
Daily Current Affairs in Telugu 25-April-2022
‘వరల్డ్ స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్న మ్యాక్స్ వెర్ స్టాపెన్ :

ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్ వెర్ స్టాపెన్, ఒలింపిక్ స్ప్రింట్ క్వీన్ అయిన ఎలైన్ థాంప్సన్ హెరా 2022 గాను రెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ కార్యక్రమంలో అత్యుత్తమ పురస్కారాలు పొందారు. వెర్ స్టాపెన్ ‘వరల్డ్ స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. హెరా.. “వరల్డ్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. టెన్నిస్ స్టార్ రదుకాను ‘బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని అందుకుంది. ఇటలీ పురుషుల ఫుట్బాల్ జట్టు ‘వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘వరల్డ్ స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్న మ్యాక్స్ వెర్ స్థాపెన్
ఎవరు: మ్యాక్స్ వెర్ స్థాపెన్
ఎప్పుడు: ఏప్రిల్ 25
ICDA టి 20 నేషనల్ క్రికెట్ చాంపియన్ షిప్ 2022నిర్వహించనున్న మహారాష్ట్ర :

ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ (ICDA) ఏప్రిల్ 26 నుంచి 29 మద్య ముంబై లో జరగనున్న బధిరుల కోసం ఏర్పాటు చేసిన మహిళల 3వ టి 20 నేషనల్ క్రికెట్ చాంపియన్ షిప్ 2022 నిర్వహిస్తుంది. ఇది నాలుగు రోజుల పాటు జరిగే టోర్నమెంట్ దేశవ్యాప్తంగా ఎనిమిది జట్లు గౌరవనియమైన టి 20 చాంపియన్ షిప్ టైటిల్ కోసం పోటీ పడతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ICDA టి 20 నేషనల్ క్రికెట్ చాంపియన్ షిప్ 2022నిర్వహించనున్న మహారాష్ట్ర
ఎవరు: మహారాష్ట్ర
ఎప్పుడు: ఏప్రిల్ 25
జాతీయ ఛాయెయన్ గా నిలిచిన తెలంగాణా యువ క్రీడాకారిణి శ్రీజ :

తెలంగాణ యువటేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. గత కొంతకాలంగా సంచలన ప్రదర్శనతో దూసుకెక్తోన్న 23 ఏళ్ల ఆమె. ఇప్పుడు జాతీయ ఛాయెయన్ గా నిలిచింది. తెలంగాణా రాష్ట్రం నుంచి ఆ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా ఈ రికార్డు నమోదు చేసింది. మహిళల సింగిల్స్ పాటు డబుల్స్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. జాతీయ సీనియర్, అంతర్ రాష్ట్ర టీటే చాంపియన్ షిప్స్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె 4-1 (11-8. 11-13, 12-10, 11-8. 11-6) తేడాతో మామా దాస్ (పీఎస్ సీబీ)పై గెలిచింది. తొలి గేమ్ నెగ్గి దూకుడు ప్రదర్శించిన శ్రీజకు రెండో గేమ్ లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన తప్పలేదు. ఆ గేమ్ ఓడిపోయినప్పటికీ తిరిగి పుంజు సాగిన మూడో గేమ్ లో పైచేయి సాధించింది. అదే జోరుతో మిగతా రెండు గేమ్ లో గెలిచి విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ ఛా౦పియన్ గా నిలిచిన తెలంగాణ యువ క్రీడాకారిణి శ్రీజ
ఎవరు: యువ క్రీడాకారిణి శ్రీజ
ఎప్పుడు: ఏప్రిల్ 25
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్కురాలు ఐన కానే టనాకే కన్నుమూత :

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించిన కానే రనాకా 119వ ఏట కన్నుమూశారు. నైరుతి జపాన్లోని పుకోకా పట్టణానికి చెందిన ‘ఆమె ఈ నెల 19న తుదిశ్వాస విడిచారని జపాన్ ప్రభుత్వం ఏప్రిల్ 24న ప్రకటించింది. 2019 మార్చి నెలలో గిన్నిస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా కానేను గుర్తించింది. అప్పటికి ఆమెకు 116 ఏళ్లు. అలాగే, 2020 సెప్టెంబరులో అత్యంత ఎక్కువ కాలం జీవించిన జపాన్ వ్యక్తిగా కానే రికార్డు సృష్టించారు. అప్పటికి ఆమె వయసు 117 సంవత్స 261 రోజులు. ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం బతికిన రెండో వ్యక్తిగా కూడా ఆమె రికా ర్తులకు ఎక్కారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్కురాలైన కానే టనాకే కన్నుమూత
ఎవరు: కానే టనాకే
ఎప్పుడు: ఏప్రిల్ 25
‘మేరా రేషన్’ మొబైల్ యాప్‌ను ప్రారంబించిన కేంద్ర ప్రభుత్వం :

భారత దేశంలో ‘నే వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్’ వ్యవస్థను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘మేరా రేషన్’అనే ఒక మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ మొబైల్ యాప్ ద్వారా సమీపంలోని సరసమైన ధరల దుకాణాన్ని గుర్తించడంలో దేశ పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘మేరా రేషన్’ మొబైల్ యాప్‌ను ప్రారంబించిన కేంద్ర ప్రభుత్వం
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎప్పుడు: ఏప్రిల్ 25
ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25 :

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా మలేరియాను నిరోధించడానికి మరియు నియంత్రించడానికి నిరంతర పెట్టుబడి మరియు నిరంతర రాజకీయ నిబద్దత యొక్క అవసరాన్ని హైలెట్ చేయానికి ప్రపంచ మలేరియా దినోత్సవం గా జరుపుకుంటారు. డబ్ల్యు.హెచ్.వో ప్రకారం 2020 సంవత్సరం లో 85 దేశాలలో 241 మిలియన్ల కొత్త మలేరియా కేసులు మరియు 627,000 మలేరియా సంబంధిత మరణాలు సంభవించాయి.2007 లో డబ్ల్యు.హెచ్.వో ఆఫ్రికా మలేరియా దినోత్సవం నుంచి ఈ ఆలోచనను రూపొందించింది .ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ యొక్క 60 వ సెషన్ లో ఇది WHO చే స్పాన్సర్ చేయబడింది. ఆఫ్రికా మలేరియా దినోత్సవాన్ని ప్రపంచ మలేరియా దినోత్సవం మార్చాలని ప్రతిపాదించింది.2022 సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి హర్నేస్ ఆఫ్ ఇన్నోవేషన్ టు రెడ్యూస్ ది మలేరియా డిసీస్ బర్డెన్ అండ్ సేవ లైవ్స్ గా ఉంది “ఏప్రిల్ 25 కేంద్ర మంత్రి మన్సుఖ్ మండవియ ప్రపంచ మలేరియా దినం గా 2022 స్మారక కార్యక్రమంలో ప్రసంగిచారు. ఈకార్యక్రమం లో ఆరోగ్య మంత్రి 2030 నాటికి భారతదేశం నుంచి నిర్మూలన యొక్క నిబద్దతను ద్రువికరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25
ఎప్పుడు: ఏప్రిల్ 25
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |