Daily Current Affairs in Telugu 24 December- 2022
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (SSE)ని ఏర్పాటు చేయడానికి SEBI నుండి ఆమోద౦ :

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) యొక్క ప్రత్యేక విభాగంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (SSE)ని ఏర్పాటు చేయడానికి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుండి సూత్రప్రాయ ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో, సామాజిక సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థల జాబితా కోసం SEBI నియంత్రణ పరిధి కింద సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటును ప్రతిపాదించారు.
- సెబి పూర్తి రూపం : సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
- సెబి స్థాపన : ఏప్రిల్ 12 ,1988
- సెబి ప్రధాన కార్యాలయం : ముంబై
క్విక్ రివ్యు
ఏమిటి : సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (SSE)ని ఏర్పాటు చేయడానికి SEBI నుండి ఆమోద౦
ఎవరు : సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI
ఎప్పుడు : డిసెంబర్ 24
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది నియామకం :

పాకిస్తాన్ సెలక్టర్ గా మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని కొత్త సెలక్షన్ కమిటీ చైర్మన్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ముగ్గురు సభ్యులు ఈ కమిటీలో అఫ్రిదితో పాటు మరో ఇద్దరు మాజీ ఆటగాళ్లు అబ్దుల్ రజాక్, ఇఫ్తికార్ అహ్మద్, హరూన్ రషీద్ కూడా ఉన్నారు. త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్ జరగబోయే 2 టెస్టు, 3 వన్డేల సిరీస్ కోసం ఈ కమిటీ జట్టును ఎంపిక చేస్తుంది.
- పాకిస్తాన్ దేశ రాజాదాని : ఇస్లామాబాద్
- పాకిస్తాన్ దేశ ప్రధాని : శేహబాజ్ షరీఫ్
- పాకిస్తాన్ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ : బాబర్ ఆజం
క్విక్ రివ్యు
ఏమిటి : పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది నియామకం
ఎవరు : షాహిద్ అఫ్రిది
ఎక్కడ : పాకిస్తాన్
ఎప్పుడు : డిసెంబర్ 24
ఫిజి దేశ నూతన ప్రధానమంత్రిగా బాద్యతలు స్వీకరించిన సితవేని రబూక :

ఫిజి దేశ నూతన ప్రధానమంత్రిగా సితవేని రబూకా డిసెంబర్ 24న బాధ్యతలు స్వీకరించారు. 74 ఏళ్ల ఈ మాజీ సైనిక కమాండర్ పార్ల మెంటు సభ్యుల మధ్య జరిగిన రహస్య ఓటింగ్ లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నెగ్గి గత 16 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న ఫ్రాంక్ బైనిమారామాను అదికారానికి దూరం చేశారు. ఇటీవల జరిగిన పార్ల మెంటు ఎన్నికల్లో రబూకాకు చెందిన పీపుల్స్ ఆల యన్స్ కూటమికి 29. జైని మారామా కూటమికి 26- స్థానాలు లభించాయి. అయినా ‘ప్రతిష్టంభన ఏర్పడి. ఓటింగ్ జరిగింది. ఇందులో రబూకా 28-27తో గట్టెక్కారు.
- ఫిజి దేశ రాజధాని : సువా
- ఫిజి దేశ కరెన్సీ :ఫిజియన్ డాలర్
క్విక్ రివ్యు
ఏమిటి : ఫిజి దేశ నూతన ప్రధానమంత్రిగా బాద్యతలు స్వీకరించిన సితవేని రబూక
ఎవరు : సితవేని రబూక
ఎక్కడ : ఫిజి దేశం
ఎప్పుడు : డిసెంబర్ 24
అమెరికా విదేశాంగ శాఖలో అత్యున్నత పదవికి నామినేట్ అయిన భారత్ సంతతి న్యాయవాది :

భార సంతతి న్యాయవాది, మాజీ దౌత్యవేత్త రిచర్డ్ వర్మను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విదేశాంగ శాఖలో అత్యున్నత పదవికి నామినేట్ చేశారు. భారత్ లో . 2015-17 మధ్య అమెరికా దౌత్యవేత్తగా పనిచేసిన వర్మ(51)ను విదేశాంగ శాఖలో డిప్యూటీ కార్యదర్శి (నిర్వహణ, వనరులు విభాగంలో) బైడెన్ నామినేట్ చేసినట్లు శ్వేతసౌధం ప్రకటన జారీ చేసింది. దీనికి సెనేట్ ఆమోదం తెలపాల్సి ఉంది. వర్మ బరాక్ ఒబామా హయాంలోనూ విదేశీశాంగ శాఖలో ఉప కార్యదర్శి (న్యాయ వ్యవహా రాలు)గా పనిచేశారు. బైడెన్ నిర్ణయంపై భారత సంతతి ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు.
క్విక్ రివ్యు
ఏమిటి : అమెరికా విదేశాంగ శాఖలో అత్యున్నత పదవికి నామినేట్ అయిన భారత్ సంతతి న్యాయవాది
ఎవరు : రిచర్డ్ వర్మను
ఎక్కడ : అమెరికా
ఎప్పుడు : డిసెంబర్ 24
జాతీయ రైతుల దినోత్సవం గా డిసెంబర్ 23 :

భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి మరియు దేశంలోని రైతుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకోవడానికి డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రైతుల పాత్ర మరియు ఆర్థిక వ్యవస్థకు వారి సహకారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా వివిధ అవగాహన ప్రచారాలు మరియు డ్రైవ్‌లు నిర్వహించబడతాయి..
క్విక్ రివ్యు
ఏమిటి : జాతీయ రైతుల దినోత్సవం గా డిసెంబర్ 23
ఎప్పుడు : డిసెంబర్ 23
భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా ఎంపికైన సానియా మీర్జా :

సానియా మీర్జా భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ గా ఎంపికైంది మరియు దేశంలోని మొదటి ముస్లిం యువతి మరియు రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా IAF పైలట్ గా అవతరించింది.. ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా సానియా మీద మొదటి మహిళా IAF పైలట్ గా అవతరించింది. సానియా మీర్జా మీర్జాపూర్ కు చెందిన ఓ టీవీ మెకానిక్ కూతురు ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా సానియా మీర్జా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆమె జిల్లాకే కాకుండా రాష్ట్రానికి, దేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. కాగా డిసెంబర్ 27, 2022న ఆమె పూణేలోని NDA ఖడక్ వాస్లా లో చేరనున్నారు.
క్విక్ రివ్యు
ఏమిటి : భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా ఎంపికైన సానియా మీర్జా
ఎవరు : సానియా మీర్జా
ఎప్పుడు : డిసెంబర్ 24
మహిళల పై మరో నిషేధం విధి౦ పు ప్రకటించిన ఆఫ్గనిస్తాన్ దేశం :

అఫ్గాన్ మహిళలను విద్యకు దూరం చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలపైనా ఆంక్షలు విధించింది. అఫ్గాన్ మహిళలెవరూ దేశీయ, విదేశీ సంస్థలకు చెందిన “స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ల్లో పనిచేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి మహమ్మద్ హనీఫ్ –ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని పట్టించుకోని ఎన్జీవోల అనుమతులు రద్దు చేస్తామని ప్రకటించారు. ఎన్జీవోల్లో పనిచేస్తున్న మహిళలు హిజాబ్ లేదా బురఖా సరిగా ధరించడం లేదన్న పిర్యాదుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
- ఆఫ్గనిస్తాన్ దేశ రాజధాని :కాబుల్
- ఆఫ్గనిస్తాన్ దేశ కరెన్సీ : ఆఫ్గన్ ఆఫ్గని
క్విక్ రివ్యు
ఏమిటి : మహిళల పై మరో నిషేధం విధి౦ పు ప్రకటించిన ఆఫ్గనిస్తాన్ దేశం
ఎవరు : ఆఫ్గనిస్తాన్
ఎక్కడ : ఆఫ్గనిస్తాన్ దేశంలో
ఎప్పుడు : డిసెంబర్ 24
Daily current affairs in Telugu Pdf November - 202 |
---|
Daily current affairs in Telugu 01-11-2022 |
>Daily current affairs in Telugu 02-11-2022 |
Daily current affairs in Telugu 03-11-2022 |
Daily current affairs in Telugu 04-11-2022</strong> |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 06-11-2022</strong> |
Daily current affairs in Telugu 07-11-2022 |
Daily current affairs in Telugu 08-11-2022 |
>Daily current affairs in Telugu 09-11-2022 |
Daily current affairs in Telugu 10-11-2022 |
Daily current affairs in Telugu 11-11-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |