Daily Current Affairs in Telugu 21 November – 2022
బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు దక్కిన అంతర్జాతీయ పురస్కారం :

హింది కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కార౦ చేరింది. రెడ్ సి ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఆయన ను ఎంపిక చేసినట్లు చిత్రోత్సవ నిర్వాహకులు నవంబర్ 21న ప్రకటించారు. భారతీయ సినిమా రంగానికి షారుఖ్ చేసిన సేవలను గుర్తింపుగా చిత్రోత్సవం సందర్భంగా ఈ అవార్డ్ ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.సౌది అరేబియా లోని జెద్దా లో డిసెంబర్ 01 నుంచి 10వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు దక్కిన అంతర్జాతీయ పురస్కారం
ఎవరు : షారుఖ్ ఖాన్
ఎప్పుడు :నవంబర్ 21
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్ బాద్యతలు స్వీకరణ :

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా పంజాబ్ రాష్ట్ర కేడర్ కు చెందిన మాజీ ఐ.ఎ ఎస్ అధికారి అరుణ్ గోయల్నవంబర్ 21 బాద్యతలు స్వీకరించారు.దీంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్ అనూఫ్ చంద్ర పాండే లతో కూడిన కమిషన్ లో మూడో స్థానం ను ఆయన బర్తీ చేసినట్టయింది.ఈ ఏడాది డిసెంబర్ తొలి వారం గుజరాత్ శాసనసభ ఎన్నికల జరగనున్న నేపద్యంలో ఆయన నియామకం ప్రాదాన్యం సంతరించుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్ బాద్యతలు స్వీకరణ
ఎవరు : అరుణ్ గోయల్
ఎప్పుడు :నవంబర్ 21
విజయ్ హజారే ట్రోఫి లో అత్యధిక పరుగులతో రికార్డ్ సృష్టించిన తమిళనాడు ప్లేయర్ నారాయణ్ జగదీషణ్ :

విజయ్ హజారే ట్రోఫి లో ఈశాన్య జట్టు బౌలర్లు తమిళనాడు బ్యాటర్ ల చేతిలో ఊచకోత కు గురయ్యారు. దొరికిందే చాన్స్ అన్నట్లుగా చెలరేగిపోయిన తమిళనాడు ఓపెనర్ లు నారాయణ్ జగదీషణ్ 277 పరుగులు 141 బంతులలో మరియు సాయి సుదర్శన్ 154 పరుగులు పండుగ చేసుకున్నారు.దీంతో లిస్టు ఏ క్రికెట్ లో పలు ప్రపంచ రికార్డ్ లు బద్దలు అయ్యాయి.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50ఓవర్ లలో 2 వికెట్ లు 506 పరుగులు చేసింది. అనంతరంఎం.సిద్దార్థ్ 5/12 ,సిలాంబరన్ 2/7 మహ్మద్ 2/3 ల ధాటికి అరుణాచల్ ప్రదేశ్ 28.4 ఓవర్ లలో 71 పరుగులకే కుప్పకూలింది. కాగా జగదీశ్ లిస్టు ఏ లో అత్యధిక వ్యక్తి గత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2002 లో ఇంగ్లాండ్ కౌంటి క్లబ్ సర్రే ఆటగాడు ఆలిస్టర్ బ్రౌన్ గ్లమోర్గాన్ పైన 268 పరుగులతో నెలకొల్పిన రికార్డు బద్దలైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : విజయ్ హజారే ట్రోఫి లో అత్యధిక పరుగులతో రికార్డ్ సృష్టించిన తమిళనాడు ప్లేయర్ నారాయణ్ జగదీషణ్
ఎవరు : నారాయణ్ జగదీషణ్
ఎక్కడ ; తమిళనాడు
ఎప్పుడు :నవంబర్ 21
ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా నవంబర్ 21 :

ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రతి సంవత్సరం నవంబర్ 21 న జరుపుకుంటారు.ఇది మన జీవితంలో టెలివిజన్ విలువ మరియు దాని యొక్క ప్రభావాన్ని గుర్తించే రోజు సమాజంలో మరియు వ్యక్తి గత జీవితంలో టెలివిజన్ యొక్క పాత్ర అనేది కీలకంగా ఉంటందని మనందరికీ తెలుసు. కాగా ఇది మనకు రోజు వారి వినోదం మరియు సమాచారం యొక్క మూలం.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా నవంబర్ 21
ఎప్పుడు :నవంబర్ 21
ప్రముఖ పంజాబీ నటి దాల్జీత్ కౌర్ కన్నుమూత :

ప్రముఖ పంజాబీ నటి అయిన దల్జీత్ కౌర్ గారు 69 వయసులో మరణించారు.ఆమె 1970 లు మరియు 1980 లో పంజాబీ చిత్ర పరిశ్రమలో ఆమె అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా అందరికి పరిచయం. దల్జీత్ కౌర్ 10కి పైగా హిందీ మరియు 70 పంజాబీ చిత్రాలలో నటించారు. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె, పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో తొలిసారిగా నటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్ కన్నుమూత
ఎవరు : దల్జీత్ కౌర్
ఎప్పుడు :నవంబర్ 21
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |