
Daily Current Affairs in Telugu 19&20 November – 2022
ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకం గెలిచిన మానికా బాత్రా :

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా చరిత్ర సృష్టించింది. ఆసియాకప్లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్యాడర్ గా నిలిచింది. నవంబర్ 20న కాంస్య పతక పోరులో ప్రపంచ ర్యాంకర్ మనిక 11-6, 6-11, 11-7, 12-10, -11, 11-2 ర్యాంకర్ హినా హయాట (జపాన్)కు షాకిచ్చింది. నాలుగో గేమ్ 6-10తో వెనుకబడ్డ స్థితిలో గొప్పగా పుంజుకున్న మనిక వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్ ను గెలుచుకుంది. ఆ తర్వాత రెండు గేముల్లో ఒక గేమ్ ను సొంతం చేసుకుని మ్యాచ్ నెగ్గింది. ఈ మ్యాచ్ కు ముందు సెమీస్ లో మనిక 8-11, 11-7, 7-11. 6-11, 11-8, 7-11తో మిమా ఇటో (జపాన్) చేతిలో ఓడింది
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకం గెలిచిన మానికా బాత్రా
ఎవరు : మానికా బాత్రా
ఎప్పుడు : నవంబర్ 19
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఐఏఎస్ ‘అధికారి అరుణ్ గోయల్ నియామకం :

కేంద్ర ఎన్నికల సంఘం కమిష నర్ 1985 బ్యాచ్ పంజాబ్ కేడర్ రిటైర్డ్ ఐఏఎస్ ‘అధికారి అరుణ్ గోయల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఓ ప్రక టనలో తెలిపింది. ముగ్గురు సభ్యులు ఉండాల్సిన ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండేలు మాత్రమే ఉన్నారు. అరుణ్ గోయల్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. ముఖ్యంగా ఆర్ధిక, విద్యుత్తు, వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఎక్కువగా పనిచేశారు. 2003- 01 మధ్య ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిగా, 2006 నుంచి 2010 వరకూ కేంద్ర ఆర్థికశాఖలోని ఆర్దిక నిఘా విభాగం అధిపతిగా పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఐఏఎస్ ‘అధికారి అరుణ్ గోయల్ నియామకం
ఎవరు : అరుణ్ గోయల్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : నవంబర్ 19
ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అప్ ఇయర్ 2022 పురస్కారానికి ఎంపికైన చిరంజీవి ;

గోవాలో జరుగుతున్న 50వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ప్రముఖ కథానాయకుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అప్ ఇయర్ 2022 పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది నాలుగు దశాబ్దాలుగా నటుడిగా 150కిపైగా సినిమాలు చేసి ప్రజాదరణ పొందారని, ఆయనది విశిష్టమైన కెరీర్ అని చిరుజీవిని అభినందిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ రామార్ గారు ట్వీట్ చేశారు. గతంలో ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్, హేమమాలిని కి రజనీకాంత్, ఇళయరాజా వంటి ”హేమాహేమీలు అందుకున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అప్ ఇయర్ 2022 పురస్కారానికి ఎంపికైన చిరంజీవి
ఎవరు : చిరంజీవి
ఎక్కడ: గోవాలో
ఎప్పుడు : నవంబర్ 19
జాతీయ భూ భౌతిక పరిశో ధన సంస్థ(ఎన్జీఆర్) డైరెక్టర్ గా డాక్టర్ ప్రకాశ్ కుమార్ గారు నియమకం :

జాతీయ భూ భౌతిక పరిశో ధన సంస్థ(ఎన్జీఆర్) డైరెక్టర్ గా డాక్టర్ ప్రకాశ్ కుమార్ గారు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పనిచేసిన వి.ఎం.తివారీ గారి పదవీకాలం ఆరేళ్ల గడువుతో పాటు పొడిగించిన మూడునెలల అదనపు గడువు కూడా ముగియడంతో ఆ స్థానంలో నూతన డైరెక్టర్ ను నియమించారు చీప్ సైంటిస్ట్ అయిన డాక్టర్ ప్రకాశ్ కుమార్ భూకంపాలపై పలు కీలక పరిశోధనలు చేశాడు. ధన్ బాద్ లోని ఐఐటీ-ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ నుంచి అప్లైడ్ జియోఫిజిక్స్ చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ లో పీహెచ్.వో చేశారు. శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలకు ఆయన యువ శాస్త్రవేత్త, జాతీయ జియోసైన్స్ అవార్డుతో సహా పలుపురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ భూ భౌతిక పరిశో ధన సంస్థ(ఎన్జీఆర్) డైరెక్టర్ గా డాక్టర్ ప్రకాశ్ కుమార్ గారు నియమకం
ఎవరు : డాక్టర్ ప్రకాశ్ కుమార్
ఎప్పుడు : నవంబర్ 19
భారత్ మరియు యుకె కలిసి ‘యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్’ని ప్రారంభం ;

భారతదేశం మరియు యుకె కొత్త పరస్పర వీసా ఏర్పాటును ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి, దీని ద్వారా 18 మరియు 30 సంవత్సరాల మధ్య వయస్సు గల 3,000 మంది భారతీయ పౌరులు రెండు సంవత్సరాల వరకు జీవించడానికి మరియు పని చేయడానికి ప్రతి సంవత్సరం బ్రిటన్‌కు రావడానికి అనుమతించబడతారు.UK-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ పరస్పరం మరియు 2023 ప్రారంభంలో తెరవబడుతుంది. బాలిలో జరిగే G20 సమ్మిట్ అంచున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు అతని బ్రిటిష్ కౌంటర్ రిషి సునక్ మధ్య జరిగే మొదటి ద్వైపాక్షిక సమావేశంలో ఇది ప్రారంభించబడుతుంది. కాగా ఇలాంటి పథకం ద్వారా లబ్ది పొందిన మొదటి దేశం భారత్.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ మరియు యుకె కలిసి ‘యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్’ని ప్రారంభం
ఎవరు : భారత్ మరియు యుకె
ఎప్పుడు : నవంబర్ 20
2022లో నార్త్ ఈస్ట్ ఒలింపిక్ క్రీడల 2వ ఎడిషన్ ను నిర్వహించిన మేఘాలయ రాష్ట్రం :

2022లో నార్త్ ఈస్ట్ ఒలింపిక్ క్రీడల 2వ ఎడిషన్ మేఘాలయ రాష్ట్ర రాజధాని ఐన షిల్లాంగ్‌లో నిర్వహించబడింది. కాగా ఈ క్రీడలలో మణిపూర్ మొత్తం 240 పతకాలతో ఓవరాల్ టీమ్ ఛాంపియన్‌గా అవతరించింది. మొత్తం 203 పతకాలతో అస్సాం రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానంలో నిలిచింది. వారం రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో, ఈశాన్య రాష్ట్రాల నుండి దాదాపు 3000 మంది పాల్గొన్నారు. మొత్తం 18 విభాగాల్లో పోటీ పడ్డారు. కాగా ఈశాన్య ఒలింపిక్ క్రీడల తదుపరి ఎడిషన్‌కు నాగాలాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2022లో నార్త్ ఈస్ట్ ఒలింపిక్ క్రీడల 2వ ఎడిషన్ ను నిర్వహించిన మేఘాలయ రాష్ట్రం
ఎవరు : మేఘాల య రాష్ట్రం
ఎప్పుడు : నవంబర్ 20
నాల్గవ దశ డిజిటల్ శక్తి ప్రచారాన్ని ప్రారంభించిన జాతీయ మహిళా కమిషన్ :

జాతీయ మహిళా కమిషన్ (NCW) నాల్గవ దశ డిజిటల్ శక్తి ప్రచారాన్ని ప్రారంభించింది, ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా అనుచితమైన ఆన్‌లైన్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మహిళలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయబడింది. ఇది సైబర్‌స్పేస్‌లో మహిళలకు డిజిటల్‌గా సాధికారత మరియు నైపుణ్యం కల్పించడంపై పాన్-ఇండియా ప్రాజెక్ట్. సైబర్‌పీస్ ఫౌండేషన్ వారు మరియు మెటా వారి సహకారంతో 2018లో డిజిటల్ శక్తి అనే ప్రచారం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం యొక్క మూడవ దశ మార్చి 2021లో ప్రారంభమైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : నాల్గవ దశ డిజిటల్ శక్తి ప్రచారాన్ని ప్రారంభించిన జాతీయ మహిళా కమిషన్
ఎప్పుడు : నవంబర్ 20
అమర్ సర్కార్’ అనే నూతన పోర్టల్‌ను ప్రారంభించిన త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా :

త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు ఇటీవల ‘అమర్ సర్కార్’ అనే నూతన పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ అనేది ప్రజలు తమ యొక్క సమస్యలు, ఫిర్యాదులను గ్రామ కమిటీ అధికారుల ద్వారా నమోదు చేసుకునేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమర్ సర్కార్’ అనే నూతన పోర్టల్‌ను ప్రారంభించిన త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా
ఎవరు : రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా
ఎక్కడ: త్రిపుర
ఎప్పుడు : నవంబర్ 20
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |