
Daily Current Affairs in Telugu 20 October – 2022
‘
వరల్డ్ షూటింగ్ చాంపియన్ షిప్ లో రజత పథకాన్ని గెలుచుకున్న భారత్ :

వరల్డ్ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత్ మరో రజత పథకాన్ని గెలుచుకుంది.25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ మిక్స్డ్ టీమ్ లో ఈవెంట్ లో భారత ద్వయం రెండో స్థానంలో నిలిచింది.ఫైనల్లో అనీష్ సిమ్రాన్ ప్రీత్ కౌర్ ద్వయం 14-16స్కోరుతో యుక్రయిన్ కు చెందిన యులియా కోరోస్తేలోపావా మాక్సిం హోరా డైనట్స్ చేతిలో పరాజయం పాలైంది.తాజా వెండి పథకం తో వరల్డ్ చాంపియన్ షిప్ లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 26కు చేరగా జట్టు రెండో స్థానంలో కొనసాగుతుంది.ఇందులో 10స్వర్ణాలు ,6 రజతాలు ,10 కాంస్యాలు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : వరల్డ్ షూటింగ్ చాంపియన్ షిప్ లో రజత పథకాన్ని గెలుచుకున్న భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : అక్టోబర్ 20
కాంగ్రెస్ పార్టీ నూతన అద్యక్షుడిగా మల్లి ఖార్జున్ ఖర్గే నియామకం :

కాంగ్రెస్ పార్టి అద్యక్షుడిగా నూతనంగ ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ఈ నెల 26 న బాద్యతలు చేపట్టనున్నార్.26న ఉదయం 10-30 గంటలకు డిల్లి లో జరిగే ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగే వేడుకలో ఖర్గే ఏఐసిసి చీఫ్ గా ఎన్నికైనట్లు ద్రువీకరన పత్రం అందుకుంటారు.అనంతరం పార్టి కొత్త చీఫ్ బాద్యత లను చేపడతారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణు గోపాల్ గారు చెప్పారు.కాగా ఇటీవల జరిగిన కాంగ్రెస్ అద్యక్ష పదవిఎన్నికలో శషి థరూర్ పైన ఖర్గే గెలిచిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి : కాంగ్రెస్ పార్టీ నూతన అద్యక్షుడిగా మల్లి ఖార్జున్ ఖర్గే నియామకం
ఎవరు : మల్లి ఖార్జున్ ఖర్గే
ఎప్పుడు : అక్టోబర్ 20
యునైటెడ్ కింగ్డం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ :

సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్డం యుకె ప్రధాన మంత్రి లిజ్ ట్రజ్ అక్టోబర్ 20న పదవికి రాజీనామా చేసారు.ఆర్థికంగా పెను సవాళ్ళను ఎదురవ్వడం మినీ బడ్జెట్ తో పరిస్థితి మరింత దిగజారడం రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోడంతో ఖజానా పైన విద్యత్ బిల్లుల భారం పెరిగిపోవటం ధనవంతులకు పన్ను మినహాయింపు పట్ల ఆరోపణలు రావడం ,డాలర్ తో పోలిస్తే పౌండ్ విలువ దారుణంగా పడిపోవడం వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటి అంశాలు ఆమె పై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి. మరో వైపు సొంత పార్టి ఎంపి లు తనపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్దపడటం దీంతో లిజ్ ట్రస్ రాజినమాకే మొగ్గు చూపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : యునైటెడ్ కింగ్డం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్
ఎవరు : లిజ్ ట్రస్
ఎక్కడ : బ్రిటన్
ఎప్పుడు : అక్టోబర్ 20
పేటియం పేమెంట్స్ బ్యాంక్ తాత్కాలిక సియివో గా దీపేంద్ర సింగ్ రాథోజు నియామకం :

పేటియం పేమెంట్స్ బ్యాంక్ దీపేంద్ర సింగ్ రాథోజు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది, దానితో పాటు చీఫ్ ప్రొడక్ట్ & టెక్నాలజీ ఆఫీసర్ గా అతని పాత్ర కూడా ఉంది. ప్రస్తుతం బ్యాంక్ సీఈవోగా పనిచేస్తున్న సతీష్ గుప్తా స్థానంలో ఆయన 2022 అక్టోబర్లో పదవీ విరమణ చేయనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : పేటియం పేమెంట్స్ బ్యాంక్ తాత్కాలిక సియివో గా దీపేంద్ర సింగ్ రాథోజు నియామకం
ఎవరు : దీపేంద్ర సింగ్ రాథోజు
ఎప్పుడు : అక్టోబర్ 20
భారత దాత్రుత్వంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన శివ్ నాడార్ :

సాఫ్ట్ వెర్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపక ఛైర్మన్ శివ్ నాడార్ దాతృత్వంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 2021-22లో ఆయన రూ.1,161 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు దాదాపు రూ.3 కోట్లను వితరణగా అందించారు. ఏడేల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2022 జాబితాలో విప్రోవ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ రూ. 484 కోట్ల విరాళంతో రెండో స్థానానికి చేరారు. వరసగా రెండు సంవత్సరాల పాటు ఈ జాబితాలో ప్రేమ్ జి ఈసారి తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ రూ. 190 కోట్ల విరాళంతో జాబితాలో ఏడోస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 15 మంది శ్రీమంతులు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత దాత్రుత్వంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన శివ్ నాడార్
ఎవరు : శివ్ నాడార్
ఎప్పుడు : అక్టోబర్ 20
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |