
Daily Current Affairs in Telugu 21-02-2022
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన టీం ఇండియా :

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సొంతగడ్డపై టీ 20 సిరీస్ లో 3-0తో వెస్టిండీస్ జట్టును చిత్తు చేసిన టీమ్ ఇండియా ఆరేళ్ల తర్వాత నంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 21 న ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ప్రథమ స్థానం సాధించింది. చివరిసారిగా 2016లో రెండు నెలల పాటు టీమిండియా పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో కొనసాగింది. తాజాగా విండీస్ పై ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్ ఇంగ్లాండ్ ను వెనక్కి నెట్టి నంబర్వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. 269 రేటింగ్ పాయింట్లతో టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ సమంగానే ఉన్నా మొత్తం 10,484 పాయింట్లతో రోహిత్ శర్మ సేన నంబర్వన్ నిలిచింది. 10.474 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో ర్యాంకుకు పడిపోయింది. పాకిస్తాన్ (266), న్యూజి లాండ్ (255), దక్షిణాఫ్రికా (253), ఆస్ట్రేలియా (219), వెస్టిండీస్ (235), అఫ్గానిస్థాన్ (232), శ్రీలంక (231), బంగ్లాదేశ్ (231) జట్టు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన టీం ఇండియా
ఎవరు: టీం ఇండియా
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ చేతన్ ఘాటే నియామకం :

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ చేతన్ ఘాటే గారు నియమితులయ్యారు. ప్రొఫెసర్ అజిత్ మిశ్రా గారి తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు.చేతన్ ఘాటే 2016-2020 మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి మానిటరీ పాలసీ కమిటీలో మాజీ సభ్యుడుగా ఉన్నారు .ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేది భారత ప్రభుత్వం క్రింద ఉన్న స్వయం ప్రతిపత్త సంస్థ మరియు పౌర సేవా శిక్షణా సంస్థ మరియు ఇది న్యూఢిల్లీలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ చేతన్ ఘాటే నియామకం
ఎవరు: ప్రొఫెసర్ చేతన్ ఘాటే
ఎప్పుడు :ఫిబ్రవరి 21
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా మనన్ మిశ్రా ఎన్నిక :

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా( బిసిఐ ) చైర్మన్ గా సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా గారు ఆరోసారి ఎన్నికయ్యారు. మరో సీనియర్ లాయర్ ఎస్ ప్రభాకరన్ ను ఉపాధ్యక్ష పదవి లబించింది.బిసిఐ ఎన్నికలు ఈ నెల 06 న జరిగాయి. అయితే ఉపాద్యక్ష పదవుల కోసం మిశ్రా ,ప్రభాకర్ ల తరపున మాత్రమే నామినేషన్ లు దాఖలు ఐనట్లు బిసిఐ కార్యదర్శి శ్రీమంతో సేన్ తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ౦ యొక్క పదవి కాలం ఏప్రిల్ 17 న ప్రారంబం అవుతుందని 2025 ఏప్రిల్ వరకు కొనసాగుతుందని వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా మనన్ మిశ్రా ఎన్నిక
ఎవరు: మనన్ మిశ్రా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : ఫిబ్రవరి 21
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఫిబ్రవరి 21 :

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న జరుపుకుంటారు. భాషా మరియు సాంస్కృతిక వైవిధ్యం గురించి వాటిపైన అవగాహన పెంచడానికి మరియు బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని యునెస్కో వారిచే 17 నవంబర్ 1999న ప్రకటించింది మరియు 2002లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీనిని అధికారికంగా గుర్తించింది. కాగ 2022 సంవత్సరానికి గాను ఈ దినోత్సవం యొక్క థీమ్: “బహుభాషా అభ్యాసం కోసం సాంకేతికతను ఉపయోగించడం: సవాళ్లు మరియు అవకాశాలు.గా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఫిబ్రవరి 21
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : ఫిబ్రవరి 21
కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత నాగళ్ళ గురుప్రసాదరావు కన్నుమూత :

కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత నాగళ్ళ గురుప్రసాదరావు (88) విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులు కిందట ఆయన నడుస్తూ కిందపడిపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.గురుప్రసాదరావు గుంటూరు చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో 1933లో జన్మించారు. 1978లో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, శాఖాధిపతిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహించారు. 40 ఏళ్ల పాటు ఆధ్యా పక, ప్రిన్సిపల్ వృత్తిలో ఉంటూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఉద్యోగ విరమణ అనంతరం సిద్ధార్థ కళాపీఠం కార్యదర్శిగా (1990-2013) సేవలందించారు. శాలివాహనుడు పేరుతో ఆయన రచించిన చారిత్రక గ్రంథాన్ని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పాఠ్యాంశంగా పరిచయం చేసింది. ప్రముఖ సాహితీవేత్త తుమ్మల సీతారామమూర్తి సాహిత్యంపై ఆయన రచన విశేష ఆదరణ పొందింది. సాహిత్యసేవలకుగాను గురుప్రసాదరావును ప్రతిష్ఠ ఆయన రచనతో విశేష ఆదరణ పొందింది. సాహిత్య సేవలకుగాను గురుప్రసాదరావును ప్రతిష్ఠా త్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారం 2017లో వరించింది. భారతీయ నవలా సాహిత్యం, ప్రముఖ తెలుగు దిన్న మాస, సాహిత్య పత్రికల్లో ఆయన రాసిన వందకు పైగా పరిశోధక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 2006లో సాహిత్య అకాడమీ సాంస్కృతిక ప్రతినిధిగా పనిచేశారు
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత నాగళ్ళ గురుప్రసాదరావు కన్నుమూత
ఎవరు: నాగళ్ళ గురుప్రసాదరా
ఎప్పుడు : ఫిబ్రవరి 21