Daily Current Affairs in Telugu 22&23 October – 2022
చైనా అధ్యక్షుడు మూడోసారి ఎన్నికైన జిన్ పింగ్ :

చైనా దేశ అధ్యక్షుడు షి జిన్సెంగ్ చరిత్ర సృష్టించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) -వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత మరెవరికీ సాధ్యం కాని తరహాలో దేశాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. 69 ఏళ్ల జిన్ పింగ్ సీపీసీ అధినేత హోదాలో కూడా కొనసాగనున్నారు. శక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్ గానూ ఆయన నియమితులయ్యారు. దీంతో దేశంలో అత్యున్నత అధికార కేంద్రాలన్నీ జిన్సెంగ్ చేతుల్లోనే ఉన్నట్లయింది. చైనాను ఆయన జీవితకాలంపాటు పాలించడమూ ఇక లాంచనప్రాయంగానే కనిపిస్తోంది. ‘బీజింగ్ వేదికగా జరిగిన సీపీసీ 20వ జాతీయ మహాసభల్లో పార్టీ’ కేంద్ర కమిటీని ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఆ కమిటీ సమావేశమై 24 మందితో కూడిన పొలిట్ బ్యూరోకు ఆమోదముద్ర వేసింది. అనంతరం పొలిట్ బ్యూరో ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంది. చైనా పాలనా వ్యవహారాలన్నింటినీ చూసుకునే ఈ కమిటీలో ‘జిన్ పింగ్ తో పాటు కీలక నేతలు శ్రీ కియాంగ్, ఝావో లెజి, వాంగ్ హ్యూనింగ్, సైకి, డింగ్ షుయెషియాం లి షిలకు చోటుదక్కింది.
క్విక్క్ రివ్యు :
ఏమిటి : చైనా అధ్యక్షుడు మూడోసారి ఎన్నికైన జిన్ పింగ్
ఎవరు : జిన్ పింగ్
ఎక్కడ: చైనా
ఎప్పుడు : అక్టోబర్ 22
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో మరో రెండు పతకాలు గెలుచుకున్న భారత్ :

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ మరో రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. మహిళల 25 మీటర్ల టీమ్ పిస్టల్లో రజతం, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో కాంస్యం మన సొంతమయ్యాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్లో రిధమ్ సాంగ్వాన్, మను బాకర్, అబింద్య అశోక్ తో కూడిన భారత జట్టు ఫైనల్లో చైనా చేతిలో 0 16తో ఓడి రజతంతో సంతృప్తి పడింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ కాంస్య పతక పోరులో భారత్ (ఐశ్వరీ తోమర్, స్వప్నిల్, నీరజ్) 17-15తో అమెరికా పై గెలిచింది.
క్విక్క్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో మరో రెండు పతకాలు గెలుచుకున్న భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : అక్టోబర్ 22
ఆసియాలోని పది కాలుష్య నగరాల జాబితా లో భారత్ నుంచి ఎంపికైన ఎనిమిది నగరాలు :

ఆసియాలోని పది కాలుష్య నగరాల జాబితాలను వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకటించింది. అక్టోబర్ 23న నమోదు చేసిన వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)ల ఆధారంగా ఈ జాబి తాను వెలువరించింది. ఇందులో ఎనిమిది నగరాలు భారత్ కు చెందినవే ఉన్నాయి. ఇందులో దేశ రాజధాని ఢిల్లీ లేకపోవడం గమనార్హం. వాయు కాలుష్యం లేని నగరాల జాబితానూ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజమహేంద్ర వరానికి ఇందులో చోటు దక్కింది. అత్యంత కాలుష్య నగరాల్లో గురుగ్రామ్ అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ 23న ఉదయానికి ఈ ప్రాంతంలో ఏక్యూఐ.. 679 నమోదైంది. తర్వాత స్థానాల్లో హరియాణాలోని దారుహేరా (ఏక్యూఐ 3 543). బిహార్ లోని ముజఫర్ నగర్ (ఏక్యూఐ 316). లబ్నవూలోని తాలక్రా (ఏక్యూఐ 298). బేగుసరాయ్లోని డీఆర్సీసీ ఆనందపర్ (ఏక్యూఐ 266), కల్యాణ్ లోని బడకాపడా (ఎక్యూఐ 256). దర్శన్ నగర్, చాప్రా (ఏక్యూఐ 239) ఉన్నాయి. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 150 దాటితే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
క్విక్క్ రివ్యు :
ఏమిటి :ఆసియాలోని పది కాలుష్య నగరాల జాబితా లో భారత్ నుంచి ఎంపికైన ఎనిమిది నగరాలు
ఎవరు :భారత్
ఎప్పుడు : అక్టోబర్ 22
మాల్దీవ్స్ ఇంట ర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించి న సిక్కి రెడ్డి :

మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ రాష్ట్ర అమ్మాయి సిక్కి రెడ్డి మిక్స్ డబుల్స్ విభాగం 1లో టైటిల్ సాధించింది. అక్టోబర్ 24న జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి – రోహన్ కపూర్ (భారత్ ) జోడీ 21-16. 21-18తో టాప్ సీడ్ తనీనా -కొనాలా మామెరి (అల్జీరియా) ద్వయంపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆకర్షి కశ్యప్ (భారత్) 24-22, 21-12తో ఇరా శర్మ (భారత్ )పై నెగ్గి విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి- రోహన్ కపూర్ (భారత్) జోడీ 21 23 21 19, 21 17తో చలేం ఫన్ నాంతకర్న్ (థాయ్ లాండ్) జంటపై గెలిచి టైటిల్ దక్కించుకుంది.
క్విక్క్ రివ్యు :
ఏమిటి :మాల్దీవ్స్ ఇంట ర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించి న సిక్కి రెడ్డి :
ఎవరు : సిక్కి రెడ్డి
ఎప్పుడు : అక్టోబర్ 22
దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణలో అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణా రాష్ట్రము :

దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి నుంచి చెత్తను సేకరించడానికి అవసరమైన వాహనాలున్న గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్ర భాగాన నిలిచింది. జాతీయ స్థాయిలో 33 శాతం మాత్రమే ప్రతి నుంచి చెత్త సేకరించడానికి, తరలించడానికి వాహనాలు ఉండగా తెలంగాణలో 99.9 శాతం వాహన సౌకర్యం ఉన్నట్టుగా తేలింది. ఘన వ్యర్థాల నిర్వహణ దేశవ్యాప్త సగటు 70శాతం ఉండగా, తెలంగాణలో వందకు వందశాతం జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో వెల్లడైంది నాగాలాండ్ లో అతి తక్కువగా ఘన వ్యర్థాల నిర్వహణ 16 శాతం మాత్రమే ఉన్నది. దేశంలో డంపింగ్ షెడ్లను నిర్మించి, చెత్తను వేరు చేయడానికి కల్పించిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. ప్రత్యేకంగా సౌకర్యం ఈ విషయంలో జాతీయ సగటు 35.2 శాతం ఉండగా, తెలంగాణలో వంద శాతం ఉన్నది. పుదుచ్చేరిలో అసలు ఇలాంటి సౌకర్యాలే లేవు.
క్విక్క్ రివ్యు :
ఏమిటి : దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణలో అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణా రాష్ట్ర౦
ఎవరు : తెలంగాణా రాష్ట్రము
ఎప్పుడు : అక్టోబర్ 22
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టు లో నుంచి పాకిస్తాన్ ను తొలగింపు :

అంతర్జాతీయ ఆర్ధిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్ కు భారీ ఊరట లభించింది. ‘గ్రే లిస్ట్’ నుంచి ఆ దేశాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటీఎఫ్). తొలగిం చింది. గురు, శుక్రవారాల్లో సింగపూర్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్థానకు ఏర్పడింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడిచేసే లక్ష్యాలను పాకిస్థాన్ అందుకోకపోవడం వల్ల ఎఫ్ఎటిఎఫ్ నాలుగేళ్ల పాటు ఆ దేశాన్ని గ్రే లిస్ట్లో ఉంచింది. పాకన్ను గ్రే లిస్ట్ నుంచి తొలగించడంపై భారత్ స్పందించింది. తీవ్రవాదం పై విశ్వసనీయ, గుర్తించదగిన చర్యల్ని వాక్ చేపట్టేలా చూడాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని వ్యాఖ్యానించింది.’అత్యంత ప్రమాదకర, తక్షణ చర్యలు అవసర మైన’ దేశాల జాబితాలో ఎఫ్ఎఏటీఎఫ్ తొలిసారిగా మయన్మార్ పేరును చేర్చింది. వాచ్ డాగ్ బ్లాక్ స్థగా పిలిచే ఈ జాబితాలో ఇప్పటికే ఇరాన్, ఉత్తర కొరియా దేశాలు కొనసాగుతున్నాయి.
క్విక్క్ రివ్యు :
ఏమిటి : ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టు లో నుంచి పాకిస్తాన్ ను తొలగింపు
ఎవరు : పాకిస్తాన్
ఎప్పుడు : అక్టోబర్ 22
మోస్ట్ పాపులర్ జిఐ అవార్డు ను తెలంగాణా కు చెందిన హైదరాబాది హలీం :

తెలంగాణా కు చెందిన హైదరాబాది హలీం ,రసగుల్లా ,భికనేరి భుజియా మరియు రాత్లామి సేవ్ తో సహా ఇతర ఆహార పదార్థాలను వెనక్కి నెట్టి మోస్ట్ పాపులర్ జిఐ అవార్డును గెలుచుకుంది.జియోగ్రాఫికల్ ఇండికేషన్ హోదా తో దేశ వ్యాప్తంగా 15 కంటే ఎక్కువ ఆహార పదార్థాలతో గట్టి పోటి పడి ప్రసిద్ద హైదరాబాది హలీం మోస్ట్ పాపులర్ జిఐ అవార్డు ను కైవసం చేసుకుంది. అధీకృత వినియోగదారులను జనాదరణ పొందిన ఉత్పత్తి పేరును మాత్రమే ఉపయోగించగాలరని నిర్దారించడానికి ఉత్పత్తులను జిఐ ట్యాగ్ ఇవ్వబడుతుంది. మొదాటి సారిగా హైదరబాద్ హలీం కు 2010 తో ముగిసింది.అయితే తర్వాత జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్టార్ డిప్ కి సంబందించిన ట్యాగ్ ను పది సంవత్సరాల పాటు పునరుద్గాటించారు.
క్విక్క్ రివ్యు :
ఏమిటి : మోస్ట్ పాపులర్ జిఐ అవార్డు ను తెలంగాణా కు చెందిన హైదరాబాది హలీం
ఎవరు : హైదరాబాది హలీం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఐదో ఖెలో ఇండియా యూత్ గేమ్స్ -2022 ఆథిత్యం ఇవ్వనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం

ఐదో ఖెలో ఇండియా యూత్ గేమ్స్ -2022 మధ్యప్రదేశ్ రాష్ట్ర౦ లో జరుగుతుందని ఖెలో ఇండియా యూత్ గేమ్స్ ఐదవ ఎడిషన్ మధ్యప్రదేశ్ లో జనవరి 31న ఫిబ్రవరి 11 వరకు ఎనిమిది నగరాలలో నిర్వహించబడుతుంది అని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.అక్టోబర్ 23న ఎంపి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది.
క్విక్క్ రివ్యు :
ఏమిటి : ఐదో ఖెలో ఇండియా యూత్ గేమ్స్ -2022 ఆథిత్యం ఇవ్వనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం
ఎవరు : మధ్యప్రదేశ్
ఎప్పుడు : అక్టోబర్ 22
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |