
Daily Current Affairs in Telugu 24-05-2021
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా అస్సాం సిఎం హిమంతా బిస్వా శర్మ ఎన్నిక ;

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) అధ్యక్షుడిగా ఉన్న అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన డాక్టర్ హిమంతా బిస్వా శర్మ గారు 2021 – 25సంవత్సర కాలానికి గాను బిడబ్ల్యుఎఫ్ కౌన్సిలకు సభ్యునిగా ఎన్నికయ్యారు. కాగా 2021 మే 22 న వర్చువల్ గా జరిగిన సమావేశం లో BWF యొక్క AGM మరియు కౌన్సిల్ ఎన్నికలు,జరగగా అతనికి అనుకూలంగా 236 ఓట్లు వచ్చాయి. ఆయన ఆగస్టు 2017 లో డాక్టర్ శర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా ఆయన అస్సాం బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బిడబ్ల్యుఎఫ్ ప్రెసిడెంట్ పాల్ ఎరిక్ హోయెర్ తిరిగి ఎన్నికయ్యారు.
- అస్సాం రాష్ట్ర రాజధాని : దిస్పూర్
- అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి : డాక్టర్ హిమంతా బిస్వా శర్మ
- అస్సాం రాష్ట్ర గవర్నర్ :జగదీశ్ ముఖి
- బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రదాన కార్యాలయం :న్యుడిల్లి
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా అస్సాం సిఎం హిమంతా బిస్వా శర్మ ఎన్నిక
ఎవరు: అస్సాం సిఎం హిమంతా బిస్వా శర్మ
ఎక్కడ: అస్సాం
ఎప్పుడు: మే 23
ప్రతిష్టాత్మక డాక్టర్ రుడాల్ఫ్ వి. షిండ్లర్ అవార్డు ను దక్కించుకున్న వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి ;

ఏషియన్ ఇన్ ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణ కోశవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి గారికి ప్రతిష్టాత్మక ‘అమెరికన్. సొసైటీ ఫర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ (ఏఎఈ)’ సంస్థ యొక్క అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. ‘అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్ వ్యవస్థాపకులు, ‘ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీ’గా గౌరవించే డాక్టర్ రుడాల్ఫ్ వి. షిండ్లర్ పేరిట జీర్ణకోశ వ్యాధుల చికిత్సల్లో విశిష్ఠ సేవలందించిన వైద్యనిపుణులకు ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 2021 సంవత్సరానికి నాగేశ్వరరెడ్డికి ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ వైద్యుడు ఆయన నిలిచారు.. మే 23 న జరిగిన ఆన్లైన్ సదస్సులో ఏఎసీఈ అధ్యక్షులు డాక్టర్ క్లాస్ మేర్జేనర్ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. నాగేశ్వరరెడ్డి కర్నూలులో ఎంబీబీఎస్ పూర్తి చేసి,ఛండీగఢ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో పీజీ పూర్తిచేశారు. హైదరాబాద్ లో ఏఐజీ స్థాపించి ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులుగా ఎదిగారు. ప్రపంచ దేశాల్లో ఎండోస్కోపీ చికిత్సలపై వందలాది ఉపన్యాసాలిచ్చారు. 700కి పైగా వైద్యపత్రాలను సమర్పించి, 50కి పైగా వైద్యపత్రికలను సమీక్షించారు. భారత ప్రభుత్వం డాక్టర్ రెడ్డిని ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తాజాగా రుడాల్ఫ్ వి. షిండ్లర్ అవార్డును దక్కించుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక డాక్టర్ రుడాల్ఫ్ వి. షిండ్లర్ అవార్డు ను దక్కించుకున్న వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి
ఎవరు: డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి
ఎప్పుడు:మే 24
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ బోర్డు అధ్యక్షునిగా జగిత్ పావాడియా ఎన్నిక :

భారత మాజీ నార్కోటిక్స్ కమిషనర్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్) రిటైర్డ్ ఆఫీసర్ జగిత్ పావాడియా వియన్నాకు చెందిన సంస్థ అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ బోర్డు (INCB) కు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. వియన్నాకు చెందిన సంస్థకు నాయకత్వం వహించిన మొదటి భారతీయురాలు మరియు ఈ పదవిని నిర్వహించిన రెండవ మహిళ. పావాడియా ఐఆర్ఎస్ లో తన 35 సంవత్సరాల సేవలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ కు 2006-12 మధ్య ఆరు సంవత్సరాలు భారత నార్కోటిక్స్ కమిషనర్ గా నాయకత్వం వహించారు. మరియు చీఫ్ కమిషనర్ పదవీ విరమణకు ముందు కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో అనేక ఇతర సీనియర్ పదవులలో పనిచేశారు.
- అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ బోర్డు (INCB) ప్రధాన కార్యాలయం :వియన్నా
- అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ బోర్డు (INCB) స్థాపన :1968
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ బోర్డు అధ్యక్షునిగా జగిత్ పావాడియా ఎన్నిక
ఎవరు: జగిత్ పావాడియా
ఎప్పుడు: :మే 24
PGA ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడైన ఫిల్ మికెల్సన్ :

50 ఏళ్ల వయసులో అమెరికా పీజీఏ గోల్స్ చాంపియన్ షిప్ ను ఫిల్ మికెల్సన్ గెలుచుకున్నాడు. పీజీఏ టైటిల్ ను 50 ఏళ్ల వయసులో గెలుచుకున్న తొలిప్లేయర్ గా ఇతను రికార్డు సృష్టించాడు. కాగా మికెల్సన్ కెరీర్ లో అతనికి ఇది ఆరవ మేజర్ టైటిల్ కావడం విశేషం. 2013లో బ్రిటీష్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఆయనకు ఇదే తొలి టైటిల్..PGA ఛాంపియన్షిప్ అనేది “ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్” ఆఫ్ అమెరికా నిర్వహించిన వార్షిక గోల్ఫ్ టోర్నమెంట్ ఇది. ఈ ప్రొఫెషనల్ గోల్ లో నాలుగు పురుషుల ప్రధాన ఛాంపియన్షిప్ లో ఇది ఒకటి
క్విక్ రివ్యు :
ఏమిటి: PGA ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడైన ఫిల్ మికెల్సన్
ఎవరు: ఫిల్ మికెల్సన్
ఎప్పుడు: :మే 24
రెండవ సారి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయిన నరీందర్ ద్రువ్ బాత్రా

నరీందర్ ద్రువ్ బాత్రా వరుసగా రెండవ సారి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH)కు అధ్యక్షుడిగా తిరిగి మళ్లి ఎన్నికయ్యారు. FIH యొక్క వర్చువల్ మీటింగ్ లో 47 వ కాంగ్రెస్ సందర్భంగా ఆయన ఎన్నికయ్యారు, అక్కడ బెల్జియం హాకీ ఫెడరేషన్ చీఫ్ మార్క్ కొడ్రాన్ ను కేవలం 124 ఓట్లలో 63-61 ఓట్ల తేడాతో ఓడించారు. కాగా అతను 2024 వరకు పదవిలో ఉండనున్నారు. ఎందుకంటే FIH ఈ పదవికాలాన్ని నాలుగు నుండి మూడు సంవత్సరాలకు తగ్గించింది. అంతర్జాతీయ సంస్థ లో 92 సంవత్సరాల చరిత్రలో అగ్ర పదవికి నియమించబడిన ఏకైక ఆసియా ప్రముఖ భారత క్రీడా నిర్వాహకుడు ఇతను. 2016 లో ఒలింపిక్ క్రీడకు అంతర్జాతీయ సమాఖ్యకు నాయకత్వం వహించిన తొలి భారతీయుడిగా నరీందర్ బాత్రా గారు నిలిచారు.
- అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH ; లుసానే (స్విట్జర్ ల్యాండ్ )
- ఇంటర్ నేషనల్ ఒలింపిక్ కమిటీ అద్యక్షుడు : థామస్ బాచ్
- ఇంటర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అద్యక్షుడు :థామస్ వేల్కేర్ట్
- వరల్డ్ ఆర్చరి ఫెడెరేషన్ అద్యక్షుడు ; ఉద్గుర్ ఏర్దినేర్
క్విక్ రివ్యు :
ఏమిటి: రెండవ సారి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయిన నరీందర్ ద్రువ్ బాత్రా
ఎవరు: నరీందర్ బాత్రా
ఎప్పుడు: :మే 24
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |