Daily Current Affairs in Telugu 23-05-2021
తొలి మహిళా ప్లైట్ టెస్టింగ్ ఇంజనీర్ గా ఆఫ్రిత ఎంపిక :

తొలి మహిళ ఫ్లైట్ టెస్టింగ్ ఇంజినీర్ ఆప్రిత వైమానిక దళంలో కఠినంగా భావించే ఫ్లైట్ టెస్టింగ్ ఇంజినీర్ జాబ్ కు తొలిసారిగా ఓ మహిళ ఎంపికై రికార్డు సృష్టించింది. ఆమె కర్ణాటక-చామరాజనగర్ జిల్లా కొల్లెగళకు చెందిన యువతీ ఆప్రిత ఓలేటి. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లగలరని తన ప్రతిభతో మరోసారి నిరూపించి. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. 1975లో స్థాపించిన ఎయిర్ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ నుంచి ఆమె ఎంపికయ్యారు. అందులో ఇప్పటికి 275 మంది మాత్రమే ఈ కోర్సు పూర్తిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలి మహిళా ప్లైట్ టెస్టింగ్ ఇంజనీర్ గా ఆఫ్రిత ఎంపిక
ఎవరు: ఆఫ్రిత
ఎప్పుడు : మే 23
మేరా గావ్, కరోనా ముక్తి గావ్’ ప్రచారాన్ని ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ :

గ్రామాల్లో కరోనాను తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘మేరా గావ్స్, కరోనా ముక్తి గావ్స్’ అనే ఒక ప్రచారాన్ని ప్రారంభించిందియోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధికారక వ్యాప్తిని నియ అంచడానికి, రాష్ట్రంలో ఏజెపి ప్రభుత్వం వివిధ ప్రచారాలను ప్రారంభించింది. తాజాగా గ్రామాలను కరోనావైరస్ సంక్రమణ నుండి విముక్తిగా. ప్రకటించడానికి మేరా గాప్స్, కరోనా ముక్త గావ్స్’ ప్రచారాన్ని ప్రారంభించింది. కోవిడ్ ఫ్రీ గా విలేజెస్ ప్రకటించే గ్రామాలకు ప్రత్యేక పథకాల ప్రయోజనాలు కూడా ఇవ్వబడతాయి. గ్రామాలను కోవిడ్ ఫ్రీగా మార్చడానికి గ్రామాలు మరియు ప్రభుత్వం కలిసి పనిచేయడానికి వీలుగా ఇది ప్రారంభించబడింది.
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని : లక్నో
- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి : యోగి ఆదిత్యా నాద్
- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : ఆనంది బెన్ పటేల్
క్విక్ రివ్యు :
ఏమిటి: మేరా గావ్, కరోనా ముక్తి గావ్’ ప్రచారాన్ని ప్రారంభించిన ఉత్తరప్రదేశ్
ఎవరు: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఉత్తరప్రదేశ్
ఎప్పుడు : మే 23
ఫుట్ బాల్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన రూబెన్ డయాస్ :

మాంచెస్టర్ సిటీ డిఫెండర్ రూబెన్ డయాసన్ ను ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇయర్ 2020-21 సంవత్సరానికి గాను ఎంపిక చేసినట్లు ప్రకటించారు .మొత్తంమీద, తొమ్మిది మంది సిటీ ఆటగాళ్ళ యొక్క ఓట్ల ను పొందారు. వారు వేసిన మొత్తం ఓట్లలోని ఎక్కువ శాతానికి పైగా రూబెన్ డయాస్ ఓట్లు సంపాదించాడు. ఇంగ్లీష్ ఫుట్ బాల్ తన మొదటి సీజన్లో ఎఫ్ డబ్ల్యుఎ అవార్డును గెలుచుకున్న మూడవ ఆటగాడు డయాస్ నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫుట్ బాల్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన రూబెన్ డయాస్
ఎవరు: రూబెన్ డయాస్
ఎప్పుడు : మే 23
ప్రతిష్టాత్మక ఏటియత్నే గ్లిచిచ్ అవార్డు దక్కించుకున్న హాకీ ఇండియా :

హాకీ ఇండియా ఇటీవల అరుదైన గౌరవం హాకీ ఇండియాను ప్రతిష్ఠాత్మక ఎటియన్నే గ్లిచిచ్ అవార్డు వరించింది. దేశంలో హకీ క్రీడకు అభివృద్ధికి చేసిన ఎనలేని సేవలకు గాను ఈ గౌరవం దక్కింది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) 47వ కాంగ్రెస్ లో భాగంగా ఈ అవార్డులను ప్రకటించింది. హాకీ అభివృద్ధిలో భాగమైన సంస్థలు, బృందాలు, వ్యక్తులకు ఈ అవార్డు ను ఇస్తారు. హాకీలో మౌలిక సదుపాయాల కల్పన, యువతలో క్రీడా స్ఫూర్తికి కృషి చేసినందుకు ఉజ్బెకిస్థాన్ కు పాబ్లో నెగ్రే అవార్డు దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక ఏటియత్నే గ్లిచిచ్ అవార్డు దక్కించుకున్న హాకీ ఇండియా
ఎవరు: హాకీ ఇండియా
ఎప్పుడు : మే 23
ఆక్స్ పర్డ్ వర్సిటీ స్టుడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ;

ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికయ్యింది. స్టుటెండ్ యూనియన్ కు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియన్ ఆరిజన్ అన్వీ భుటానీ ఘన విజయం సాధించింది. ఆమె ప్రస్తుతం వర్సిటీలోని మ్యాగడలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ చదువుతున్నది. 2021-22 విద్యా సంవత్సరానికిగాను స్టుడెంట్ యూనియన్లోని ఆక్స్ పర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్, రేసియల్ అవేర్నెస్, ఈక్వాలిటీ క్యాంపైన్ కో చైర్ పదవికోసం బరిలో నిలిచింది. దీంతో ఆమెకు భారీగా ఓట్లు పోలవడంతో ఏకపక్షంగా విజయం సాధించింది
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆక్స్ పర్డ్ వర్సిటీ స్టుడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి
ఎవరు: భారత సంతతి యువతి అన్వీ భుటానీ
ఎప్పుడు : మే 23
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |