
Daily Current Affairs in Telugu 25 July -2022
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంగీత, నాటక ఆకాడమీ అధ్యక్షురాలిగా దీపికా రెడ్డి నియమకం :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంగీత, నాటక ఆకాడమీ అధ్యక్షురాలిగా ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి గారు నియమితులయ్యారు ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంజులై 25న ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి మనవరాలైన దీపికారెడ్డి మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లిలో 1965 సెప్టెంబరు 15న జన్మించారు. చిన్న వాటి నుంచి నృత్యంలో ప్రావీణ్యం పొందారు కుఛిపూడి నృత్యకారిణిగా దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి పలు పురస్కారాలను పొందారు. 2016లో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ పుర స్కారం ప్రకటించింది. 2017లో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ చేతుల మీదుగా జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకు న్నారు. ఆకాడమీకి ఆమె తొలి మహిళాధ్యక్షురాలు తన నియామకంపై దీనికా రెడ్డి ముఖ్యమంత్రి లకు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సంగీత, నాటక రంగం అభ్యున్నతికి కృష్టి చేస్తానని చెప్పారు.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని : హైదరబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంగీత, నాటక ఆకాడమీ అధ్యక్షురాలిగా దీపికా రెడ్డి నియమకం
ఎవరు : దీపికా రెడ్డి
ఎక్కడ: తెలంగాణా రాష్ట్రంలో
ఎప్పుడు : జులై 25
ప్రపంచ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గా ఇందర్శిత్ గిల్ నియామకం :

ప్రపంచ బ్యాంక్ తన ముఖ్య ఆర్థికవేత్త, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఇందర్శిత్ గిల్నియమించింది. కౌశిక్ బసు తర్వాత ప్రపంచ బ్యాంకులో ముఖ్య ఆర్ధికవేత్తగా నియమితులైన రెండో భారత జాతీయుడు ఈయనే. 2012-16 మధ్య బసు ఈ బాధ్యతలను నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి గిల్ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రపంచ బ్యాంకుకే చెందిన అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్.ఎస్)కి ముఖ్య ఆర్ధికవేత్తలుగా రఘురామ్ రాజన్, గీతా గోపినాథ్ “సేవలందించిన సంగతి తెలిసిందే ‘స్థూల ఆర్థిక అసమతౌల్యాలు, వృద్ధి, పేదరికం, పర్యావరణ మార్పుల వంటి పలు అంశాల్లో తన నాయకత్వంతో పాటు విలువ కట్టలేని అనుజీవంతో గిల్ ఈ బాధ్యతలకు వన్నెలు తీసుకురాగలరని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ముఖ్య ఆర్థికవేత్త అయిన కార్మెన్ సీన్ హార్డ్ పెద్ద బాధ్యతలనే నాకు వదిలి వెళుతున్నారు. ఆమె అడుగుజాడల్లో వెళ్లేందుకు ఈ అవకాశం కలగడం గౌరవంగా భావిస్తానని గిల్ ట్వీట్ చేశారు.
- ప్రపంచ బ్యాంక్ స్థాపన : జులై 1944
- ప్రపంచ ప్రధాన కార్యాలయం : వాషింగ్టన్ డిసి (అమెరికా)
- ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ : డేవిడ్ మల్ పాస్
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గా ఇందర్శిత్ గిల్నియామకం
ఎవరు : ఇందర్శిత్ గిర్
ఎప్పుడు : జులై 25
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ లో అగ్రస్థానం లో నిలిచిన అమెరికా దేశం :

సరికొత్త ప్రపంచ రికార్డులు అబ్బురపరిచే అథ్లెట్ల విన్యాసాలు ట్రాక్ పై పరుగులు ఇలా పది రోజుల పాటు ఎన్నో గొప్ప ప్రదర్శనలకు, భావోద్వేగాలకు వేదికగా మారిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ముగిసింది. తొలిసారి ఈ పోటీలకు ఆతిధ్య మిచ్చిన అమెరికా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. 13 స్వర్ణాలు, 9. రజతాలు, 11 కాంస్యాలు: తో మొత్తం 33 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది, జమైకా వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా చారిత్రక రజతంతో భారత్ 33వ స్థానాన్ని సొంతం చేసుకుంది. పోటీల చివరి రోజూ అమెరికా పెత్తనం సాగింది. 4-400 మీటర్ల రిలేలో పురుషులు, మహిళల బంగారు పతకాలు ఆ దేశానికే దక్కాయి. 4-400మీ మిక్సి లేలో కాంస్యం తర్వాత ట్రాక్ కు’ గుడ్ బై చెప్పి. ఆ తర్వాత తన నిర్దయాన్ని వాయిదా వేసుకున్న దిగ్గజం అలీసన్ ఫెలిక్స్ ఇప్పుడు స్వర్ణంతో ఘనంగా ముగింపు పలికింది. మహిళల 4.400 మం రిలేలో హిట్స్ లో ఆమె పరుగెత్తింది. ఫైనల్లో తలిత, స్టెయినర్, బ్రిబాన్ మెక్టాలిన్ కూడిన అమెరికా జట్టు పోటీల్లో సరికొత్త రికార్డు (3.17 705) ప్రదర్శనతో విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ లో అగ్రస్థానం లో నిలిచిన అమెరికా దేశం
ఎవరు : అమెరికా దేశం
ఎక్కడ: అమెరికా దేశంలో
ఎప్పుడు : జులై 25
భారత దేశ 15 వ రాష్ట్ర పతి గా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము :

నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన తాను దేశ అత్యున్నత రాజ్యాంగ పీఠాన్ని అధిష్టించడం భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమని నూతన రాష్ట్రపతి, ద్రౌపదీ ముర్ము గారు అన్నారు. రాష్ట్రపతిగా తాను ఎన్నికవడాన్ని. దేశంలోని పేదలందరూ సాధించిన ఘనతగా అభివర్ణించారు. నిరు పేదలూ తమ కలల్ని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు తాజాగా తనకు దక్కిన గౌరవమే సాక్ష్యమని వ్యాఖ్యానించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది జులై 25న బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్ ఎన్. వి. రమణ ‘పార్లమెంటు సెంట్రల్ హాలులో ఆమెతో ప్రమాణం చేయించారు. అతిపిన్న వయసులో రాష్ట్రపతి పీటాన్ని దక్కించుకున్న వ్యక్తిగా ద్రౌపది (64) ఘనత సాధించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆమె 18 నిమిషాలకు పైగా ప్రసంగించారు. సంప్రదాయ ఆదివాసీ అభివాదమైన ‘జోహార్‌తో ప్రసంగాన్ని ప్రారంభించి.గతాన్ని గుర్తుచేస్తూనే భారత భవిష్యత్ – ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత దేశ 15 వ రాష్ట్ర పతి గా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము
ఎవరు : ద్రౌపది ముర్ము
ఎప్పుడు : జులై 25
2వ వార్షిక IUCN WCPA ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు 2022ని గెలుచుకున్న ఒరాంగ్ నేషనల్ పార్క్ :

అస్సాంలో ఉన్న ఒరాంగ్ నేషనల్ పార్క్ & టైగర్ రిజర్వ్, ప్రతిష్టాత్మకమైన 2వ వార్షిక IUCN WCPA ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు 2022ని అందుకుంది. ఈ అవార్డును ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) మరియు వరల్డ్ కమీషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ (WCPA) భూమి యొక్క అడవి ప్రదేశాలు మరియు వన్యప్రాణులను రక్షించడానికి మరియు స్థానిక సంఘాలకు మద్దతు ఇవ్వడానికి విధికి మించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షిత ప్రాంతాలలో రేంజర్ల అద్భుతమైన పనిని గుర్తిస్తు ఈ అవార్డు ను ఇస్తారు. రువాండాలోని కిగాలీలో జరిగిన IUCN ఆఫ్రికన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కాంగ్రెస్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించారు. మొత్తంగా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా మరియు ఆస్ట్రేలియాలోని పది దేశాల నుండి ఏదు వ్యక్తిగత రేంజర్లు మరియు మూడు రేంజర్ జట్లు గుర్తించబడ్డాయి. ఇంకా, పులులు ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న రేంజర్లకు ఇద్దరు విజేతలు ప్రత్యేక అవార్డులు అందుకున్నారు.
- అస్సాం రాష్ట్ర రాజధాని : దిస్పూర్
- అస్సాం రాష్ట్ర సిఎం : హిమంత బిశ్వశర్మ
- అస్సాం రాష్ట్ర గవర్నర్ : జగదీశ్ ముఖి
క్విక్ రివ్యు :
ఏమిటి : 2వ వార్షిక IUCN WCPA ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు 2022ని గెలుచుకున్న ఒరాంగ్ నేషనల్ పార్క్
ఎవరు : ఒరాంగ్ నేషనల్ పార్క్
ఎక్కడ: అస్సాంలో
ఎప్పుడు : జులై 25
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |