదేశ్ లో 12.31% మంది పేదలు ఉన్నారని వెల్లడించింది.
- బీహార్ రాష్ట్ర రాజదాని : పాట్నా
- బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి : నితీష్ కుమార్
- బీహార్ రాష్ట్ర గవర్నర్ : ఫాగు చౌహాన్
క్విక్ రివ్యు :
ఏమిటి: అత్యధికంగా పేదరికం ఉన్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన బీహార్
ఎవరు: బీహార్
ఎప్పుడు: నవంబర్ 26
నీతి అయోగ్ వెల్లడించిన పేదరిక సూచిలో 20వ స్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ :

ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో పేదరికాన్ని అనుభవిస్తున్న వారు’12.31% మేర ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, సరళమై జిల్లాల స్థితిగతులను తెలుసుకోవడానికి నీతి ఆయోగ్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ఆధారంగా రూపొందించిన బహుముఖ పేదరికం నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధిక సంఖ్యలో పేజీ. లక్ష్యాల లున్న రాష్ట్రాలుగా బిహార్ (51.91 శాతం), ఝూర్ఖండ్ (42.16), ఉత్తర్ ప్ర దేశ్ (37.79) తొలి మూడు స్థానాల్లో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ 20, తెలంగ గాన్ని కర పొ 18వ స్థానాల్లో నిలిచాయి. కేరళలో (0.71%) అతి తక్కువ పేదలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక బహుముఖ పేదలు కర్నూలు లో, అతి తక్కువగా గుంటూరు జిల్లాలో ఉన్నట్లు వెల్లడించింది.
- నీతి అయోగ్ స్థాపన : 2015 జనవరి 01
- నీతి అయోగ్ కార్యాలయం : డిల్లి
- నీతి అయోగ్ పూర్తి రూపం : నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా
- నీతి అయోగ్ చైర్మన్ :భారత ప్రదాని నరేంద్ర మోడి
- నీతి అయోగ్ సియివో ; అమోతాబ్ కాంత్
క్విక్ రివ్యు :
ఏమిటి: నీతి అయోగ్ వెల్లడించిన పేదరిక సూచిలో 20వ స్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్
ఎవరు: ఆంధ్రప్రదేశ్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: నవంబర్ 26
ఆస్ట్రేలియా క్రికెట్ టెస్టు జట్టుకు కెప్టెన్ గా ప్యాట్ కమ్మిన్స్ నియామకం :

ఇంగ్లండ్ తో జరిగే యాషెస్ సిరీస్ లో బరిలోకి దిగే ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు నూతన కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ను నియమించారు. స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. పేస్ బౌలర్ కు పూర్తి స్థాయి సారథ్యం కట్టబెట్టడం ఆస్ట్రేలియా క్రికెట్లో ఇదే తొలిసారి. 1956లో ఫాస్ట్ బౌలర్ రే లింద్వాల్ ఒక టెస్టు కోసం అది కూడా తాత్కాలిక కెప్టెన్ వ్యవహరించాడు. ఇప్పుడు కమిన్స్ ఆసీస్ 47వ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. 28 ఏళ్ల కమిన్స్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున 34 టెస్టులు ఆడి 164 వికెట్లు పడగొట్టాడు.
- ఆస్ట్రేలియా దేశ రాజదాని : కాన్ బెర్రా
- ఆస్ట్రేలియా దేశ ప్రదాని : స్కాట్ మొరిసన్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆస్ట్రేలియా క్రికెట్ టెస్టు జట్టుకు కెప్టెన్ గా ప్యాట్ కమ్మిన్స్ నియామకం
ఎవరు: ప్యాట్ కమ్మిన్స్
ఎక్కడ: ఆస్ట్రేలియా
ఎప్పుడు: నవంబర్ 26
యమునా నది ప్రక్షాళన కొరకు సిక్స్ పాయింట్స్ ప్లాన్ ప్రవేశపెట్టిన డిల్లి సిఎం అరవింద్ కేజ్రివాల్ :

యమున నది వాస్తవానికి ఢిల్లీలో కలుషిత గా మారింది.న ఈ నది 22 కాలువలు ద్వారా నగరంలో దాని 22 కి.మీ విస్తీర్ణంలో మురుగునీటిని వెదజల్లుతున్నాయి మొదటి క్లీనప్ ప్రయత్నాల తర్వాత దశాబ్దాల తర్వాత CM అరవింద్ కేజ్రీవాల్ గారు ఫిబ్రవరి 2025 నాటికి నదిని ప్రక్షాళన చేసేందుకు ప్రధాన ఆరు అంశాల ప్రణాళికను నవంబర్ 26న ఆవిష్కరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు తానే స్వయంగా నదిలో స్నానం చేస్తానని చెప్పారు.ప్రకటించిన ఆరు సూత్రాల ప్లాన్ లో భాగంగా కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం ప్రస్తుతం ఉన్న STPల సామర్థ్యాన్ని పెంచడం నదిలోకి కాలుష్య కారకాలు రాకుండా చూసేందుకు కొత్త సాంకేతికతను ఉపయోగించుకోవడం నగరంలోని ప్రధాన డ్రైనేజీలను ఇన్‌సిటు ట్రీట్‌మెంట్‌కు వెళ్లడం మరియు పారిశ్రామిక వ్యర్థాలన్నింటినీ మళ్లించడం వంటి ప్రణాళికలు ఆయన ప్రణాళికలో ఉన్నాయి.
- డిల్లి ముఖ్యమంత్రి : అరవింద్ కేజ్రివాల్
- డిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ : అనిల్ బైజాల్
క్విక్ రివ్యు :
ఏమిటి: యమునా నది ప్రక్షాళన కొరకు సిక్స్ పాయింట్స్ ప్లాన్ ప్రవేశపెట్టిన డిల్లి సిఎం అరవింద్ కేజ్రివాల్
ఎవరు: డిల్లి సిఎం అరవింద్ కేజ్రివాల్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: నవంబర్ 26
స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ 2021లో అగ్రస్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలిస్ శాఖ :

ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ 2021లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి స్మార్ట్ పోలీసింగ్ సర్వే నివేదికను అందజేశారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించి మంచిపనిని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి అన్నారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని :అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ 2021లో అగ్రస్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలిస్ శాఖ
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలిస్ శాఖ
ఎప్పుడు: నవంబర్ 26
రాజ్యాంగ దినోత్సవం మరియు జాతీయ న్యాయ దినోత్సవం గా నవంబర్ 26 :

ప్రతి సంవత్సరం నవంబర్ 26న న్యాయ దినోత్సం గా మరియు రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్ కూడా జరుపుతారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థంగా నవంబర్ 26 న జరుపుకుంటారు. భారత రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది మరియు ఇది 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారు. రాజ్యాంగ సభ 26 నవంబర్, 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది మరియు ఇది 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. దీనిని దేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రాజ్యాంగ దినోత్సవం మరియు జాతీయ న్యాయ దినోత్సవం గా నవంబర్ 26
ఎప్పుడు: నవంబర్ 26
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |