
Daily Current Affairs in Telugu 25-02-2022
రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్ కు భారత తదుపరి రాయబారిగా మనోజ్ కుమార్ నియామకం :

రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్కు భారత తదుపరి రాయబారిగా మనోజ్ కుమార్ మహపాత్రను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 25న నియమించింది. మనోజ్ కుమార్ మోహపాత్ర గారు 2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి. ప్రస్తుతం ఈయన గ్వాటెమాల రిపబ్లిక్ భారత రాయబారిగా పనిచేస్తున్నారు. అతను తన ప్రస్తుత పదవిని కొనసాగిస్తాడు. ప్రస్తుతం ఆయన గ్వాటెమాల రిపబ్లిక్ లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. అతను తన ప్రస్తుత పదవిని కొనసాగిస్తాడు మరియు ఎల్ సాల్వడారు తదుపరి రాయబారిగా ఏకకాలంలో పదవిలో ఉన్న అధికారిగా గుర్తింపు పొందాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్ కు భారత తదుపరి రాయబారిగా మనోజ్ కుమార్ నియామకం
ఎవరు: మనోజ్ కుమార్
ఎక్కడ: రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్
ఎప్పుడు: ఫిబ్రవరి 25
బహిరంగ ప్రదేశాల్లో జంతు వధను నిషేధించిన త్రిపుర హైకోర్టు :

త్రిపుర రాష్ట్ర హైకోర్టు ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో జంతు వధను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరియు ప్రజలు వినియోగించే మాంసం నాణ్యతపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపాదిత కబేళా పని ప్రారంభించే వరకు మానవ వినియోగం కోసం జంతువులను వధించే తాత్కాలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని త్రిపుర రాష్ట్ర హైకోర్ట్ అగర్తల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది.
- త్రిపుర రాష్ట్ర రాజధాని :అగర్తల
- త్రిపుర సిఎం : బిప్లవ్ కుమార్ దేవ్
క్విక్ రివ్యు :
ఏమిటి: బహిరంగ ప్రదేశాల్లో జంతు వధను నిషేధించిన త్రిపుర హైకోర్టు
ఎవరు: త్రిపుర హైకోర్టు
ఎక్కడ: త్రిపుర
ఎప్పుడు: ఫిబ్రవరి 25
పాకిస్థాన్ ఆర్మీ లో తొలిసారిగా హిందూ అధికారి కెలాష్ కుమార్ నియామకం :

పాకిస్థాన్ ఆర్మీ తొలిసారిగా హిందూ అధికారి కెలాష్ కుమార్ కు లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి పదోన్నతి కల్పించినట్లు ఏఆర్ వై న్యూస్ తెలిపింది. సింధ్ ప్రావిన్స్ లోని థార్పార్కర్ ప్రాంతానికి చెందిన కుమార్ మైనారిటీ కమ్యూనిటీ నుండి ఈ పదవిని చేపట్టిన దేశంలోనే మొదటి అధికారి. 2019 లో అతను పాకిస్తాన్ సైన్యంలో మొదటి హిందూ మేజర్ అయ్యాడు. మరియు రక్షణ మంత్రిత్వ శాఖలో నియమించబడ్డాడు. బర్మింగ్ హం యూనివర్సిటీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ సిరీస్ ప్రోగ్రామ్ కు ఎంపికైన మొదటి హిందూ అధికారి కూడా ఈయనే.
- పాకిస్తాన్ దేశ రాజధాని : ఇస్లామాబాద్
- పాకిస్తాన్ దేశ కరెన్సీ : పాకిస్తాన్ రుపయ
- పాకిస్తాన్ దేశ ప్రదాని : ఇమ్రాన్ ఖాన్
- పాకిస్తాన్ దేశ అద్యక్షుడు : ఆరిఫ్ ఆల్వి
క్విక్ రివ్యు :
ఏమిటి: పాకిస్థాన్ ఆర్మీ లో తొలిసారిగా హిందూ అధికారి కెలాష్ కుమార్ నియామకం
ఎవరు: కెలాష్ కుమార్
ఎక్కడ: పాకిస్థాన్
ఎప్పుడు: ఫిబ్రవరి 25
డిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అనూప్ కుమార్ మెందీరత్తా నియామకం :

కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అనూప్ కుమార్ మెందీరత్తా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జ్యుడీషియల్ అధికారిగా ఆయనకున్న సీనియారిటీని ఆధారంగా చేసుకొని అనూప్ ను ఆ పదవిలో నియమించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని ఓ హైకోర్టు జడ్జిగా నియమించడం ఇదే తొలిసారి. అనూప్ 2019 అక్టోబరులో న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన దిల్లీలో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా ఉన్న వ్యక్తిని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా నియమించడం అదే తొలి సారి. ప్రస్తుతం అనూప్ తో పాటు మరో ముగ్గురు జ్యుడీషియల్ అధికారులు నీనా బన్సల్ కృష్ణ, దినేశ్ కుమార్ శర్మ, సుధీర్ కుమార్ జైన్ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.
- డిల్లి రాష్ట్ర సిఎం : అరవింద్ కేజ్రివాల్
క్విక్ రివ్యు :
ఏమిటి: డిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అనూప్ కుమార్ మెందీరత్తా నియామకం
ఎవరు: అనూప్ కుమార్ మెందీరత్తా
ఎక్కడ: డిల్లీ
ఎప్పుడు: ఫిబ్రవరి 25
అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిగా నామినేట్ అయిన కెటాన్జీ బ్రౌన్ జాక్సన్ నామినేట్ :

అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిగా కెటాన్జీ బ్రౌన్ జాక్సన్ (51)ను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేయనున్నట్లు ఫిబ్రవరి 25న శ్వేతసౌధం నుంచి ఓ ప్రకటన వెలువడింది. తొలి నల్ల జాతీయురాలు దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించనుండటం చారిత్రక పరిణామం. గత రెండు శతాబ్దాలుగా శ్వేత జడ్జీలతోనే కొనసాగుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కూర్పులో వైవిధ్యాన్ని తీసుకువస్తామని అమెరికా అద్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు జాక్సన్ తో కలిసి అధ్యక్షుడు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ వేసవికాలం చివర పదవీ విరమణ పొందనున్న జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ (83) స్థానంలో జాక్సన్ నియామకం జరగనుంది.
- అమెరికా దేశ రాజధాని : వాషింగ్టన్ డిసి
- అమెరికా దేశ కరెన్సీ : అమెరికన్ డాలర్
- అమెరికా దేశ అద్యక్షుడు : జో బైడెన్
- అమెరికా దేశ ఉపద్యక్షురాలు : కమలా హ్యారిస్
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిగా నామినేట్ అయిన కెటాన్జీ బ్రౌన్ జాక్సన్ నామినేట్
ఎవరు: కెటాన్జీ బ్రౌన్ జాక్సన్
ఎక్కడ: : అమెరికా
ఎప్పుడు: ఫిబ్రవరి 25
ప్రొ కబడ్డీ లీగ్ లో తొలిసారి చాంపియన్ గా అవతరించిన దబంగ్ ఢిల్లీ జట్టు :

ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబంగ్ ఢిల్లీ జట్టు తొలిసారి చాంపియన్ గా అవతరించింది. ఫిబ్రవరి 25న హోరాహోరీగా జరిగిన ఎనిమిదో సీజన్ ఫైనల్లో దబంగ్ ఢిల్లీ 97-96తో గతంలో మూడుసార్లు చాంపియన్ గా నిలిచిన పట్నా పైరేట్స్ ను విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు రన్నరప్ పట్నా జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్ మనీగా లభించాయి. ఫైసల్లో ఢిల్లీ తరపున రెయిడర్లు నవీన్ కుమార్, విజయ్ మాలిక్ అద్భుత ప్రదర్శన చేశారు. విజయ్ 14 పాయింట్లు. నవీన్ 19 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరపున సచిన్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. పీకేఎల్ ఎనిమిదో సీజన్లో నవీస్ (ఢిల్లీ; రూ. 20 లక్షలు) ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా, మోహిత్ గోయట్ (పుణేరి పల్షన్; 8 లక్షలు) ‘ఏమర్జింగ్ ప్లేయర్ గా మొహమ్మద్ రెజా (పట్నా: రూ.15 లక్షలు) ‘బెస్ట్ డిఫెండర్ గా ,పవన్ సెహ్రావత్ (బెంగళూరు బుల్స్: రూ. 15 లక్షలు) ‘ బెస్ట్ రెయిడర్’గా అవార్డు లను సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రొ కబడ్డీ లీగ్ లో తొలిసారి చాంపియన్ గా అవతరించిన దబంగ్ ఢిల్లీ జట్టు
ఎవరు: దబంగ్ ఢిల్లీ జట్టు
ఎప్పుడు: ఫిబ్రవరి 25
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |