
Daily Current Affairs in Telugu 22 November – 2022
భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీ టీఈ) చైర్మన్ గా ఐఐటీ- గుహహటి డైరెక్టర్ టి.జి. సీతారామ్ నియామకం :

ఐఐటీ- గుహహటి డైరెక్టర్ టి.జి. సీతారామ్ భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీ టీఈ) చైర్మన్ గా నియ మితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర, విద్యా మంత్రిత్వ శాఖ నవంబర్ 22న ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించింది. ప్రస్తుతం ఏఐసీ టీఈ తాత్కాలిక ఇన్ చార్జిగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ఉన్నారు. టి.జి.సీతారామ్ ‘గతంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ ట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) లో సివిల్ ఇంజినీ రింగ్ విభాగ ప్రొఫెసర్గా సేవలందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీ టీఈ) చైర్మన్ గా ఐఐటీ- గుహహటి డైరెక్టర్ టి.జి. సీతారామ్ నియామకం
ఎవరు : టి.జి. సీతారామ్
ఎప్పుడు : నవంబర్ 22
గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్ లో భాగస్వామురాలైన తొలి భార తీయ మహిళ సుధా రెడ్డి :

మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి భార్య సుధా రెడ్డి.. గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్ లో భాగస్వామురాలైన తొలి భార తీయ మహిళగా గుర్తింపు పొందారు. పారిస్ లో తాజాగా జరిగిన ది గ్లోబల్ గిఫ్ట్ గాలా ఎడిషన్ లో ఆమె భారత్ తరఫున పాల్గొన్నారు. సంస్థ పోషకుల్లో ఒకరిగా అధికారికంగా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ ప్రచారకురాలిగా కొత్త బాధ్యతల కోసం తాను ఎదురు చూస్తున్నానని ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్ లో భాగస్వామురాలైన తొలి భార తీయ మహిళ సుధా రెడ్డి
ఎవరు : సుధా రెడ్డి
ఎప్పుడు : నవంబర్ 22
(UNEP) 2022 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గెలుచుకున్న పూర్ణిమా దేవి బర్మాన్ :

పూర్ణిమా దేవి బర్మాన్, కన్జర్వేషన్ బయాలజిస్ట్, ప్రపంచంలోని అరుదైన కొంగలలో ఒకటైన గ్రేటర్ అడ్జటెంట్ను రక్షించడం కోసం అస్సాం నుండి అన్ని స్త్రీల అట్టడుగు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించినందుకు పేరుగాంచిన యు.ఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) 2022 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ప్రకటించబడింది.2005లో ప్రారంభమైనప్పటి నుండి, సహజ ప్రపంచాన్ని రక్షించే ప్రయత్నాలలో ప్రయత్నాలలో ముందంజలో ఉన్న ట్రైల్లో బ్లేజర్లకు వార్షిక ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును అందజేస్తున్నారు. ఇది UN అత్యున్నత పర్యావరణ గౌరవం. ఈ రోజు వరకు, ఈ అవార్డు 111 మంది గ్రహీతలను గుర్తించింది: 26 దేశాల నుంచి ప్రపంచ నాయకులు, 69 వ్యక్తులు మరియు 16 సంస్థల నుంచి ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2,200 నామినేషన్లు వచ్చాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : (UNEP) 2022 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గెలుచుకున్న పూర్ణిమా దేవి బర్మాన్
ఎవరు : పూర్ణిమా దేవి బర్మాన్
ఎప్పుడు : నవంబర్ 22
ప్రపంచ పర్యవరణ సూచిలో టాప్ 5 స్థానం లో నిలిచిన భారత్ :

ప్రపంచ పర్యవరణ సూచిలో భారత్ టాప్ 5 స్థానం లో నిలిచింది. ఈమేరకు నవంబర్ 22న ప్రపంచ వాతావరణ మూడో మార్పు పనితీరు సూచిక (సీసీపీఐ) ను వెల్లడించారు. కాగా జర్మనీ దేశానికికి చెందిన న్యూ క్లెమేట్ ఇనిస్టి ట్యూట్ అండ్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషల్ నుంచి ఈ సూచికను ప్రచురించింది. అంతర్జాతీయ వాతావరణ రాజకీయాలలో పారదర్శక పనితీరు తను పెంపొందించడం, వాతావరణ పరిరక్షణ ఈ యూత్ ప్రయత్నాలు, దేశాలు వ్యక్తిగతంగా సాధించిన మార్పును పురోగతిని పోల్చడాన్ని ఈ ఇండెక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ర్యాంకింగ్స్ లో భారత్ ‘గతంలో కన్నా 2 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్-5వ స్థానంలో నిలిచింది. డెన్మార్క్, స్వీడన్, చిలీ, మొరాకోలు భారత్ కన్నా ముందున్నాయి. అయితే మొదటి, రెండు, మూడో ర్యాంకులను ఏ దేశానికి కేటాయించలేదు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ పర్యవరణ సూచిలో టాప్ 5 స్థానం లో నిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : నవంబర్ 22
‘హ్వాసాంగ్-17’ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా దేశం :

ఉత్తర కొరియా దేశం ‘హ్వాసాంగ్-17’ అనే ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కాగ దీనికి మాన్స్టర్ మిస్సైల్ అని కూడా పేరు పెట్టారు. హ్వాసాంగ్-17 అనేది ఉత్తర కొరియా దేశ యొక్క అతిపెద్ద క్షిపణి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి-మొబైల్, ద్రవ ఇంధనంతో నడిచే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘హ్వాసాంగ్-17’ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా దేశం
ఎవరు : ఉత్తరకొరియా దేశం
ఎప్పుడు : నవంబర్ 22
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |