Daily Current Affairs in Telugu 23 September -2022
హాకీ ఇండియా కొత్త ఆధ్యక్షుడిగా మాజీ హాకి కెప్టెన్ దిలీప్ టిర్కీ ఎన్నిక :

భారత హాకీ మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ హాకీ ఇండియా (హెచ్ఎ) కొత్త ఆధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. షెడ్యూల్ తర్వాత లేకు ప్రకారం అక్టోబర్ 1న హాక్ ఇండియా ఎన్నికలు జరగాలి. అధ్యక్ష పదవితో పాటు మరే పద “వికి పొడి లేకపోవడంతో ఫలితాలను ముందే ప్రకటించారు ఆధ్యక్ష పదవికి చర్శితో పాటు యూపీ హాకీ సంఘం అధ్యక్షుడు రాకేశ్ కల్యాల్, జార్ఖండ్ హారీ సంఘం అధ్యక్షుడు లోకా నాక్సింగ్ పోటీపడ్డారు. సెప్టెంబర్ 22న రాకేష్ బోళా నాడ్ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టర్కీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఒక ఆటగాడు అధ్యక్ష పదవి చేపటనుండడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి : హాకీ ఇండియా కొత్త ఆధ్యక్షుడిగా మాజీ హాకి కెప్టెన్ దిలీప్ టిర్కీ ఎన్నిక
ఎవరు : దిలీప్ టిర్కీ
ఎప్పుడు :సెప్టెంబర్ 23
ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ ఎస్) అధ్యక్షుడిగా కె. రాజప్రసాద్ రెడ్డి ఎన్నిక :

ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ ఎస్) అధ్యక్షుడిగా కె. రాజప్రసాద్ రెడ్డి (సాక్షి) సెప్టెంబర్ 23న ఎన్నికయ్యారు. హిందీ పత్రిక ‘ఆజ్ సమాజ్’లో పనిచేస్తున్న రాకేశ్ శర్మ డిప్యూటీ ప్రెసి డెంటుగా బాధ్యతలు చేపడతారు. ‘మాతృభూమి’ ఆరోగ్య పత్రికకు చెందిన ఎం.వి. శ్రేయమ్స్ కుమార్ వైస్ ప్రెసిడెంటుగా సొసైటీ 83వ వార్షిక సమావేశంలో ఈ ఎన్నికలు జరిగినట్లు ఐఎన్ఎస్ తెలిపింది. తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా) కోశాధికారిగా ఎన్నికయ్యారు. వీడియో కాన్ఫరెన్సు, ఇతర మాధ్యమాల ద్వారా ఈ వార్షిక సమావేశం జరిగింది. 41 మందితో కూడిన ఐఎన్ ఎస్ కార్యనిర్వాహక సంఘంలో మోహిత్ జైన్ (ది ఎకనమిక్ టైమ్స్), వివేక్ గోయెంకా (ది ఇండియన్ ఎక్స్ ప్రెస్), జయంత్ మమ్మేన్ మాథ్యూ (మల యాక మనోరమ), అతిదేవ్ సర్కార్ (ది టెలి గ్రాప్) కె.ఎన్. తిలక్ కుమార్ (డెక్కన్ హెరాల్డ్ అండ్ ప్రజావాణి) సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ ఎస్) అధ్యక్షుడిగా కె. రాజప్రసాద్ రెడ్డి ఎన్నిక
ఎవరు : కె. రాజప్రసాద్ రెడ్డి
ఎప్పుడు :సెప్టెంబర్ 23
వి.కేర్ కమ్యునిటీ పోలిసింగ్ చొరవ ను ప్రారంబించిన లెఫ్టినెంట్ జనరల్ వికె సక్సేన :

లెఫ్టినెంట్ జనరల్ వికె సక్సేనా గారు డిల్లి పోలిస్ ల యొక్క వివిధ పథకాల గురించి ప్రజల అవగాహన కల్పించే లక్ష్యంతో కమ్యునిటీ పోలిసింగ్ చొరవ “వి.కేర్” ను డిల్లీలో ప్రారంబించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తన 72 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న సేవా దివస్ సందర్బంగా ఇండియా గెట్ లోని కార్తయా పాత్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కార్యక్రమంను ప్రారంబించబడింది.ఈ చొరవ యొక్క లక్ష్యం సమన్వయాన్ని నిర్వహించడానికి మరియు పోలిస్ పబ్లిక్ తో ఇంటర్ ఫేస్ ను ఏర్పాటు చేయడానికి డిల్లి పోలిస్ ల యొక్క వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడం కోసం అన్ని డిసిపి లు రాబోయే మూడు నెలల పాటు ప్రతి శని మరియు ఆదివారాల్లో తమ తమ ప్రాంతాలలో కమ్యూనిటి పోలిసింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.కాగా ఈ కార్యక్రమాలు పిల్లలు మహిళలు సీనియర్ సిటిజన్ లు మరియు విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించడంలో సహాయపడతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : వి.కేర్ కమ్యునిటీ పోలిసింగ్ చొరవ ను ప్రారంబించిన లెఫ్టినెంట్ జనరల్ వికె సక్సేన
ఎవరు : జనరల్ వికె సక్సేన
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :సెప్టెంబర్ 23
అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం: సెప్టెంబర్ 23 :

అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం గా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23 న జరుపుకుంటారు.కాగా 19 డిసెంబర్ 2017న, యుఎన్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 23ని అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవంగా (IDSL) ప్రకటించింది. సంజ్ఞా భాషలను ఉపయోగించే ఇతర వినియోగదారులతో పాటుగా వ్యవహరించే వ్యక్తుల భాషాపరమైన గుర్తింపుకు ఈ రోజు మద్దతునిస్తుంది మరియు రక్షిస్తుంది. అంతర్జాతీయ బధిరుల వారం (24 30 సెప్టెంబరు 2018)లో భాగంగా 23 సెప్టెంబర్ 2018న మొదటిసారిగా జరుపుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం: సెప్టెంబర్ 23
ఎప్పుడు :సెప్టెంబర్ 23
IOA యొక్క రాజ్యాంగ సవరణ కమిటి కి నియమించబడిన జస్టిస్ L. నాగేశ్వరరావును నియమించిన సుప్రీం కోర్టు :

ఐ.ఓ.ఎ యొక్క రాజ్యాంగాన్ని సవరించడానికి SC జస్టిస్ L. నాగేశ్వరరావును నియమి౦చబడ్డారు. .భారత ఒలింపిక్ సంఘం (10A) రాజ్యాంగాన్ని సవరించడం మరియు ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేయడం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు గారిని 22 సెప్టెంబర్ 2022న సుప్రీంకోర్టు నియమించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ((OC) 8 సెప్టెంబరు 2022న IOAకి తన పాలనా సమస్యలను పరిష్కరించుకోవాలని మరియు డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఒక తుది హెచ్చరికను జారీ చేసింది, లేని పక్షంలో I OC భారతదేశాన్ని నిషేధిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : IOA యొక్క రాజ్యాంగ సవరణ కమిటి కి నియమించబడిన జస్టిస్ L. నాగేశ్వరరావును నియమించిన సుప్రీం కోర్టు
ఎవరు : సుప్రీం కోర్టు
ఎక్కడ: డిల్లీ
ఎప్పుడు :సెప్టెంబర్ 23
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |