Daily Current Affairs in Telugu 25 August-2022
IMFలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కె సుబ్రమణియన్ నియామకం :

IMFలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కె సుబ్రమణియన్‌ను ప్రభుత్వం నియమించింది మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అతని పదవీకాలం నవంబర్ 2022 నుండి ప్రారంభమవుతుంది & 3 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సుర్జిత్ భల్లా తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు IMFలో భారతదేశానికి డైరెక్టర్ -సుబ్రమణియన్ 2018 మరియు 2021 మధ్య ఆర్థిక మంత్రిత్వ శాఖలో అతి పిన్న వయస్కుడైన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్.
- ఐ.ఎం.ఎఫ్ పూర్తి రూపం : ఇంటర్ నేషనల్ మానిటరింగ్ ఫండ్
- ఐ.ఎం.ఎఫ్ స్థాపన : జులై 1944
క్విక్ రివ్యు :
ఏమిటి : IMFలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కె సుబ్రమణియన్ నియామకం
ఎవరు : కె సుబ్రమణియన్:
ఎప్పుడు : ఆగస్ట్ 25
హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్లో బిజినెస్ మ్యాగజైన్ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్ అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦:

హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్లో ఏపీకి అవార్డు వ్యాపారాన్ని సులభతరం చేయడంలో (ఈవోడీబీ) సంస్కరణల అమలు, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ లో నాయకత్వ స్థానంలో ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ కు బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ ‘టైమ్స్’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈమేరకు ఢిల్లీలో రువాగురంఆగస్ట్ 25న రాత్రి నిర్వహించిన ‘డిజిటెక్ కాంక్లేవ్ 2022 లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అవార్డు స్వీకరించారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వా భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి : హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్లో బిజినెస్ మ్యాగజైన్ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్ అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦
ఎప్పుడు : ఆగస్ట్ 25
డీఆర్డీఓ చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గా సమీర్ వి.కామత్ నియామకం :

కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సమీర్ వి.కామత్ గారు నియమితులయ్యారు. ఇదే సమయంలో ఆయన్ను డిపార్ట్మెంట్ అఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగానూ నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 25న ఉత్తర్వులు జారీచేసింది. ఈయనది 60 ఏళ్లు వచ్చేవరకూ ఈ పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొంది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న జి.సతీష్ రెడ్డిని రక్షణమంత్రి రాజానాధ్ సింగ్ ను శాస్త్ర సలహాదారుగా నియమించింది. కామత్ 1999లో సైంటిస్టన్ హోదాలో హైదరాబాద్ ఆలి డేట్ ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ మెటలర్టికల్ రీసెర్చ్ లేబొరేట రీలో ఉద్యోగజీవితం ప్రారంభించారు. గత మూడు దశాబ్దాల్లో ఆయన రక్షణ రంగానికి బహుముఖ సేవలు అందించారు.
- డి.ఆర్.డి.వో పూర్తి రూపం : డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్
- డి.ఆర్.డి.వో స్థాపన :1958
- డి.ఆర్.డి.వో ప్రధాన కార్యాలయం :న్యుడిల్లి
క్విక్ రివ్యు :
ఏమిటి : డీఆర్డీఓ చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గా సమీర్ వి.కామత్ నియామకం
ఎవరు : వి.కామత్
ఎప్పుడు : ఆగస్ట్ 25
లైఫ్ స్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అంబాసిడర్ గా ఎంపికైన నిఖత్ జరీన్ :

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత నిఖత్ జరీన్ లైఫ్ స్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అంబాసిడర్ గా ఎంపికైంది. ఆగస్ట్ 24న ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో లైఫెస్పాన్ అధినేత నరేంద్రరామ్ నంబుల.. నిఖతకు ఒప్పంద పత్రాన్ని అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లైఫ్ స్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అంబాసిడర్ గా ఎంపికైన నిఖత్ జరీన్
ఎవరు : నిఖత్ జరీన్
ఎప్పుడు : ఆగస్ట్ 25
ప్రతిభావంతులైన అథ్లెట్లను తీర్చిదిద్దడం కోసం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ అకాడమీతో ఒప్ప్దందం కుదుర్చుకున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ :

ప్రతిభావంతులైన అథ్లెట్లను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే. లక్ష్యంగా పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ అకాడమీతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ (టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్) చేతులు కలిపింది. గోపీచంద్ ఫౌండేషన్ టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం గోపీచంద్ ఫౌండేషన్ సత్తా ఉన్న అథ్లెట్లను గుర్తించి వారికి అత్యుత్తమ మౌలిక వసతులు కల్పిస్తూ అత్యున్నత స్థాయి శిక్షణ ఇవ్వనుంది. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ద్రోణాచార్య అవార్డ్ ఇవ్వనుంది. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్, టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిభావంతులైన అథ్లెట్లను తీర్చిదిద్దడం కోసం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ అకాడమీతో ఒప్ప్దందం కుదుర్చుకున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ :
ఎవరు : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ
ఎక్కడ : తెలంగాణ
ఎప్పుడు : ఆగస్ట్ 25
ఆసియా కప్ 2022 గాను తాత్కాలిక ప్రధాన కోచ్ గా వి.వి ఎస్ లక్ష్మణ్ ఎంపిక :

ఆసియా కప్ 2022 కోసం భారత క్రికెట్ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్ మాజీ క్రికెటర్ VVS. లక్ష్మణ్ ఎంపికయ్యాడు. కోవిడ్-19కి పాజిటివ్ గా పరీక్షించిన తర్వాత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టుతో కలిసి ప్రయాణించలేదని BCCI ధృవీకరించిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా కప్ 2022 గాను తాత్కాలిక ప్రధాన కోచ్ గా వి.వి ఎస్ లక్ష్మణ్ ఎంపిక :
ఎవరు : వి.వి ఎస్ లక్ష్మణ్
ఎప్పుడు : ఆగస్ట్ 25
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |