
Daily Current Affairs in Telugu 21-05-2021
వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు 2020’ గెలుచుకున్న మొదటి భారతీయుడు సురేష్ ముకుంద్:

సురేష్ ముకుంద్ వార్షిక ‘వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు 2020’ గెలుచుకున్న మొదటి భారతీయుడుగా నిలిచారు. ఎమ్మీ అవార్డు-నామినేటెడ్ ఇండియన్ కొరియోగ్రాఫర్ సురేష్ ముకుంద్, ఈయన డాన్స్ గ్రూప్ కింగ్స్ యునైటెడ్ వ్యవస్థాపకుడు. వరల్డ్ ఆఫ్ డాన్స్ షో కు గాను వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డుల టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడు గా నిలిచాడు. అంతకుముందు సురేష్ బృందం ఎన్బిసి యొక్క వరల్డ్ ఆఫ్ డాన్స్ సీజన్-3 ను గెలుచుకుంది. డాన్స్ ప్లస్ 5 అనే టీవీ షోలో కెప్టెన్లలో సురేష్ కూడా ఒకరు. 10వ వార్షిక ‘వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు 2020’ ను గెలుచుకున్నారు,”ఆస్కార్ ఆఫ్ డాన్స్” గా ప్రసిద్ది చెందిన అవార్డులు ప్రతి సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లో టెలివిజన్, ఫిల్మ్, వాణిజ్య ప్రకటనలలో,డిజిటల్ కంటెంట్ లో మరియు మ్యూజిక్ వీడియోలలో ప్రదర్శించబడే ప్రపంచంలోని ఉత్తమ కొరియోగ్రాఫర్‌ల యొక్క అత్యంత వినూత్నమైన ప్రదర్శించనలు ఇచ్చిన వారికి ఇవ్వడం జరుగుతాయి
క్విక్ రివ్యు:
ఏమిటీ: వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు 2020’ గెలుచుకున్న మొదటి భారతీయుడు సురేష్ ముకుంద్
ఎవరు: సురేష్ ముకుంద్
ఎప్పుడు: మే 21
ఎఫ్ ఐహెచ్ అథ్లెట్స్ కమిటీ సభ్యుడిగా భారత హాకీ స్టార్ పీఆర్ శ్రీజేష్ నియామకం :

భారత హాకీ స్టార్ పీఆర్ శ్రీజేష్ ఎఫ్ ఐహెచ్ అథ్లెట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మే 20న వర్చువల్ గా జరిగిన కమిటీ సర్వ సభ్య సమావేశంలో నలుగురు సభ్యులను ఎన్నుకొగా అందులో శ్రీజేష్ ఒకడు. గతంలో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన ఈ గోల్ కీపర్ జట్టులో అత్యంత సీనియర్లలో ఒకడు. 33 ఏళ్ల శ్రీజేష్ తో పాటు రేబాచా (పోలెండ్), మహ్మద్ మీ (దక్షిణాఫ్రికా), మాట్ స్వాన్ (ఆస్ట్రేలియా) కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎఫ్ఎస్ఐహెచ్ టోర్నీలు, ప్రొ లీగ్, టోక్యో ఒలింపిక్స్ తదితర విషయాల గురించి ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.
క్విక్ రివ్యు:
ఏమిటీ: ఎఫ్ ఐహెచ్ అథ్లెట్స్ కమిటీ సభ్యుడిగా భారత హాకీ స్టార్ పీఆర్ శ్రీజేష్ నియామకం
ఎవరు: హాకీ స్టార్ పీఆర్ శ్రీజేష్
ఎప్పుడు: మే 21
ప్రఖ్యాత పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ సారథి సుందర్ లాల్ బహు గుణ కన్నుమూత:

ప్రఖ్యాత పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ సారథి సుందర్ లాల్ బహుగుణ(94) కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఈనెల 8న రిశికేశ్లోని ఎయిమ్స్ చేరారు.. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో మే 21న తుది శ్వాస విడిచారు. ఉత్తరాఖండ్ సర్కారు ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో గంగానదీ తీరాన పూర్ణానంద్ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించింది 1927, జనవరి 9న ఉత్తరాఖండ్ లోని టిహ్రీలో జన్మించిన బహుగుణగారు 13 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయ ప్రవేశం చేశారు. 1956లో పెళ్లయిన తర్వాత ఆ రంగాన్ని వీడారు. 1960 నుంచి పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించి, దానికోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. 1970ల్లో చిప్కో ఉద్యమం ద్వారా ప్రపంచానికి సుపరిచితులయ్యారు. ముఖ్యంగా హిమాలయాల్లో అడవుల నరికివేతకు టెహ్రీ డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటాలు చేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటీ: ప్రఖ్యాత పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ సారథి సుందర్ లాల్ బహు గుణ కన్నుమూత
ఎవరు: సుందర్ లాల్ బహు గుణ
ఎక్కడ: ఉత్తరాఖండ్
ఎప్పుడు: మే 21
తొలి బాక్సింగ్ ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత ఓపి భరద్వాజ్ కన్నుమూత :

దేశంలో ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి బాక్సింగ్ కోచ్ ఘనత సొంత౦ చేసుకున్న ఓపీ భరద్వాజ్ కన్నుమూసారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 82ఏళ్ల ఓపీ భరద్వాజ్ గారు మే 21 న తుదిశ్వాస విడిచారు. ద్రోణాచార్య అవార్డును తొలిసారి ప్రవేశపెట్టిన సమయం లో 1985లోనే మరో ఇద్దరితో కలిసి భరద్వాజ్ ఆ పురస్కారాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటీ: తొలి బాక్సింగ్ ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత ఓపి భరద్వాజ్ కన్నుమూత
ఎవరు: ఓపి భరద్వాజ్
ఎప్పుడు: మే 21
జాతీయ ఉగ్రవాద వ్యతిరేఖ దినంగా మే 21 :

ఉగ్రవాదుల వల్ల జరిగే హింస గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 21న జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినం గా పాటించడం వెనుక ఉన్న లక్ష్యం ఏమిటంటే, యువత ఉగ్రవాదం మరియు హింస నుండి దూరంగా ఉండటం సామాన్య ప్రజల బాధలను ఎత్తిచూపడం ద్వారా మరియు జాతీయ ప్రయోజనాలకు ఇది ఎలా వ్యతిరేఖ ప్రభావం చూపుతుందో తెలపడం. 1991 లోఈ రోజునే భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు హత్యకు గురయ్యారు. భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున ఈ రోజునే రాజీవ్ గాంధీ 30వ మరణ వార్షికోత్సవాన్ని గుర్తుచేస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటీ: జాతీయ ఉగ్రవాద వ్యతిరేఖ దినంగా మే 21
ఎప్పుడు: మే 21
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |