
Daily Current Affairs in Telugu 23&24-April-2022
మలేరియా నిర్మూలన లో జాతీయ పురస్కారం గెలుచుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రము :

మలేరియా నిర్మూలన లో అత్యుత్తమ పని తీరు ప్రదర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లబించింది.ప్రతి వెయ్యి మంది జనాభా కు ఒక పాజిటివ్ కేసుకు మించకుండా ఉండేలా మలేరియాను నియంత్రించడం లో రాష్ట్ర ప్రభుత్వం సపలీక్రుతం అయింది. దీంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రి ఎలిమినేషన్ దశ కేటగిరి-2 నుంచి ఎలిమినేషన్ దశ కేటగిరి -1 కు చేరుకుందని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచామలేరియా దినోత్సవం సందర్బంగా డిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా కమ్యునినికబుల్ డిసిజేస్ అడిషనల్ డైరెక్టర్ వెంకట్ రామిరెడ్డి అవార్డును అందుకోనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి:మలేరియా నిర్మూలన లో జాతీయ పురస్కారం గెలుచుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రము
ఎవరు:ఆంద్రప్రదేశ్ రాష్ట్రము
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :ఏప్రిల్ 24
ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021 అందుకున్న సర్ డేవిడ్ అటేన్ బరో :

ప్రకృతి రక్షణ మరియు దాని పునరుద్ధరణ కోసం పరిశోధన, డాక్యుమెంటేషన్ మరియు న్యాయవాదానికి అంకితం చేసినందుకు గాను సర్ డేవిడ్ అట్బెరో ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021 ను అందుకోనున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021 అందుకున్న సర్ డేవిడ్ అటేన్ బరో
ఎవరు: సర్ డేవిడ్ అటేన్ బరో
ఎప్పుడు :ఏప్రిల్ 23
హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ గా ఎన్నికయిన అబ్దుల్లా కుట్టి :

హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎపి అబ్దుల్లాకుట్టి ఎన్నికకాగా, తొలిసారిగా ఇద్దరు మహిళలు వైస్ చైర్మన్లుగా ఎంపికైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హజ్ కమిటీ చట్టం 2002 ప్రకారం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా (సిహెచ్.సి) అని సాధారణంగా పిలవబడే హజ్ కమిటీ, హజ్ కోసం ముస్లింల తీర్థయాత్రకు ఏర్పాట్లు చేయడం మరియు దానితో అనుసంధానించబడిన విషయాల కోసం ఏర్పాటు చేయబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ గా ఎన్నికయిన అబ్దుల్లా కుట్టి
ఎవరు: అబ్దుల్లా కుట్టి
ఎప్పుడు : ఏప్రిల్ 23
ప్రపంచకప్ స్టేజ్-1 పోటీల్లో స్వర్ణ పథకం గెలుచుకున్న ఆర్చర్లు తరుణ్ దీప రాయ్ రిథి పార్ :

భారత ఆర్చర్లు తరుణ్ దీప్ రాయ్, రిధి పార్ అదరగొట్టారు. ప్రపంచకప్ స్టేజ్-1 పోటీల్లో దేశానికి మరో స్వర్ణాన్ని అందించారు. తొలిసారి జతకట్టి మిక్స్ డ్ టీమ్ విభా గంలో బరిలో దిగిన తరుణ్ దీప్- 00 జోడీ ఏప్రిల్ 24న హోరాహోరీగా సాగిన ఫైనల్లో షూటాల్లో గ్రేట్ బ్రిటన్ పై విజయం సాధించింది. పసిడి పోరులో రెండు సార్లు వెనకబడ్డప్పటికీ అద్భుతంగా పుంజుకున్న ఈ భారత జంట 5-4 (35-37, 36-33, 39-40, 38-37, షూటాప్ 18-17) తేడాతో పిట్మన్- అలెక్స్ పై నెగ్గి తమ తొలి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 38 ఏళ్ల తరుపున దీప్ కు ఇదే మొదటి ప్రపంచకప్ మిక్సన్ టీమ్ స్వర్ణం, మరో వైపు 17 ఏళ్ల బెదిరి ఇదే తొలి ప్రపంచకప్ పసిడి పథకం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచకప్ స్టేజ్-1 పోటీల్లో స్వర్ణ పథకం గెలుచుకున్న ఆర్చర్లు తరుణ్ దీప రాయ్ రిథి పార్
ఎవరు: తరుణ్ దీప రాయ్ రిథి పార్
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్ లో రజతం గెలుచుకున్న భారత క్రీడాకారుడు దీపక్ పునియా :

ఆసియా రెజ్లింగ్ చాంపి యన్షిప్ లో భారత క్రీడాకారుడు దీపక్ పునియా రజతంతో సరి పెట్టుకున్నాడు. ఏప్రిల్ 24న జరిగిన 86 కేజీల పైనల్లో దీపక్ 1-8తో అజ్ఞ్యాత్ దౌలెలెకోవ్ (కజకిస్తాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రత్యర్థులకు ఒక్క పాయింటు ఇవ్వకుండా ఫైనల్ చేరుకున్న దీపక్. తుదిపోరులో ప్రత్యర్థి డిఫెన్స్ నుచేదించలేకపోయాడు. దీపక్ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ పాయింట్లు రాబట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా ఆసియా టోర్నీలో దీపక్ కు ఇది నాలుగో పతకం 2021లో రజతం 2 2020లలో రెండు కాంస్యాలు సాధించాడు. 32 కేజీలలో విక్కీ చాహర్ కాంస్యం నైనాడు. కాంస్య పతక పోరులో విద్య 5-3లో ఉజినియాజ్ సమర్పయబోవ్ (ఆమెకన్)పై విజయం సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్ లో రజతం గెలుచుకున్న భారత క్రీడాకారుడు దీపక్ పునియా
ఎవరు: దీపక్ పునియా
ఎప్పుడు :ఏప్రిల్ 24
ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 6వ ఆంట్రప్రెన్యూర్ & లీడర్ షిప్ అవార్డ్స్ ఎంపికైన బీనా మోడీ :

ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 6వ ఆంట్రప్రెన్యూర్ & లీడర్ షిప్ అవార్డ్స్ 2022లో మోదీ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ డాక్ట ర్ బీనా మోడీ ‘ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్ కు ఎంపికయ్యారు. గౌరవనీయులైన కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు ఈ అవార్డును అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి:ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 6వ ఆంట్రప్రెన్యూర్ & లీడర్ షిప్ అవార్డ్స్ ఎంపికైన బీనా మోడీ
ఎవరు: బీనా మోడీ
ఎప్పుడు : ఏప్రిల్ 24
ప్రాన్స్ అద్యక్ష పదవిని మరోసారి గెలుచుకున్న ఇమ్యాన్యుయేల్ మేక్రాన్:

ఫ్రాన్స్ దేశ అద్యక్ష పీటం మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మేక్రాన్ నే వరించింది.వాస్తవానికి ఏప్రిల్ 23న నిర్వహించిన రెండో దశ విడత ఎన్నికల పలితాలు వెలువడ్డాయి. ఆయన ప్రత్యర్థి మారీన్ లీ పెన్ ఓటమిని అంగీకరించారు. దీంతో పలితం ముందుగానే తెలిపోయినట్లు అయింది. 2017 నాటి అధ్యక్ష ఎన్నికల్లో వీరిద్దరే ప్రత్యర్దులుగా ఉన్నారు. లీ పెన్ ఆలోచనలు సిద్దాంతాలు అతివాదాన్ని తలపిస్తున్నాయని అవి ప్రజస్వామ్య విరుద్దంగా ఉన్నాయని అనేక మంది ముందస్తు సర్వేల్లో అబిప్రాయపడ్డారు. ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించడాన్ని నిషేదిస్తానని ప్రకటించడాన్ని ప్రస్తావించారు. కాగ ఎన్నికల పలితాల్లో మేక్రాన్ కు 58.6 శాతం మరియు మారీన్ కు 41.5 శాతం ఓట్లు గా నమోదు అయ్యాయి..
క్విక్ రివ్యు :
ఏమిటి:ప్రాన్స్ అద్యక్ష పదవిని మరోసారి గెలుచుకున్న ఇమ్యాన్యుయేల్ మేక్రాన్
ఎవరు:ఇమ్యాన్యుయేల్ మేక్రాన్
ఎక్కడ: ఫ్రాన్స్
ఎప్పుడు : ఏప్రిల్ 24
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |