
Daily Current Affairs in Telugu 22-05-2021
2022 ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్ భారత్ ఆతిత్యం :

2022 ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్ భారతదేశంలో జరగనుంది. 2022 ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్ ను 2022 అక్టోబర్ 11 నుండి 30 వరకు భారతదేశంలో జరుగుతుంది. కోవిడ్ -19 వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా రద్దు చేయబడటానికి ముందే భారతదేశం 2021 అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ గ్లోబల్ ఈవెంట్ 2017 లో ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ తరువాత భారతదేశం ఆతిథ్యమిస్తున్న రెండవ ఫిఫా టోర్నమెంట్ ఇదే కానుంది,
క్విక్ రివ్యు :
ఏమిటి: 2022 ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్ భారత్ ఆతిత్యం
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు : మే 22
ఒడిశా రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా డాక్టర్ హృషీకేశ్ మల్లిక్ నియామకం :

ఒడిశా రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా డాక్టర్ హృషీకేశ్ మల్లిక్ గారు ఇటీవల ఎంపికయ్యారు. ఒడిశా రాష్ట్ర సంగీత నాటక్ అకాడమీ అధ్యక్షుడిగా ఒడిస్సీ డాన్సీస్ పద్మశ్రీ అరుణ మొహంతి గారు ఎంపికయ్యారు. కాగా ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఒడిశా లలిత కళా అకాడమీకి అధిపతిగా శ్రీనిబాస్ పాడిపను, ఒడిశా ఉర్దూ అకాడమీకి అధిపతిగా డాక్టర్ సయ్యద్ ముసిర్ ఆలం లను కూడా నియమించారు.
- ఓడిశా రాష్ట్ర రాజధాని :భువనేశ్వర్
- ఓడిశా రాష్ట్ర ముఖమంత్రి :నవీన్ పట్నాయక్
- ఓడిశా రాష్ట్ర గవర్నర్ :గణేషి లాల్
క్విక్ రివ్యు :
ఎవరు: డాక్టర్ హృషీకేశ్ మల్లిక్
ఎక్కడ: ఓడిశా
ఏమిటి: ఒడిశా రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా డాక్టర్ హృషీకేశ్ మల్లిక్ నియామకం :
ఎప్పుడు : మే 22
ఆసియాలోనే కుబేరుల జాబితాలో టాప్-20లో చోటు దక్కించుకున్న గౌతమ్ అధాని :

భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చరిత్ర సృష్టించారు. రెండో స్థానానికి దూసుకుపోయారు. అదానీ గ్రూపుకు చెందిన వివిధ రంగాల షేర్లు ఈ ఏడాది(2021)లో పెరగడంతో అతని సంపద అదే రీతిన పెరిగింది. ఫలితంగా ఆసియాలోనే రెండో ధనవంతుడిగా నిలిచారు.. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-20లో చోటు దక్కించుకున్న అదానీ ప్రస్తుతం ఈ ఘనతను సాధించాడు. కాగా రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన ప్రకారం ఇప్పటిదాకా ఆసియాలో రెండో స్థానంలో కొనసాగిన చైనా పారిశ్రామికవేత్త జోంగ్ షాన్షాన్ ఆస్తి 6,360 కోట్ల డాలర్లకు పడిపోయింది. కాగా అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీతో మే 22 నాటికి గౌతమ్ అదానీ యొక్క వ్యక్తిగత సంపద 6,650 కోట్ల డాలర్లకు పెరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియాలోనే కుబేరుల జాబితాలో టాప్-20లో చోటు దక్కించుకున్న గౌతమ్ అధాని
ఎవరు: గౌతమ్ అధాని
ఎప్పుడు : మే 22
ఐర్లాండ్ క్రికెట్ స్టార్ బౌలర్ బోయ్ రాంకిన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు :

ఐర్లాండ్ క్రికెట్ స్టార్ బౌలర్ బోయ్ రాంకిన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. బోయ్ రాంకిన్ క్రికెట్లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. రాంకిన్ తన కెరీర్ ను 2007లో మొదలుపెట్టాడు. కరీబియన్ గడ్డపై జరిగిన 2007 ప్రపంచకప్లో రాంకిన్ ఐర్లాండ్ తరపున 12 వికెట్లు తీసి ఆకట్టుకోవడమే గాక తొలిసారి ఒక మేజర్ టోర్నీలో ఐర్లాండ్ సూపర్-8కు అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. 2012 వరకు ఐర్లాండ్ కు ఆడిన రాంకిన్ ఆ తర్వాత ఇంగ్లండ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2013లో న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2013-14 ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లోనూ ఇంగ్లండ్ తరపున ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇంగ్లండ్ జట్టులో అవకాశం రాకపోవడంతో ఇక మీదట ఐర్లాండ్ కు ఆడనున్నట్లు 2015లో ప్రకటించాడు. అలా బోయ్డ్ రాంకిన్ తన కెరీర్లో ఐర్లాండ్ తరపున 75 వన్డేల్లో 106 వికెట్లు, 50 టీ20ల్లో 55 వికెట్లు, 3 టెస్టుల్లో 8 వికెట్లు తీశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐర్లాండ్ స్టార్ బౌలర్ బోయ్ రాంకిన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: బోయ్ రాంకిన్
ఎక్కడ: : ఐర్లాండ్
ఎప్పుడు : మే 22
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గా మే 22 :

భూమి యొక్క సమతుల్యతను కాపాడుకోవడంలో జీవవైవిధ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మానవ శ్రేయస్సుతో సన్నిహితంగా ముడిపడి ఉన్న పర్యావరణ వ్యవస్థ సేవలకు పునాది వంటిది. అన్ని రకాల జంతువులు, మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు కూడా మన సహజ ప్రపంచాన్ని తయారు చేస్తాయి. ఈ జాతులు మరియు జీవులు ప్రతి ఒక్కటి సమతుల్యతను కాపాడుకోవడానికి మరియు జీవితాన్ని ఆదరించడానికి ఒక సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలలో కలిసి పనిచేస్తాయి. వాటిలో ఒకటి అంతరించిపోతే, ఇతరులు కూడా ప్రమాదంలో పడటం ప్రారంభిస్తారు. దీని ప్రకారం, “జీవవైవిధ్యానికి సమస్య ఉన్నప్పుడు, మానవాళికి సమస్య ఉంటు౦ది. జీవ వైవిధ్య వనరులు మనం నాగరికతలకు నిర్మించే స్తంభాలు. జీవ వైవిధ్యం అనే అంశం ఫై అవగాహన కల్పించే ఉద్దేశ్య౦ తోఅంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ప్రతి సంవత్సరం మే 22న జరుపుకుంటారు. “మేము పరిష్కారంలో భాగం” అనేది ఈ సంవత్సరానికి ఇతివృత్తంగా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గా మే 22
ఎక్కడ: : ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : మే 22
చైనా శాస్త్రవేత్త హైబ్రిడ్ వరి వంగడం పితా మహుడు యువాన్ లొంగ్ పింగ్ కన్నుమూత :

చైనా దేశ శాస్త్రవేత్త, హైబ్రిడ్ వరి వంగడ పితామహుడు యువాన్ లోంగ్ పింగ్ (91) మే 22న అనారోగ్యంతో మృతి చెందారు. వరిసాగులో విప్లవాత్మక మార్పులకు లోంగ్ పింగ్ పరిశోధనలు కారణమయ్యాయి. 1970లో ఆయన సృష్టించిన హైబ్రిడ్ వరి వంగడాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకలి చావుల నుంచి కాపాడాయి. చైనా సహా ప్రపంచదేశాల ఆహార కొరత తీర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు తీవ్ర ఆహర కొరతతో సతమతమైన చైనా ప్రస్తుతం ఆహార భద్రత సాధించిందంటే అది లోంగ్ పింగ్ చలవే ఆయన కనిపెట్టిన హైబ్రిడ్ వరి వంగడాలతో 9శాతం సాగుభూమితో ప్రపంచంలో ఐదో వంతు ప్రజలకు ఆహారం లభిస్తోంది. 1930లో బీజింగ్ లో జన్మించిన యువాన్. 1973లో అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వరి వంగడాలను సృష్టించారు. 1949లో చైనాలో ప్రజలు ఆకలితో రోడ్ల మీదే చనిపోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది.
- చైనా రాజధాని : బీజింగ్
- చైనా దేశ కరెన్సీ :యువాన్
- చైనా దేశ అద్యక్షుడు : జీన్ పింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: చైనా శాస్త్రవేత్త హైబ్రిడ్ వరి వంగడం పితా మహుడు యువాన్ లొంగ్ పింగ్ కన్నుమూత :
ఎవరు: యువాన్ లొంగ్ పింగ్
ఎక్కడ:చైనా
ఎప్పుడు : మే 22
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |