
Daily Current Affairs in Telugu 23&24 November – 2022
టెన్నిస్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కు ఆతిథ్యం ఇవ్వనున్న పూనే నగరం :

డిసెంబర్ 7 నుంచి 11 వరకు జరగనున్న టెన్నిస్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కు పూణే నగరం ఆతిథ్యం ఇవ్వనుందని నిర్వాహకులు నవంబర్ 24న తెలిపారు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA ) మరియు మహారాష్ట్ర స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ (MSLTA) మద్దతుతో, శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని బాలేవాడి స్టేడియంలో ఈ లీగ్ నిర్వహించబడుతుంది. కాగా పూణే TPLకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి : టెన్నిస్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఆతిథ్యం ఇవ్వనున్న పూనే నగరం
ఎవరు : పూనే నగరం
ఎప్పుడు : నవంబర్ 23
సుమిత్రా చరత్ రామ్ అవార్డును అందుకున్న కథక్ అనుభవజ్ఞురాలు ఉమా శర్మ :

కథక్ నాట్య అనుభవజ్ఞురాలు ఉమా శర్మ భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు నృత్య రంగానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా సుమిత్రా చరత్ రామ్ అవార్డును అందుకున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ కరణ్ సింగ్, సరోద్ ప్లేయర్ ఉస్తాద్ అన్జద్ అలీ ఖాన్ గారి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు.ఉమా శర్మ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి, ఆమె భారతదేశ సాంస్కృతిక సంప్రదాయానికి ఆమె చేసిన విశిష్ట కృషికి ఈ పద్మభూషణ్ అవార్డును పొందింది. భారతీయ శాస్త్రీయ సంగీతం & నృత్య రంగానికి శాశ్వత కృషి చేసిన ప్రముఖ కళాకారులను సత్కరించేందుకు గత 11 సంవత్సరాలుగా జీవితకాల సాఫల్యానికి ‘సుమిత్రా చరత్ రామ్ అవార్డు’ అందించబడుతోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : సుమిత్రా చరత్ రామ్ అవార్డును అందుకున్న కథక్ అనుభవజ్ఞురాలు ఉమా శర్మ
ఎవరు : ఉమా శర్మ
ఎప్పుడు : నవంబర్ 23
అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ అబ్దుల్ కలాం సేవా పురస్కారం గెలుచుకున్న రవి కుమార్ సాగర్ :

ఆర్.కే యొక్క INNO గ్రూప్ యొక్క అతి పిన్న వయస్కులలో ఒకరైన మరియు సియివో అయిన రవి కుమార్ సాగర్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ అబ్దుల్ కలాం సేవా పురస్కారం లభించింది. సమాజానికి ఆయన చేసిన నిరంతర సేవలకుగానూ ఈ అవార్డును ఆయనకు అందించారు. మరియు భారతదేశంలోని అతి పిన్న వయస్కులలో ఒకరు.ఈ అవార్డును వందే భారత్ ఫౌండేషన్ మరియు లీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ అబ్దుల్ కలాం సేవా పురస్కారం గెలుచుకున్న రవి కుమార్ సాగర్
ఎవరు : రవి కుమార్ సాగర్
ఎప్పుడు : నవంబర్ 23
ఆసియా కుబేరుల జాబితాలో నిలిచిన రిషి సునాక్ ,అక్షత మూర్తి

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఆయన భార్య అక్షతా మూర్తి తొలిసారిగా యుకె కు చెందిన ఎషియన్ రిచ్ లిస్ట్ 2022 లో చోటు చేసుకు న్నారు. 790 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 7,700 కోట్ల) సంపదతో సునాక్, అర్హత ఈ జాబితాలో 17వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది జాబితాలోని వారి “మొత్తం సంపద 113.2 బిలియన్ పౌండ్లుగా నమోదైనది.2021 పోలిస్తే ఇది 13.5 బి. పౌండ్లు అధికం.వరుసగా ఎనిమిదో ఏడాది హిందుజా కుటుంబం 30.05 బిలియన్ పౌండ్ లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2021 తో పోలిస్తే 3 బిలియన్ పౌండ్లను అదనంగా హిందూజా కుటుంబం జత చేసుకుంది. ఇక్కడ జరిగిన 24వ వార్షిక ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో హిందుజా గ్రూప్ సహా చైర్మన్, గోపీచంద్ హిందుజా కుమార్తె రీతు చాబ్రియాకు లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ ఈ “ఏషియన్ రీచ్ లిస్ట్ 2022 ప్రతిని అందజేశారు. బ్రిటన్ లో ఆసియా సంతతి ఏటా వృద్ధి చెందుతోందనడానికి ఈ జాబితా నిదర్శనమని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా కుబేరుల జాబితాలో నిలిచిన రిషి సునాక్ ,అక్షత మూర్తి
ఎవరు : రిషి సునాక్ ,అక్షత మూర్తి
ఎప్పుడు : నవంబర్ 24
సాహిత్యానికి 2022 గాను ఐదవ JCB పురస్కారం గెలుచుకున్న రచయిత ఖలీద్ జావేద్ :

రచయిత ఖలీద్ జావేద్ రచించిన ‘ది ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్’ సాహిత్యంలో ఐదవ JCB బహుమతిని గెలుచుకుంది.ఈ పుస్తకాన్ని ఉర్దూ నుండి బరాన్ ఫరూకీ అనువదించారు. ‘ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్ ‘ 50 సంవత్సరాల వ్యవధిలో ఒక మధ్యతరగతి ఉమ్మడి ముస్లిం కుటుంబం. యొక్క కథను చెబుతుంది, కథకుడు తన ఇంటిలో మరియు బయటి ప్రపంచంలో తనకు తానుగా ఒక స్థలాన్ని కనుగొనడానికి కష్టపడతాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సాహిత్యానికి 2022 గాను ఐదవ JCB పురస్కారం గెలుచుకున్న రచయిత ఖలీద్ జావేద్
ఎవరు : రచయిత ఖలీద్ జావేద్
ఎప్పుడు : నవంబర్ 24
మలేసియా కొత్త ప్రధానిగా సంస్కరణ వాదిగా అన్వర్ ఇబ్రహీం :

మలేసియాలో నవంబర్ 24న. జరిగిన ఎన్నికలు హంగ్, పార్లమెంట్ కు దారితీసినా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా పలువురు పార్లమెంటు సభ్యులతో సంప్రదించి నవంబర్ 24న 75 ఏళ్ల అన్వర్ ఇబ్రహీంతో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అన్వర్ పార్టీ అలయన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు సాధించింది. 222 సీట్లు గల మలేసియా ‘పార్ల మెంటులో మెజారిటీ కావాలంటే 112 సీట్లు రావాలి. అన్వర్ సంస్కరణవాది కాగా, మితవాది అయిన మాజీ ప్రధాని ముహియుద్దీన్ యాసిన్ పార్టీ నేషనల్ అలయక కు 73 సీట్లు వచ్చాయి. 20 ఏళ్ల పాటు ప్రతి పక్షంలో ఉండి. జైలు శిక్షలు అనుభవించి, సంస్కరణల కోసం గట్టిగా నిలబడిన అన్వర్ పగ్గాలు చేపట్టడంతో దేశంలో ఆశా భావం వెల్లివిరుస్తోంది స్టాక్ మార్కెట్ సూచీలు మలేసియా కరెన్సీ విలువలు కూడా పెరిగాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : మలేసియా కొత్త ప్రధానిగా సంస్కరణ వాదిగా అన్వర్ ఇబ్రహీం
ఎవరు : అన్వర్ ఇబ్రహీ
ఎప్పుడు : నవంబర్ 24
మొదటి సారిగా భారతదేశానికి అతిపెద్ద ఎరువుల సరఫరాదారుగా అవతరించిన రష్యా :

2022-23 ఆర్ధిక సంవత్సరం మొదటి అర్థభాగంలో ప్రపంచవ్యాప్త ధరలపైన డిస్కౌంట్ లను అందించడం ద్వారా రష్యా దేశం మొదటి సారిగా భారత దేశానికి అతిపెద్ద ఎరువుల ఎరువుల సరఫరాదారుగా అవతరించింది, మార్కెట్ వాటాలో ఐదవ వంతు కంటే ఎక్కువ మూలనపడి ఉన్నాయని , ప్రభుత్వ మరియు పారిశ్రామిక వర్గాలు తెలిపాయి.ఈ విధంగా రష్యా దేశం భారత్ కు అతిపెద్ద ఎరువుల సరఫరా దారునిగా అవతరించింది. 2022/23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రష్యా ఎగుమతిదారులు భారతీయ ఎరువుల మార్కెట్లో 21% వాటాను కైవసం చేసుకున్నారని, ఇది గతంలో భారతదేశానికి అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న చైనాను అధిగమించిందని నివేదించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : మొదటి సారిగా భారత దేశానికి అతిపెద్ద ఎరువుల సరఫరాదారుగా అవతరించిన రష్యా
ఎవరు : రష్యా
ఎప్పుడు : నవంబర్ 24
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము మొదటి సారిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంబించిన ప్రధాని నరేంద్ర మోడి :

ఆదివాసి పూజారుల మంత్రోచ్చారణల మద్య అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము లో మొదటి సారిగా గ్రీన్ ఫీల్డ్ సదుపాయం కలిగిన కొత్త డివి పోలో విమానాశ్రయం ను నవంబర్ 19,2022 నాడు ప్రధాని నరేంద్ర మోడి గారు ప్రారబించారు.కాగా రాష్ట్ర రాజధాని అయిన ఇటానగర్ నుంచి 15 కిలోమీటర్ ల దూరంలో ఉన్న హలోంగి లో ఉన్న విమానాశ్రయం సరిహద్దు రాష్ట్రాన్ని ఇతర భారతీయ నగరాలతో వాణిజ్య విమానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలను హెలికాఫ్టర్ సేవల ద్వారా కలుపుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము మొదటి సారిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంబించిన ప్రధాని నరేంద్ర మోడి
ఎవరు : ప్రధాని నరేంద్ర మోడి
ఎక్కడ: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము
ఎప్పుడు : నవంబర్ 24
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |