
Daily Current Affairs in Telugu 24&25 October – 2022
అమెరికాలో అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ లాంగ్ లీఫ్ ఫైన్ గెలుచుకున్న స్వదేశ్ చటర్జీ :

ప్రముఖ భారతీయ అమెరికన్ ఉద్యమ కర్త గత మూడు దశాబ్దాలుగా భారత్ అమెరికా సంబందాల బలోపేతానికి విశేష కృషి చేసిన స్వదేశ్ చటర్జీ కి ఒక అరుదైన గౌరవం దక్కింది.అమెరికాలో అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ లాంగ్ లీఫ్ ఫైన్ తో సత్కరించింది. కేరి లో అక్టోబర్ 25 న జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ రే కూపర్ చటర్జీ కి ఈ పురస్కారం అందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికాలో అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ లాంగ్ లీఫ్ ఫైన్ గెలుచుకున్న స్వదేశ్ చటర్జీ
ఎవరు : స్వదేశ్ చటర్జీ
ఎక్కడ : అమెరికాలో
ఎప్పుడు అక్టోబర్ 24
భారత పర్యటనకు రానున్న సౌది అరేబియా దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ :

సౌది అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్ కు రానున్నారు. జి 20 సదస్సులో పాల్గొనేందుకు వేలుతో మార్గం మద్యలో భారత్ ను సందర్శించనున్నారు.నవంబర్ 14న తేది ఉదయం ఆయన భారత్ కు చేరుకొని ఆ రోజు సాయంత్రం జి 20 సదస్సు నిమిత్తం ఇండోనేసియ లో ని బాలి కి వెళ్లనున్నారు.గత నెల ప్రదాని నరేంద్ర మోడి గారు విదేశాంగ మంత్రిత్వ శాఖ జై శంకర్ గారి ద్వారా ఆయన కు ఆహ్వానం పంపించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత పర్యటనకు రానున్న సౌది అరేబియా దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్
ఎవరు : మహ్మద్ బిన్ సల్మాన్
ఎక్కడ : సౌది అరేబియా దేశం
ఎప్పుడు అక్టోబర్ 24
బ్రిటన్ ప్రధాన మంత్రి గా ఎన్నికైన భారత సంతతి నేత రిషి సునాక్ :

బ్రిటన్లో భారత సంతతి నేత రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. పోగొట్టుకున్న చోటే రాబట్టుకున్న చందాన.గత నెలలో చేజారిన ప్రధాని పదవిని తాజాగా దక్కించుకున్నారు. పాలక కన్జర్వేటివ్ పార్టీ అధినాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై. సగర్వంగా ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. తద్వారా దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించారు. పాలనలో ఇటీవల చోటుచేసుకున్న పొరపాట్లను సరిదిద్ది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడమే తన లక్ష్యమని సునాక్ ప్రకటించారు. ప్రధానిగా ఆయన ఎన్నికతో బ్రిటన్ లో భారత సంతతి ప్రజలు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఇటు భారత్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. హిందూ మతానికి చెందిన సునాక్ ప్రధానమంత్రి పదవిని చేపట్టడం దీపావళి రోజునే ఖరారు కావడంపై అనేక మంది సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. మరోవైపు తన నేతృత్వంలోని కేబినెట్లో భారత సంతతి నాయకురాలు సుయెల్లా ‘బ్రేవర్మను హోంశాఖకు కొత్త ప్రధాని కేటాయించారు
క్విక్ రివ్యు :
ఏమిటి : బ్రిటన్ ప్రధాన మంత్రి గా ఎన్నికైన భారత సంతతి నేత రిషి సునాక్
ఎవరు : భారత సంతతి నేత రిషి సునాక్
ఎక్కడ : బ్రిటన్
ఎప్పుడు అక్టోబర్ 24
వన్ వెబ్ ఇండియా 1 మిషన్ ద్వారా 36 ఉపగ్రహాలు పంపనున్న ఇస్రో :

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇస్రో, లండన్ కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్ (ప్రిస్ వెబ్)లు సంయుక్తంగా 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపే వన్ వెబ్ ఇండియా 1 మిషన్ కు కాంటెడౌన్ మొదలైంది.ఎన్ఎస్ఎస్ఐఎల్, ఇస్రో వన్ వెబ్ ఒప్పందం మేరకు ప్రయోగించే ఈ ఉపగ్రహాలతో ఇస్రో తొలిసారిగా ప్రపంచ వాణిజ్య విఫణిలోకి అడుగుపెట్టనుంది. మరో 36 ఉపగ్రహాలను వచ్చే ఏడాది. ప్రధమార్గంలో ప్రయోగించనున్నట్ల ఎన్ఎస్ఎస్ఐఎల్ వెల్లడించింది. భారతి ఎంటర్ప్రైజెస్ వన్వెబ్ ప్రేయోగానికి కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : వన్ వెబ్ ఇండియా 1 మిషన్ ద్వారా 36 ఉపగ్రహాలు పంపనున్న ఇస్రో
ఎవరు : ఇస్రో
ఎప్పుడు అక్టోబర్ 25
రోడ్డు ప్రమాదాలను అరికట్టే రోబోటిక్ టైర్ లను రూపొంచిందిన దక్షిణ కొరియా దేశం :

ఇది హైటెక్ చక్రం. దక్షిణ కొరియా’కు చెందిన టైర్ల తయారీ సంస్థ హ్యాంకూక్ దీనిని అధునాతన రోబోటిక్స్ పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఎంత అధునాతన వాహనాల చక్రాలైనా, ఒక పరిమితిలో మాత్రమే మలుపు తిరగగలవు. అయితే, ఈ హైటెక్ చక్రం ఒమ్మి డైరెక్షనల్’- అంటే, అన్ని దిశల్లోనూ క్షణాల్లో ఇట్టే తిరగగలదు. అంతేకాదు, మామూలు రోడ్ల మీదనే కాదు, ఎగుడు దిగుడు నేలలపైనా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సునాయాసంగా ఇట్టే ప్రయాణించగలదు.
క్విక్ రివ్యు :
ఏమిటి : రోడ్డు ప్రమాదాలను అరికట్టే రోబోటిక్ టైర్ లను రూపొంచిందిన దక్షిణ కొరియా దేశం
ఎవరు : దక్షిణ కొరియా దేశం
ఎప్పుడు అక్టోబర్ 25
యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ లో టైటిల్ ను గెలుచుకున్న మ్యాక్స్ వెర్ స్టాఫన్ :

ఫార్ములావన్ టైటిల్ ను ఇప్పటికే గెలుచుకున్న మాక్స్ వెర్స్ స్టాపెన్ తన జట్టుకు టైటిల్ ను అందించాడు. యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ లో అతడు విజేతగా నిలిచాడు. ఈ సీజన్ లో అతడికి ఇది 135 విజయం. ఉత్కంఠభరితంగా సాగిన రేసులో రెడబ్బుల్ రేసర్ వెరాపెన్ గంట 42 నిమి షాల 11.687 సెకన్లలో రేసు ముగించాడు. అతడి కంటే 5.023 సెకన్ల వెనుక వచ్చిన మెర్సిడెజ్ రేసర్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. చార్లెస్ లీక్లెర్క్ (ఫెరారీ). మూడో స్థానం దక్కించుకున్నాడు. వెర్ స్టాఫన్ విజయంతో ఫార్ములావన్ కన్స్ క్టర్ల ఛాంపియన్షిప్ రెడ బుల్ కు సొంతమయ్యింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ లో టైటిల్ ను గెలుచుకున్న మ్యాక్స్ వెర్ స్టాఫన్
ఎవరు : మ్యాక్స్ వెర్ స్టాఫన్
ఎప్పుడు అక్టోబర్ 25
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |