
Daily Current Affairs in Telugu 22-02-2022
ఏపీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ పి.సీతారామాంజనేయులు నియామకం :

ఏపీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు.. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. రవాణా శాఖా కమిషనర్ గా ,ఎపిపఎస్సి కార్యదర్శిగా అదనపు బాద్యతలు నిర్వర్తిస్తున్నారు.వీటన్నింటిని నుంచి ఆయన్ను రిలీవ్ చేసి ఇంటలిజెన్స్ దిజిగా కీలక బాద్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటివరకు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సెమెంట్ డీజీగా ఉన్న కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సీతారామాంజనేయులు నిర్వహిస్తున్న రవాణా కమిషనర్ బాధ్యతలను ఎం.టి.కృష్ణబాబుకి, ఏపీపీఎస్సీ కార్యదర్శి బాధ్యతల్ని ఎ.బాబుకి ఇచ్చారు. ఏసీబీ డీజీ బాధ్యతల్ని డీజీపీకి అదనంగా కశాఖ అప్పగించారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు శాఖ డీజీగా ఉన్న శంఖబ్రత బాగ్చిని విజిలెన్స్ అండ్ అదనపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా నియమించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏపీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ పి.సీతారామాంజనేయులు నియామకం
ఎవరు: పి.సీతారామాంజనేయులు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: ఫిబ్రవరి 22
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2022 గాను ఉత్తమచిత్రంగా నిలిచిన షేర్షా :

విష్ణువర్థన్ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్ వార్ ఫిల్మ్ ఐన ‘షేర్షా’ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2022 వేడుకలో ‘ఉత్తమ చిత్రం ‘ అవార్డును కైవసం చేసుకుంది.దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 ఫిబ్రవరి 20న ముంబైలో జరిగింది మరియు ఈసారి ఈవెంట్లో గత సంవత్సరం అత్యుత్తమ ప్రదర్శనలను సత్కరించారు. ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 భారతీయ సినిమా యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పింది మరియు 75 సంవత్సరాల స్వాతంత్ర్యం లేదా ఆజాదీ కా అమృత్ మహోత్సవన్ను కూడా స్మరించుకుంది. విక్రమ్ బాత్రా అనే యువకుడు సైనికుడిగా మారాలని కలలు కంటూ అమ్మాయితో ప్రేమలో పడతాడు. శిక్షణ పొందిన వెంటనే, అతను అత్యధిక సైనిక ర్యాంక్లను అధిరోహించాడు.అనేది ఈ చిత్రం యొక్క కథాంశం గా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2022 గాను ఉత్తమచిత్రంగా నిలిచిన షేర్షా
ఎవరు: షేర్షా చిత్రం
ఎప్పుడు: ఫిబ్రవరి 22
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) చాంపియన్ గా నిలిచిన శ్రీవల్లి రష్మిక హుమేరా బహార్మన్ జంట :

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక హుమేరా బహార్మస్ జంట చాంపియన్ గా నిలిచింది. హరియాణాలోని గురుగ్రామ్ లో ముగిసిన ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో రష్మిక హంమేరా జంట 6–3, 1–6, 10-3తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ పునిస్ కొవాపితుక్లెట్ (థాయ్లాండ్)-ఆ ఉరెకె (రష్యా) జోడీపై గెలిచింది. రష్మిక హుమేరాలకు ఇదే తొలి ఐటీఎస్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) చాంపియన్ గా నిలిచిన శ్రీవల్లి రష్మిక హుమేరా బహార్మన్ జంట
ఎవరు: శ్రీవల్లి రష్మిక హుమేరా బహార్మన్
ఎప్పుడు: ఫిబ్రవరి 22
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) లో చైర్మన్ గా ఎన్నికైన ఏమ్మా టేర్త్ :

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) లో) అథ్లెట్ల కమిషన్ కు ఫిన్లాండ్ కు చెందిన ఐస్ హాకీ క్రీడాకారిణి ఎమ్మా టెర్త్ ను దాని చైర్మన్ గా తిరిగి ఎన్నుకుంది మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సెయుంగ్ మిన్ ర్యును దాని మొదటి వైస్- చైర్మన్ (VC)గా ఎన్నుకుంది. ఈ కమిషన్ రెండవ చైర్మన్ గా న్యూజిలాండక్కు చెందిన సైక్లిస్ట్ సారా వాకర్ ఎన్నుకుంది. ఎమ్మా టెర్రో ఐవ్ – టైమ్ ఒలింపియన్ మరియు ఫిన్లాండ్ మహిళల ఐస్ హాకీ జట్టు మాజీ కెప్టెన్ గా ఉన్నారు. పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల వరకు ఆమె కమిషన్ కు అధిపతిగా ఉండనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) లో చైర్మన్ గా ఎన్నికైన ఏమ్మా టేర్త్
ఎవరు: ఏమ్మా టేర్త్
ఎప్పుడు: ఫిబ్రవరి 22
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ అవార్డ్ దక్కించుకున్న రన్ వీర్ సింగ్ :

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 ముంబైలో జరిగింది.దాదాసాహెబ్ ఫాల్కేజీ ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ జ్ఞాపకార్థం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ అవార్డును అందిస్తారు. కాగా ఇది భారతదేశం యొక్క ఏకైక స్వతంత్ర అంతర్జాతీయ చలనచిత్రోత్సవం. ఇందులో బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్ మరియు కృతి సనన్ ’83’చిత్రం మరియు ‘మిమి’ చిత్రాలలో తమ నటనకుగాను ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి విభాగంలో వీరు అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ అవార్డ్ దక్కించుకున్న రన్ వీర్ సింగ్
ఎవరు: రన్ వీర్ సింగ్ ఎక్కడ:
ఎప్పుడు: ఫిబ్రవరి 22
దేశంలోని నదులలో మొదటి నైట్ నావిగేషన్ మొబైల్ అప్లికేషన్ ను ప్రారంబించిన అసోం :

అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ఫెర్రీల కోసం దేశంలోని నదులలో మొదటి నైట్ నావిగేషన్ మొబైల్ కు సంబంధించిన ఒక అప్లికేషన్ ను ప్రారంభించబడింది. ఈ వ్యవస్థతో అమర్చబడిన ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ ఫెర్రీ యొక్క ప్రారంభ రాత్రి ప్రయాణం గౌహతి మరియు ఉత్తర గౌహతి మధ్య రాత్రి 9 గంటలకు ప్రయాణించింది మరియు తిరుగు ప్రయాణాన్ని కూడా దాదాపు గంటలో పూర్తి చేసింది.రాత్రి నావిగేషన్ మొబైల్ అప్లికేషన్‌ను రవాణా శాఖ ఐఐటి మద్రాస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కె రాజుతో కలిసి అభివృద్ధి చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోని నదులలో మొదటి నైట్ నావిగేషన్ మొబైల్ అప్లికేషన్ ను ప్రారంబించిన అసోం
ఎవరు: అసోం
ఎక్కడ: అసోం లోని దామోదర్ నది లో
ఎప్పుడు: ఫిబ్రవరి 22
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |