
Daily Current Affairs in Telugu 24&25-07-2021
ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచిన భారత యువ రెజ్లర్ ప్రియ మాలిక్ :

భారత యువ రెజ్లర్ ప్రియ మలిక్ సత్తా చాటింది. ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె స్వర్ణంతో మెరిసింది. 73 కిలోల ఫైనల్లో ఆమె 5-0తో సైనియా పటపోవిచ్ (బెలారస్)ను చిత్తు చేసింది. ప్రస్తుత ప్రపంచ క్యాడెట్ టోర్నీలో భారత్ కు దక్కిన మూడో స్వర్ణమిది. ప్రియ మాలిక్ కాకుండా తన్ను, కోమల్ కూడా పసిడి గెలిచారు. 2019లో పుణెలో జరిగిన ఖేలో ఇండియా క్రీడల్లో స్వర్ణం సాధించిన ప్రియ. ఆ తర్వాత దిల్లీలో జరిగిన పాఠశాల క్రీడల్లోనూ పసిడి పతకంతో మెరిసింది. జాతీయ క్యాడెట్ చాంపియన్షిప్ లో పసిడి పతకం కూడా ప్రియ ఖాతాలో ఉంది.
క్విక్ కివ్యు :
ఏమిటి: ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచిన భారత యువ రెజ్లర్ ప్రియ మాలిక్
ఎవరు: ప్రియ మలిక్
ఎప్పుడు: జులై 25
ఆసియా పాఠశాలల అండర్-7 ఆన్లైన్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన పి. సంహిత :

ఆసియా పాఠశాలల అండర్-7 ఆన్లైన్ చెస్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి చిన్నారి పి. సంహిత విజేతగా నిలిచింది. 9 రౌండ్లకు గాను 8 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. తొమ్మిదో రౌండ్ లో హెమలియన్ సల్మా (ఇరాన్)పై సంహిత విజయం సాధించింది. అంతకుముందు జాతీయ పాఠశాలల చెస్ ఛాంపియన్షిప్ రన్నరప్ నిల్చిన సంహిత. ఆసియా పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది.
క్విక్ కివ్యు :
ఏమిటి: ఆసియా పాఠశాలల అండర్-7 ఆన్లైన్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన పి. సంహిత
ఎవరు: పి. సంహిత
ఎప్పుడు: జులై 25
400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈత పోటీల్లో స్వర్ణం గెలుచుకున్న అహ్మద్ :

400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈత పోటీల్లో స్వర్ణంతో అహ్మద్ సంచలనం సృష్టించాడు. మూడేళ్ల ముందు యూత్ ఒలింపిక్స్ లో ఈ విభాగంలో అతడిది ఎనిమిదో స్థానం. ఇప్పుడు ఫైనల్ కు కూడా ఎనిమిదో స్థానంలో అర్హత సాధించాడు. అయితే రేసు మొదలయ్యాక అతడికి అడ్డు లేకుండా పోయింది. తొలి 200 మీటర్లను ప్రపంచ రికార్డు వేగంతో ఈదిన అతడు.తర్వాత నెమ్మదించాడు. చివరి 50 మీటర్లలో వేగం పెంచిన అహ్మద్ తన కంటే వేగవంతమైన, అనుభవజ్ఞులైన స్విమ్మర్లను సెకన్ల తేడాతో దాటేసి 3 నిమిషాల 43.26 సెకన్లలో రేసు పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్ స్విమ్మింగ్ లో రెండో స్వర్ణం గెలిచిన ట్యూనీషియా అథ్లెట్ గా నిలిచిన అతను. ఆఫ్రికా నుంచి నెగ్గిన రెండో అత్యంత పిన్న వయసు స్విమ్మర్ గా రికార్డు నమోదుచేశాడు.
క్విక్ కివ్యు :
ఏమిటి: 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈత పోటీల్లో స్వర్ణం గెలుచుకున్న అహ్మద్
ఎవరు: అహ్మద్
ఎక్కడ:ట్యునీషియ దేశస్తుడు
ఎప్పుడు: జులై 25
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నుంచి తొలి పథకం గెలిచిన వెయిట్ లిఫ్టర్ మిరాభాయి చాను :

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ శుభారంభం చేసింది. ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. స్నాచ్ 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్ లో 115 కేజీలు వెయిట్ ఎత్తింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్ మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్ లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది.దాంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 210 కేజీలు ఎత్తి చైనా లిఫ్టర్ జిజోయ్ పసిడిని దక్కించుకున్నారు. భారత్ తరపున పతకం సాధించిన రెండో వెయిట్ లిఫ్టర్ గా మీరాబాయి ఘనత సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్ లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా, ఆ తర్వాత ఒలింపిక్స్ లో పతకం గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్గా మీరాబాయి నిలిచారు.
క్విక్ కివ్యు :
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నుంచి తొలి పథకం గెలిచిన వెయిట్ లిఫ్టర్ మిరాభాయి చాను
ఎవరు: మిరాభాయి చాను
ఎక్కడ: జపాన్ (టోక్యో )
ఎప్పుడు: జులై 25
టోక్యో ఒలింపిక్స్ లో మొదటి పథకం గెలుచుకున్న దేశంగా నిలిచిన చైనా దేశం :

ఒలింపిక్స్ పతకాల సంఖ్యలో అగ్రదేశం అమెరికాను వెనక్కి నెట్టాలనే లక్ష్యంతో ఉన్న చైనా ఆ దిశగా ఘనంగా ముందుకు అడుగు వేసింది. టోక్యో ఒలింపిక్స్ తొలి పసిడిని ఆ దేశమే దక్కించుకుంది. మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్లో చైనా షూటర్ యాంగ్ క్యూయన్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక పతకాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందుకోవడం ఓ జీవితకాల అనుభూతి. జాతీయ గీతం వినపడుతుండగా పోడియంపై నిలబడ్డ అథ్లెట్ల మెడలో ముఖ్య అతిథులు పతకాల వేయడం జరుగుతుంది. కానీ ఈ సారి కరోనా కారణంగా ఆ దృశ్యాలు కనిపించడం లేదు. అథ్లెట్లు ఎవరి పత కాలు వాళ్లే మెడలో వేసుకోవాలి. అందుకే క్రీడల తొలి స్వర్ణం నెగ్గిన యాంగ్ అంతర్జాతీయ ఒలింపిక్ అధ్యక్షుడు థామస్ బాక్ ట్రేలో తెచ్చిన పతకాన్ని తీసుకుని మెడలో వేసుకుంది.
క్విక్ కివ్యు :
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ లో మొదటి పథకం గెలుచుకున్న దేశంగా నిలిచిన చైనా దేశం
ఎవరు: చైనా దేశం
ఎక్కడ: జపాన్ (టోక్యో )
ఎప్పుడు: జులై 26
ఒలింపిక్స్ లో మూడు సార్లు స్వర్ణ పథకం ను గెలుచుకున్న హంగేరి పెన్సర్ ;

టోక్యో క్రీడల్లో పురుషుల వ్యక్తి గత సాబ్రూ విభాగంలో స్వర్ణం గెలిచిన హంగేరీ ఫెన్సర్ అరోన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత సాబ్రూలో మూడు ఒలింపిక్స్ స్వర్ణాలు సాధించిన ఏకైక ఫెన్సర్గా రికార్డు నమోదు చేశాడు.” 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ నూ అతను చాంపియన్ నిలిచాడు. ‘ఒలింపిక్స్ వ్యక్తిగత సాబ్రూలో అతనికి చివరగా 2008లో మూడో రౌండో ఓటమి పాల య్యాడు. అప్పటి నుంచి అతనికి ఈ విశ్వ క్రీడల్లో తిరుగేలేదు
క్విక్ కివ్యు :
ఏమిటి: ఒలింపిక్స్ లో మూడు సార్లు స్వర్ణ పథకం ను గెలుచుకున్న హంగేరి పెన్సర్
ఎవరు: హంగేరి పెన్సర్ అరోన్
ఎక్కడ: జపాన్ (టోక్యో )
ఎప్పుడు: జులై 26
అంతర్జాతీయ సౌర కూటమి ఒప్పందాన్ని ఆమోదించిన స్వీడన్ దేశం :

అంతర్జాతీయ సౌర కూటమి (ISA) యొక్క ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని స్వీడన్ ఇటీవల ఆమోదించింది కాగా ఈ అంతర్జాతీయ సౌర కూటమి సభ్యత్వం 17 జూలై 2021 నుండి అమల్లోకి వచ్చింది ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని స్వీడన్ ఆమోదించింది భారతదేశంలో స్వీడన్ రాయబారి క్లాస్ మోలిన్ మాట్లాడుతూ, స్వీడన్ తన నైపుణ్యాన్ని మరియు పునరుత్పాదక ఇంధనం మరియు స్వచ్ఛమైన ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలలో దాని అనుభవాన్ని ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ లో చర్చలకు తీసుకురావాలని భావిస్తోంది.
క్విక్ కివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ సౌర కూటమి ఒప్పందాన్ని ఆమోదించిన స్వీడన్ దేశం
ఎవరు: స్వీడన్ దేశం
ఎప్పుడు: జులై 26
AIFF ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న సందేష్ జింగాన్ :

సీనియర్ ఇండియా డిఫెండర్ సందేష్ జింగాన్ ఎఐఎఫ్ఎఫ్ పురుషుల ఫుట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు, మిడ్‌ఫీల్డర్ సురేష్ సింగ్ వాంగ్‌జామ్ 2020-21 సీజన్‌కు ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. 2014 సంవత్సరం లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న అత్యున్నత సెంట్రల్ డిఫెండర్ ప్లేయర్ AIFF ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడం ఇదే మొదటిసారి. ఇండియన్ సూపర్ లీగ్ మరియు ఐ-లీగ్ క్లబ్ కోచ్‌ల ఓట్ల ఆధారంగా అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు
క్విక్ కివ్యు :
ఏమిటి: AIFF ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న సందేష్ జింగాన్
ఎవరు: సందేష్ జింగాన్
ఎప్పుడు: జులై 26
యునెస్కో చారిత్రాత్మక గుర్తింపు పొందిన వరంగల్ లోని రామప్ప దేవాలయం :

అద్భుతమైన శిల్పసౌందర్యానికీ, అరుదైన నిర్మాణ కౌశలానికి, వందల ఏళ్ల చరిత్రకు, కాకతీయుల వైభవానికి నెలవైన తెలంగాణలోని రామప్ప ఆలయం అరుదైన ఘనత సాధించింది. 2020 సంవత్సరానికి ప్రపంచ స్థాయి కట్టడంగా యునెస్కో’ (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనేషన్ వారి గుర్తింపు పొందింది.చైనాలో జరిగిన యునెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కల్పించినట్లు కేంద్ర పురా వస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాన్విజ్ వెల్లడించారు. ఈనెల 16 నుంచి 44వ యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. జులై 25న జరిగిన ఓటింగ్ ప్రక్రియ చర్చలో రామప్పకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ నుంచి మూడు చారిత్రక కట్టడాలు పోటీపడగా అవన్నీ వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నవే. ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడి తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. రామప్ప ఆలయానికి భిన్న శైలి, శిల్పకళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం తదితర ఎన్నో అరుదైన అర్హతలు ఉండటంతో యునెస్కో గుర్తింపు దక్కించుకుంది.
క్విక్ కివ్యు :
ఏమిటి: యునెస్కో చారిత్రాత్మక గుర్తింపు పొందిన వరంగల్ లోని రామప్ప దేవాలయం
ఎవరు: రామప్ప దేవాలయం
ఎక్కడ: వరంగల్ లో
ఎప్పుడు: జులై 26
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |