
Daily Current Affairs in Telugu 21 December- 2022
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంబించిన మంత్రి హరీష్ రావు :

తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీశ్ రావు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకాన్ని వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ.మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ కిట్ రూపొందించామని వెల్లడించారు. ఇందులో ప్రొటీన్ డైట్ ఉంటుందన్నారు. ప్రతి కిట్ విలువ రూ.2 వేలు ఉంటుందని వెల్లడించారు. “ప్రొటీస్, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం ఈ కిట్ యొక్క లక్ష్యం. మొదటి కిట్ ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎస్సీ సమయంలో, రెండోకిట్ 28–34 వారాల మధ్య చేసే మూడో ఎఎస్సీ చెకప్ సమయంలో, ఎవ్వనున్నారు. దాదాపు 1.25 లక్షల మంది గర్భిణులకు పథకం తొలివిడుతలో 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేయనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంబించిన మంత్రి హరీష్ రావు
ఎవరు : మంత్రి హరీష్ రావు
ఎప్పుడు :డిసెంబర్ 21
రాష్ట్రంలోని పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన అస్సానం రాష్ట్రము :

రాష్ట్రంలోని పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం, పెట్టుబడులను పెంచడం మరియు కల్పించడం వంటి ప్రతిపాదనకు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పరిశ్రమ హోదాతో, పర్యాటక మౌలిక సదుపాయాలలో తాజా పెట్టుబడులు, శాశ్వత స్వభావం, వేగవంతమైన ఉపాధి కల్పన, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం మరియు అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ చర్య పర్యాటక రంగంలోని పై రంగాలలో ప్రైవేట్ పెట్టుబడులను మరింత ప్రోత్సహిస్తుంది మరియు ఉత్పత్తి పెంచుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : రాష్ట్రంలోని పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన అస్సా౦ రాష్ట్రము
ఎవరు : అస్సా౦ రాష్ట్రము
ఎప్పుడు :డిసెంబర్ 21
2024 లో భారత తొలి మానవ అంతరిక్ష విమానం ‘H1’ మిషన్ ప్రారంభిననున్నట్లు ప్రకటించిన మంత్రి జితేంద్ర సింగ్ :

2024 నాల్గవ త్రైమాసికంలో భారతదేశపు తొలి మానవ అంతరిక్ష విమానం ‘H1’ మిషన్ ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సైన్స్ & టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారత వైమానిక దళం నుండి ఎంపికైన వ్యోమగాములు ప్రస్తుతం బెంగళూరులో మిషన్-నిర్దిష్ట శిక్షణ పొందుతున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని 2022లో గగన్ యాన్ ను ప్రారంభించాలని మొదట్లో అనుకున్నారు. కాని అది వాయిదా పడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2024 లో భారత తొలి మానవ అంతరిక్ష విమానం ‘H1’ మిషన్ ప్రారంభిననున్నట్లు ప్రకటించిన మంత్రి జితేంద్ర సింగ్
ఎవరు : మంత్రి జితేంద్ర సింగ్
ఎప్పుడు :డిసెంబర్ 21
భారతదేశపు మొట్టమొదటి ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరి :

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బజాజ్ అలయన్డ్ నుండి భారతదేశపు మొట్టమొదటి ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్. ఉత్పత్తులలో ఒకదాన్ని ప్రారంభించారు. ఈ వృద్ధిలో భీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది; ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టకు భద్రతా ఏర్పాటుగా పని చేస్తుంది మరియు కాంట్రాక్టర్ తో పాటు ప్రిన్సిపాల్ ను ఇన్సులేట్ చేస్తుంది. ఇది బ్యాంక్ గ్యారెంటీ యొక్క ఇన్ఫ్రా డెవలపర్ల ఆధారపడటాన్ని తగ్గించే చర్య .
క్విక్ రివ్యు :
ఏమిటి : భారతదేశపు మొట్టమొదటి ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరి
ఎవరు : కేంద్రమంత్రి నితిన్ గడ్కరి
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు :డిసెంబర్ 21
‘ఈట్ రైట్ క్యాంపస్ ‘గా ద్రువీకరించబడిన రామోజీ ఫిలిం సిటి :

ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్ సిటీకి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అత్యుత్తమ రేటింగ్ కింద ఫిల్మ్ సిటీని ‘ఈట్ రైట్ క్యాంపస్ ‘గా ద్రువీకరించింది. ఫిల్మ్ సిటీని సందర్శించే అతిథులు, పర్యాటకులకు జాతీయ ఆరోగ్య విధాన ప్రమాణాలకు లోబడి సురక్షిత, పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన ఆహా రాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. దాదాపు 1660 ఎకరాల్లో విస్తరించిన రామోజీ ఫిల్మ్ సిటీలో 15 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో త్రీస్టార్, ఫైవ్ స్టార్ కేటగిరి హోటళ్లు ఉన్నాయి. ఇవన్నీ ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహించే కనమైన ఆడిటింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. ప్రమాణాలను పూర్తిస్థా పాటించడంతో ‘ఈబ్ రైట్ క్యాంపస్’గా పిల్మ్ సిటీ గుర్తింపు సాయించింది. స్టార్ హోటళ్లకు ఫైవ్ స్టార్ కేటగిరీతో పరిశుభ్రత, పారిశు క్య ధ్రువీకరణ లభించింది. దేశంలో ప్రజారోగ్యాన్ని పెంపొందిస్తూ జీవన వ్యాధులపై పోరాటం చేసేందుకు జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా ఆరోగ్య ప్రమాణాలు పెంచేందుకు 2018 జులై 105 జూలై 10న ‘సహీ లోజన్, టెహచర్ జీవన్ నినాదం కింద ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ‘ది రట్ రైట్ ఉద్యమం ను ‘ ప్రారంభించింది’.కాగా ఈ ఉద్యమం కింద దేశంలోని ప్రజలందరికీ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనం అందిం • చాలని లక్ష్యంగా నిర్ణయించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘ఈట్ రైట్ క్యాంపస్ ‘గా ద్రువీకరించబడిన రామోజీ ఫిలిం సిటి
ఎవరు : రామోజీ ఫిలిం సిటి
ఎక్కడ : హైదరాబాద్
ఎప్పుడు :డిసెంబర్ 21
ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ.- అభివృద్ధి-2022 అవార్డు గెలుచుకున్న భారతీయ వైద్య సమాజ౦ :

కరోనా వైరస్ సోకిన కోట్ల మంది ప్రజలకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, అవిశ్రాంతంగా విశేష సేవలందించి, కొవిడ్ యోధులుగా నిలిచిన భారతీయ వైద్య సమాజానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ.- అభివృద్ధి-2022 అవార్డు దక్కింది. దేశంలోని వైద్యులు, నర్సులందరి తరపున ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంపి), ట్రైన్డ్ నర్సెస్ ఆర్గనైజేషన్(టీఎన్ఏ) లకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఇందిరా గాంధీ మెమోరి యల్ ట్రస్ట్ బుధవారం ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ.- అభివృద్ధి-2022 అవార్డు గెలుచుకున్న భారతీయ వైద్య సమాజ౦
ఎవరు : భారతీయ వైద్య సమాజ౦
ఎప్పుడు :డిసెంబర్ 21
Daily current affairs in Telugu Pdf November - 202 |
---|
Daily current affairs in Telugu 01-11-2022 |
>Daily current affairs in Telugu 02-11-2022 |
Daily current affairs in Telugu 03-11-2022 |
Daily current affairs in Telugu 04-11-2022</strong> |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 06-11-2022</strong> |
Daily current affairs in Telugu 07-11-2022 |
Daily current affairs in Telugu 08-11-2022 |
>Daily current affairs in Telugu 09-11-2022 |
Daily current affairs in Telugu 10-11-2022 |
Daily current affairs in Telugu 11-11-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |