
Daily Current Affairs in Telugu 23-02-2022
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ గా ఎంపికైన అజిత్ అగార్కర్ :

ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ గా భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నేతృత్వంలోని సహాయక సిబ్బంది బృందంలో అగార్కర్ కూడా పని చేస్తాడని ఢిల్లీ యాజమాన్యం ప్రకటించింది. ఏ స్థాయిలోనైనా కోచ్గా వ్యవహరించడం అగార్కర్ కు ఇదే తొలిసారి. డిల్లి క్యాపిటల్ కు ప్రవీణ్-ఆమ్రే బ్యాటింగ్ కోచ్ గా, హోప్స్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. అగార్కర్ ఎంపికను ప్రకటించడంతో ఇప్పటి వరకు అసి స్టెంట్ కోచ్లుగా పని చేసిన కైఫ్, అజయ్ రాత్రా లతో ఒప్పందం రద్దయినట్లు స్పష్టమైంది. 1998 2007 మధ్య కాలంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన అగార్కర్ 26 టెస్టుల్లో 58 వికెట్లు. 191 వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. 2007 520 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అతను ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల తరపున ఆడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ గా ఎంపికైన అజిత్ అగార్కర్
ఎవరు: అజిత్ అగార్కర్
ఎక్కడ: డిల్లి క్యాపిటల్స్ జట్టు
ఎప్పుడు: ఫిబ్రవరి 23
అడిడాస్ కంపెని బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన భారత క్రీడాకారిణి మణిక బాత్ర :

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, మానిక బాత్రా అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. మపిళలు తమ యొక్క కలలను సాకారం చేసుకునేలా సాకారత కల్పించడం అడ్డంకులను ఛేదించేలా మహిళలను ప్రోత్సహించడం మరియు వారిని క్రీడల్లో భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తుంది. ఈ అసోసియేషన్ తో. దేశ వ్యాప్తంగా రాబోయే మహిళా క్రీడాకారుల ఆకాంక్షలను మరింత పెంచుతూ క్రీడలలో విశ్వసనీయతను మరియు చేరికన్లు పెంచడం ఈ జంట లక్ష్యం.
క్విక్ రివ్యు :
ఏమిటి: అడిడాస్ కంపెని బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన భారత క్రీడాకారిణి మణిక బాత్ర
ఎవరు: భారత క్రీడాకారిణి మణిక బాత్ర
ఎప్పుడు: ఫిబ్రవరి 23
ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ సి-డోమ్ ను విజయవంతంగాపరీక్షించిన ఇజ్రాయెల్ దేశం :

ఐరన్ దోమ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క కా కొన్ఫిగరేషన్ అయిన సి-డోమ్ ను విజయవంతంగా పరీక్షించినట్లు ఇజ్రాయెల్ ఉన్స్ ఫోరెన్ తెలిపింది. C-డోమ్ సిస్టమ్ ఐరన్ డోమ్ యొక్క నౌకాదళ వెర్షన్ ఇది గత దశాబ్ద కాలంగా గాజా స్ట్రిప్ నుండి రాకెట్‌లను పేల్చడానికి ఇది ఉపయోగించబడింది.అంతేకాక అధునాతన బెదిరింపులను అడ్డుకునేందుకు రూపొందించిన సి-డోమ్ వ్యవస్థను పరీక్షించింది. ఇజ్రాయెల్ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఇజ్రాయెల్ ఆధారిత రక్షణ సంస్థ రాఫెల్ తో సంయుక్తంగా అభివృద్ధి చేసింది. రాకెట్ ఫైర్, క్రూయిజ్ క్షిపణులు & UAVలతో సహా అనేక ఆధునాతన దాడుల నుండి కూడారక్షించుకోవడానికి, ‘C-డోమ్’ విజయవంతంగా అడ్డగించేందుకు గాను రూపొందించబడింది.
- ఇజ్రాయెల్ దేశ రాజధాని :జెరూసలేం
- ఇజ్రాయెల్ దేశ కరెన్సీ : ఇస్రాయెల్ షెకెల్
- ఇజ్రాయెల్ దేశ అద్యక్షుడు : ఇసాక్ హీర్జోగ్
- ఇజ్రాయెల్ దేశ ప్రదాని :నఫ్తాలి బెన్నెట్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐరన్ దోమ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ సి-డోమ్ ను విజయవంతంగాపరీక్షించిన ఇజ్రాయెల్ దేశం
ఎవరు: ఇజ్రాయెల్ దేశం
ఎక్కడ: ఇజ్రాయెల్ దేశం
ఎప్పుడు: ఫిబ్రవరి 23
టైర్ 1 ఇన్వెస్టర్ వీసాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన యునైటెడ్ కింగ్డమ్ :

భద్రతాపరమైన ప్రమాదాలు ఉన్నాయని ఆరోపిస్తూ యునైటెడ్ కింగ్డమ్ టైర్ 1 ఇన్వెస్టర్ వీసాను తక్షణమే రద్దు చేసింది. ఈ వీసా 2008 నుండి దాదాపు 254 మంది భారతీయ మిలియనీర్లు యు.కే లో స్థిరపడేందుకు వీలు కల్పించింది మూడు రోజుల క్రితం యూకే హోం సెక్రటరీ ప్రీతి పటేల్ ఈ వీసాను రద్దు చేస్తూ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని అన్నారు యుకె ఆధారిత అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2008 నుండి 2020 మధ్య కాలంలో ఈ వీసాను పొందిన అత్యంత సంపన్నులలో భారతీయులు 7వ జాతీయులుగా ఉన్నారు. చైనా అగ్రస్థానంలో 4,106, రష్యా (2,526), హాంకాంగ్ (692), అమెరికా (685) పాకిసాన్ (283), కజకిస్తాన్ (278) భారత్ కంటే ముందున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: టైర్ 1 ఇన్వెస్టర్ వీసాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన యునైటెడ్ కింగ్డమ్
ఎవరు: యునైటెడ్ కింగ్డమ్
ఎప్పుడు: ఫిబ్రవరి 23
జెట్ ఎయిర్‌వేస్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా విపుల గుణతిల్లేక నియామకం :

శ్రీ లంక దేశానికి చెందిన ఎయిర్‌లైన్స్ మాజీ సియివో ఐన విపుల గుణతిల్లేక మార్చి 1, 2022 నుండి జెట్ ఎయిర్‌వేస్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. ఆయన యొక్క నియామకం జెట్ ఎయిర్‌వేస్, జలాన్ కల్రాక్ కన్సార్టియం యొక్క నూతన ప్రమోటర్లచే చేయబడింది., ఆయన జనవరి 2022 వరకు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యొక్క సియివో గా ఉన్నారు. అతను నవంబర్ 2015 నుండి జూలై 2018 వరకు ఎమిరేట్స్ మేనేజ్‌మెంట్ కింద టాగ్ అంగోలా ఎయిర్‌లైన్స్ యొక్క సి.ఎఫ్.వో మరియు బోర్డు లో సభ్యుడు కూడాఉన్నారు..
- శ్రీలంక దేశ రాజధాని :కోలోంబో
- శ్రీలంక దేశ కరెన్సీ : శ్రీలంకన్ రూపీ
- శ్రీలంక దేశ అద్యక్షుడు : గోటబాయ రాజపక్స
క్విక్ రివ్యు :
ఏమిటి: జెట్ ఎయిర్‌వేస్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా విపుల గుణతిల్లేక నియామకం
ఎవరు: విపుల గుణతిల్లేక నియామకం
ఎక్కడ: శ్రీలంక
ఎప్పుడు: ఫిబ్రవరి 23
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |