
Daily Current Affairs in Telugu 25-03-2022
2022 సంవత్సరానికి అబెల్ బహుమతిని అందుకున్న డెన్నిస్ పార్నెల్ :

నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ 2022 సంవత్సరానికి గాను అబెల్ బహుమతిని అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు డెన్నిస్ పార్నెల్ సుల్లివన్ కు అందజేసింది. టోపోలాజీలో బీజగణితం, రేఖాగణిత మరియు డైనమిక్ అంశాలలో అతని అద్భుతమైన రచనలకు గాను ఈ అవార్డు ఇవ్వబడింది.. టోపోలాజీ అనేది స్థలం మరియు ఆకృతుల యొక్క అధ్యయనం. అబెల్ బహుమతి విజేత గణితశాస్త్రంలో నోబెల్ కి సమానం ఏబెల్ ప్రైజ్ ను నార్వే రాజు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అత్యుత్తమ గణిత శాస్త్రజ్ఞులకు ప్రదానం చేస్తారు. కాగా దీనికి నార్వేజియన్ గణిత శాస్త్రజ్ఞుడు అయిన నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు పెట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2022 సంవత్సరానికి అబెల్ బహుమతిని అందుకున్న డెన్నిస్ పార్నెల్
ఎవరు: డెన్నిస్ పార్నెల్
ఎప్పుడు: మార్చ్ 25
నీతి అయోగ్ విడుదల చేసిన ఎగుమతుల సంనద్దత జాబితాలో మొదటి స్థానం లో నిలిచిన గుజరాత్ :

నీతి ఆయోగ్ రూపొందించే ఎగుమ తులు సన్నద్ధత జాబితా -2021లో గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానం లభించింది. వివిధ రాష్ట్రాల యొక్క ఎగుమతి సామర్ధ్యం వాటి సంసిద్ధత ఆధారంగా ఈ జాబితాను తయారు చేస్తారు. వరుసగా రెండో సంవత్సర కూడా గుజరాత్ ఇందులో టాప్ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హరియాణ, యూపీ, ఎంపీ, పంజాబ్, ఏపీ, తెలంగాణ నిలిచాయి. లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, లడఖ్, మేఘాలయ చివరి స్థానాల్లో ఉన్నాయి.
- గుజరాత్ రాష్ట్ర రాజధాని :గాంధీ నగర్
- గుజరాత్ రాష్ట్ర సిఎం :భూపేంద్ర భాయ్ పటేల్
- గుజరాత్ రాష్ట్ర గవర్నర్ : ఆచార్య దేవ్ వ్రత్
క్విక్ రివ్యు :
ఏమిటి: నీతి అయోగ్ విడుదల చేసిన ఎగుమతుల సంనద్దత జాబితాలో మొదటి స్థానం లో నిలిచిన గుజరాత్ :
ఎవరు: గుజరాత్ రాష్ట్రము
ఎప్పుడు: మార్చ్ 25
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) తదుపరి డైరెక్టర్ గా గిల్బర్ట్ ఎఫ్ హాంగ్భో ఎన్నిక :

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) తదుపరి డైరెక్టర్ జనరల్ టోగో నుండి గిల్బర్ట్ ఎఫ్. హౌంగ్బో ఎన్నికయ్యారు. హౌంగ్బో ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (IFAD) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. జెనీవాలో జరిగిన వారి సమావేశంలో ప్రభుత్వాలు, కార్మికులు మరియు యజమానుల ప్రతినిధులతో కూడిన ILO యొక్క పాలకమండలిచే అతను ఎన్నుకోబడ్డాడు. అతను ILO యొక్క 11వ డైరెక్టర్ జనరల్ ఉండనున్నారు. మరియు ఈ కొత్త డైరెక్టర్ జనరల్ యొక్క ఐదేళ్ల పదవీకాలం 1 అక్టోబర్ 2022న ప్రారంభమవుతుంది. యునైటెడ్ కింగ్ డంకు చెందిన ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గా గై రైడర్ 2012 నుండి ఆ పదవి నిర్వహిస్తున్నారు.
- ILO రాజధాని : జెనివా (స్విట్జర్ ల్యాండ్)
- ILO స్థాపన :1919
- ILO పూర్తి రూపం :ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) తదుపరి డైరెక్టర్ గా గిల్బర్ట్ ఎఫ్ హాంగ్భో ఎన్నిక
ఎవరు: గిల్బర్ట్ ఎఫ్ హాంగ్భో
ఎప్పుడు: మార్చ్ 25
భారత్ లో నూతన నేపాల్ రాయబారిగా బాద్యతలు స్వీకరించిన డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ :

భారతదేశంలో కొత్తగా నియమితులైన నేపాల్ రాయబారి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వం సిఫార్సుపై అధ్యక్షుడు భండారీ మార్చి 20న భారతదేశంలో కొత్త రాయబారిగా ఆర్థికవేత్త మరియు మాజీ US రాయబారి డాక్టర్ శర్మను నియమించారు. గత ప్రభుత్వం నియమించిన అంబాసిడర్ నీలాంబర్ ఆచార్యను ఆరు నెలల క్రితం ఢిల్లీ నుంచి వెనక్కి పిలిపించడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. కాగా శర్మ గతంలో అమెరికాలో నేపాల్ రాయబారిగా పనిచేశారు. అతను 2002 మరియు 2006 మధ్య జాతీయ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ గా కూడా పనిచేశాడు.
- నేపాల్ దేశ రాజధాని :ఖాట్మండు
- నేపాల్ దేశ ప్రదాని :షేర్ బహాదోర్ దేబా
- నేపాల్ దేశ అద్యక్షుడు : బిడ్యా దేవి బండారి
- నేపాల్ దేశ రాష్ట్రపతి కార్యాలయం పేరు : శీతల్ నివాస్
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లో నూతన నేపాల్ రాయబారిగా బాద్యతలు స్వీకరించిన డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ
ఎవరు: డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ
ఎక్కడ: నేపాల్ దేశం
ఎప్పుడు: మార్చ్ 25
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిఎం గా రెండో సారి ప్రమాణ స్వేకారం చేసిన యోగి నాథ్ ఆదిత్యానాథ్ :

ఉత్తరప్రదేశ్ లో సరికొత్త శకం మొదలైంది! ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సహా భాజపాకు చెందిన పలువురు అతిరథ మహారధుల సమక్షంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి సర్కారు 2.0 మార్చ్ 25న కొలువుదీరింది. 52 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ కమలదళం సీనియర్ నేత కేశవ సాద్ మౌర్య డిప్యూటీ సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. ఆయనతో పాటు మరో సీనియర్ నాయ కు ప్రదేశ్ పాక్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. లఖ్ నవూలో అట్టహసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి. నడ్డా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిహార్ సీఎం “సితీశ్ కుమార్ ప్రముఖులు హాజరయ్యారు.
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని :లక్నో
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిఎం : యోగినాద్ ఆదిత్యానాద్
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : ఆనంది బెన్ పటేల్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిఎం గా రెండో సారి ప్రమాణ స్వేకారం చేసిన యోగి నాథ్ ఆదిత్యానాథ్
ఎవరు: యోగి నాథ్ ఆదిత్యానాథ్
ఎక్కడ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
ఎప్పుడు: మార్చ్ 25
బాయ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పుల్లెల గోపి చంద్ :

భారత బ్యాడ్మింటన్ జట్టు చీప్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారు బాయ్ కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మార్చ్ 25న జరిగిన బ్యాడ్మింటన్ సంఘ సర్వసభ్య సమావేశంలో అతడిని ఈ పదవికి ఎన్నుకున్నారు. 2022-2026 వరకు గోపి ఉపాధ్య క్షుడిగా కొనసాగుతారు. కాగా హిమంత బిశ్వశర్మ మళ్లీ బాయ్ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ప్రస్తుతం అసోం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వా శర్మ 2017లో తొలిసారి బాయ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతడు ఆసియా బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడిగా, ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సర్వసభ్య మండలి సభ్యుడిగా ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా సంజయ్ మిశ్రా ఎన్నిక కాగా ఇప్పటిదాకా ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్ కుమార్ సింఘానియా ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు.
- బాయ్ స్థాపన :1934
- బాయ్ ప్రదాన కార్యాలయం :న్యూ డిల్లి
క్విక్ రివ్యు :
ఏమిటి: బాయ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పుల్లెల గోపి చంద్
ఎవరు: పుల్లెల గోపి చంద్
ఎప్పుడు: మార్చ్ 25
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |