Daily Current Affairs in Telugu 22&23 December- 2022
భారతదేశంలో మూడు నూతన సాంస్కృతిక ప్రదేశాలకు గుర్తింపు :

భారతదేశంలోన ఇటీవల మూడు కొత్త సాంస్కృతిక ప్రదేశాలను గుర్తించారు.అందులో, మోధేరాలోని ఐకానిక్ సన్ టెంపుల్, గుజరాత్ రాష్ట్రం లోని చారిత్రాత్మక వాద్నగర్ పట్టణం మరియు త్రిపుర రాష్ట్రం లోని ఉనకోటి యొక్క రాక్-కట్ రిలీఫ్ శిల్పాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి
క్విక్ రివ్యు :
ఏమిటి : భారతదేశంలో మూడు నూతన సాంస్కృతిక ప్రదేశాలకు గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 22
అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్ పర్సన్ గా దినేష్ కుమార్ శుక్లా నియామకం :

సీనియర్ అణు శాస్త్రవేత్త అయిన దినేష్ కుమార్ శుక్లాగారిని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) చైర్‌పర్సన్‌గా మూడేళ్ల కాలానికి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం AERB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న శుక్లా, జి నాగేశ్వరరావు గారి తర్వాత ఉన్నత పదవికి చేరుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్ పర్సన్ గా దినేష్ కుమార్ శుక్లా నియామకం
ఎవరు : దినేష్ కుమార్ శుక్లా
ఎప్పుడు : డిసెంబర్ 23
దేశంలోనే మొదటి పదాతిదల మధ్యప్రదేశ్ రాష్ట్రం లో ఏర్పాటు :

దేశంలోని మొట్టమొదటి పదాతిదళ మ్యూజియం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లోని మోవ్‌లో సాధారణ ప్రజల కోసం ప్రారంభించబడింది. కాగా ఈ మ్యూజియం దేశంలో మొదటిది మరియు ప్రపంచంలో రెండవది. ఇంతకు ముందు ఇలాంటి మ్యూజియాన్ని అమెరికాలో కూడా నిర్మించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే మొదటి పదాతిదల మధ్యప్రదేశ్ రాష్ట్రం లో ఏర్పాటు
ఎవరు : మధ్యప్రదేశ్ రాష్ట్రం
ఎక్కడ : మధ్యప్రదేశ్
ఎప్పుడు : డిసెంబర్ 22
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ షార్ట్ లిస్టు లో తెలుగు చిత్రం లో నినాటు నాటు పాట :

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల సందడి మొదలైంది అంతర్జాయంగా ఈసారీ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు చిత్రాలు తీయ సినిమా విభాగం పోటీపడుతున్నాయి. తాజాగా అస్కార్ అవార్డుల నామినే షన్స్ లో పోటీపడనున్న చిత్రాల షార్టి లిస్ట్ ను అకాడమీ ప్రకటించింది. పది విభాగాలకు సంబంధించిన ఈ జాబితాలో అవకాశం దక్కించుకుంది. జాతాలో నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానం దక్కించుకున్నాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్ ఫిల్మ్ షో, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్’ ఆర్’ నుంచి ‘నాటునాటు’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్’ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పెర్స్’ చోటు దక్కించుకున్నాయి.షార్ట్ లిస్ట్ కు ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్ నిర్వహించనున్నారు. దాని ఆధారంగా జనవరి 24న ఆస్కార్ నామినేషన్ అందుకున్న చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుకలో విజేతలకు పురస్కారాలను అందజేస్తారు.. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘నాటు నాలు’ పాటకు కీరవాణి స్వరాలు అందించగా, ప్రేమ రక్షిత్ నృత్యాలు సమకూర్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్ఠాత్మక ఆస్కార్ షార్ట్ లిస్టు లో తెలుగు చిత్రం లో నినాటు నాటు పాట
ఎప్పుడు : డిసెంబర్ 23
ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి విగ్రహంను ద్వారకా నగరంలో నిర్మించనున్న గుజరాత్ ప్రభుత్వం :

గుజరాత్‌లోని ద్వారకా నగరంలో ‘దేవ భూమి ద్వారకా కారిడార్ కింద ప్రపం చంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం నిర్మించబో తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలి పింది. వచ్చే ఏడాది సెప్టెంబరులో ప్రారంభించే, ఈ నిర్మాణంలో శ్రీమద్ భగవత్ గీత 3డీ అను భూతిని ఏర్పాటు చేయబోతున్నట్లు గుజరాత్ ఆరో గ్యశాఖ మంత్రి రుషికేశ్ పటేల్ వెల్లడించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి విగ్రహంను ద్వారకా నగరంలో నిర్మించనున్న గుజరాత్ ప్రభుత్వం
ఎవరు : గుజరాత్ ప్రభుత్వం
ఎప్పుడు : డిసెంబర్ 22
ప్రముఖ తెలుగు నటుడు కైకాల సత్య నారాయణ కన్నుమూత :

అరవయ్యేళ్ల నట ప్రయాణం 870 పైగా సినిమాలు.. నిలువెత్తు రూపంతో గంభీరమైన వాచకాభినయాలతో నవరసాలు పలికించిన తెలుగు తెర దిగ్గజం పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన విశిష్ట నటుడు కైకాల సత్యనారాయణ (87) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఫిలింనగర్ లోని స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. తన 24ఏళ్ల వయసులో చలనచిత్రరంగ ప్రవేశం చేసి.అత్యధికంగా ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. కరుణ, హాస్యరస ప్రధానమైన పాత్రలనూ అవలీలగా పోషించి ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన తొలి చిత్రం సిపాయి కూతురు’. మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన ‘మహర్షి’ సినిమా తర్వాత సత్యనారాయణ తెరపై కనిపించ లేదు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ తెలుగు నటుడు కైకాల సత్య నారాయణ కన్నుమూత
ఎవరు : కైకాల సత్య నారాయణ
ఎప్పుడు : డిసెంబర్ 22
Daily current affairs in Telugu Pdf November - 202 |
---|
Daily current affairs in Telugu 01-11-2022 |
>Daily current affairs in Telugu 02-11-2022 |
Daily current affairs in Telugu 03-11-2022 |
Daily current affairs in Telugu 04-11-2022</strong> |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 06-11-2022</strong> |
Daily current affairs in Telugu 07-11-2022 |
Daily current affairs in Telugu 08-11-2022 |
>Daily current affairs in Telugu 09-11-2022 |
Daily current affairs in Telugu 10-11-2022 |
Daily current affairs in Telugu 11-11-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |