Daily Current Affairs in Telugu 20 December- 2022
నమ్మ స్కూల్ అనే ఒక నూతన పథకాన్ని ప్రారంబించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ :

తమిళనాడు రాష్ట్రం అంతటా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడానికి “నమ్మ స్కూల్” అనే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, ఇప్పుడు వివిధ కంపెనీలలో ఉన్నత పదవుల్లో ఉన్న పూర్వ విద్యార్థులు, వ్యాపారవేత్తలు మరియు సామాజిక సంబంధిత సంస్థలు (NGOలు) పూర్వ విద్యార్థులు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు, మౌలిక సదుపాయాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటారు. పాఠశాలలు, ప్రహరీగోడ, పెయింటింగ్, ఇంటర్నెట్ సౌకర్యాలు, శానిటరీ టాయిలెట్లు ప్రయోగశాలలు, లైబ్రరీలు మొదలైన ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రథకం, ప్రారంభించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : నమ్మ స్కూల్ అనే ఒక నూతన పథకాన్ని ప్రారంబించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్
ఎవరు : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్
ఎక్కడ: తమిళనాడు రాష్ట్ర౦
ఎప్పుడు : డిసెంబర్ 20
WTO 13వ ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న యు.ఎ.ఈ :

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఫిబ్రవరి 2024లో 13వ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) మంత్రివర్గ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. WTO యొక్క 12వ మంత్రివర్గ సమావేశం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జూన్ 12 నుండి జూన్ 17 వరకు జరిగింది. వాస్తవానికి దీనిని 2020లో కజకిస్తాన్ లో నిర్వహించాలని భావించారు, అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా భావించారు. అయితే కోవిద్ మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ 1 జనవరి 1995న సుంకం మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (GATI) స్థానంలో స్థాపించబడింది. ప్రపంచంలోని నియమ ఆధారిత వ్యాపార వ్యవస్థలను ప్రోత్సహించడం మరియు సభ్య దేశాల మధ్య వాణిజ సంబంధిన వివాదాలను పరిష్కరించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
క్విక్ రివ్యు :
ఏమిటి : WTO 13వ ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న యు.ఎ.ఈ
ఎవరు : యు.ఎ.ఈ
ఎప్పుడు : డిసెంబర్ 20
అత్యంత ప్రతిభా వంతులైన 50 మంది గొప్ప నటుల జాబితాలో భారత్ చోటుదక్కించుకున్న షారుఖ్ ఖాన్ :

అత్యంత ప్రతిభా వంతులైన 50 మంది గొప్ప నటుల జాబితాలో భారత్ నుంచి షారుక్ ఖాన్ ఒక్కడికే చోటు చెందిన దక్కింది. బ్రిటన్ కు ప్రసిద్ధ ‘ఎంపైర్ మ్యాగజైన్ ఈ జాబితాను వెలువరించింది. ప్రముఖ హాలీవుడ్ నటులు వెంజర్ వాషింగ్టన్, టామ్ హ్యాండ్, ఆటోని మార్గన్ బ్రాంట్ వంటి దిగజాల సరసన నిలిచాడు. అతడు నటులు రెంజల్ వాషింగ్టన్, టామ్ హ్యాంక్స్, ఆంటోని మార్గన్ బ్రాండో వంటి దిగ్గజాల సరసన షారుక్ ఖాన్ నిలిచాడు. అతడి నాలుగు దశాబ్దాలు విజయ పరంపరను, లక్షలాది అభిమాన గణాన్ని ఉదహరిస్తూ, బాలీవుడ్ బాదాను కీర్తించింది. జీవితం రోజ మన ఊపిరిని కొద్ది కొద్దిగా హరిస్తుంది అనే బాంబు అయితే ఒక సారి ప్రాణం తీస్తుంది’ అనే డైలాగ్ అతడి కెరీర్లోనే ఉత్తమమైనవని అభిప్రాయపడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అత్యంత ప్రతిభా వంతులైన 50 మంది గొప్ప నటుల జాబితాలో భారత్ చోటుదక్కించుకున్న షారుఖ్ ఖాన్
ఎవరు : షారుఖ్ ఖాన్
ఎప్పుడు : డిసెంబర్ 20
మద్రాసు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ గా ఏఆర్ఎల్ సుందరేశన్ నియామకం :

మద్రాసు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్ఓ)గా సీనియర్ న్యాయవాది ఏఆర్ఎల్ సుందరేశన్ నియమితులయ్యారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకారం, క్యాబినెట్ నియామకాల కమిటీ నియామకానికి ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : మద్రాసు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ గా ఏఆర్ఎల్ సుందరేశన్నియామకం
ఎవరు : ఏఆర్ఎల్ సుందరేశన్
ఎప్పుడు : డిసెంబర్ 20
ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో భారత్ నుంచి మూడు చారిత్రక ప్రదేశాలకు చోటు :

భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టేటివ్) జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ ఐ) డిసెంబర్ 20న ప్రకటించింది. గుజరాత్ కు చెందిన అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే మొదేరా సూర్య దేవాలయం, చారిత్రక నగరం వడ్నగర్, ఈశాన్య రాష్ట్రాల అనేకోర్బాటీగా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది. ఇందులో వడ్స్ నగర్: ప్రధాని మోదీ స్వస్థలం. ఈ మూడు ప్రదేశాల చిత్రాలను కేంద్ర పర్యటకశాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి ట్వీట్ చేస్తూ అభినందనలు తెలిపారు. వారసత్వ కట్ట కాల తాత్కాలిక జాబితాకు ఈ మూడు స్థలాలను ప్రతి పాదిస్తూ భారత ప్రభుత్వం పదిహేను రోజుల క్రితం నామినేషన్లు పంపించగా వాటిని యునెస్కో ఆమోదంచింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం ఆరు చారిత్రక ప్రదేశాలు భారత్ నుంచి వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో భారత్ నుంచి మూడు చారిత్రక ప్రదేశాలకు చోటు
ఎక్కడ:భారత్
ఎప్పుడు : డిసెంబర్ 20
పెట ఇండియా 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ అందుకున్న సోనాక్షి సిన్హా :

బాలివుడ్ నటి సోనాక్షి సిన్హా గారు ఇటీవల పేట ఇండియా 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ను అందుకుంది.సోనాక్షి సిన్హా యొక్క తీసుకున్న చర్యలు ఫ్యాషన్ కోసం చంపబడిన అనేక జంతువులను రక్షించడం లో సహాయ పడింది. ఈ సంవత్సరం, సోనాక్షి సిన్హా జంతు తోలు వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్న తర్వాత PETA పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపికైంది. నటి సోనాక్షి సిన్హా ఇటీవల ‘డబుల్ ఎక్స్ఎల్’ చిత్రంలో కనిపించింది మరియు OTT సిరీస్ ‘దహాద్’లో కనిపించనుంది, PETA యొక్క 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : పెట ఇండియా 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ అందుకున్న సోనాక్షి సిన్హా
ఎవరు : సోనాక్షి సిన్హా:
ఎప్పుడు : డిసెంబర్ 20
Daily current affairs in Telugu Pdf November - 202 |
---|
Daily current affairs in Telugu 01-11-2022 |
>Daily current affairs in Telugu 02-11-2022 |
Daily current affairs in Telugu 03-11-2022 |
Daily current affairs in Telugu 04-11-2022</strong> |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 06-11-2022</strong> |
Daily current affairs in Telugu 07-11-2022 |
Daily current affairs in Telugu 08-11-2022 |
>Daily current affairs in Telugu 09-11-2022 |
Daily current affairs in Telugu 10-11-2022 |
Daily current affairs in Telugu 11-11-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |