Daily Current Affairs in Telugu 19 July -2022
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ లో కాంస్యం గెలుచుకున్న షూటర్లు అనిష్ భన్వాలా, రిథమ్ సాంగ్వాన్ :

ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ 25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో టీనేజ్ షూటర్లు అనిష్ భన్వాలా, రిథమ్ సాంగ్వాన్ కాంస్యం గెలుచుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో ఈ జంట 16-12తో చెక్ రిపబ్లిక్ కు చెందిన అనా దెదోవా, మార్టిన్ పొద్రాస్కీ జోడీపై విజయం సాధించింది. మార్చిలో కైరోలో జరిగిన ప్రపంచకప్ ఇదే విభాగంలో అనిష్, రిథమ్ జోడీ స్వర్ణం గెలుచుకుంది. మరో వైపు రెండు భారత జోడీలు సోమవారం కొద్దిలో పతకం కోల్పో యాయి. 50మీ రైఫిల్ 3 పొజిషన్లో సంజీవ్ రాజ్పుట్-ఆంజుమ్ మౌద్గిల్ జంట అయిదో స్థానంలో నిలవగా.. ఐశ్వరి తోమర్-ఆశి సొస్కీ ద్వయం ఆరో స్థానంతో సంతృప్తి చెందింది. ప్రస్తుత ప్రపం చకప్ లో భారత్ ఇప్పటివరకు 5 స్వర్ణాలు సహా 14 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ లో కాంస్యం గెలుచుకున్న షూటర్లు అనిష్ భన్వాలా, రిథమ్ సాంగ్వాన్
ఎవరు: అనిష్ భన్వాలా, రిథమ్ సాంగ్వాన్
ఎప్పుడు : జులై 19
జాతీయ జూనియర్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ లో జాతీయ రికార్డు నమోదు నమోదు చేసిన వ్రితి అగర్వాల్ :

జాతీయ జూనియర్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ జాతీయ రికార్డు నమోదు చేసింది. జులై 19న జరిగిన బాలికల 800 మీటర్ల ఫ్రీస్టైల్ రేసును 9 నిమి షాల 10.32 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 2014 నుంచి ఆకాంక్ష వోరా పేరిట ఉన్న రికార్డు’ (9ని 1404 సె)ను ఆమె బద్దలు కొట్టింది. సుహాస్ “ప్రేతమ్, సాగి నిత్య స్వర్ణ పతకాలతో సత్తాచాటారు. బాలుర 200 మీటర్ల బ్యాక్లోస్ట్రోక్లో సుహాస్ (25 1501న) అగ్రస్థానం సాదించాడు. బాలికల 200 మీటర్ల బ్యాక్లోస్టోక్లో నిత్య (2ని 27:583) స్వర్ణం కైవసం చేసుకుంది. ‘బాలికల 1500 మీటర్ల ఫ్రీస్టైల్లో సహస్ర కాంస్యం సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ జూనియర్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ లో జాతీయ రికార్డు నమోదు నమోదు చేసిన వ్రితి అగర్వాల్
ఎవరు: వ్రితి అగర్వాల్
ఎప్పుడు : జులై 19
వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటింపు :

వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. “2006 డిసెంబరు 7న తొలి సారి వెస్టిండీస్ జట్టు దుస్తులు ధరించా. 16 ఏళ్లు ఆడతానని ఊహించలేదు. కానీ ఆటపై నాకున్న ప్రేమ, మోజు నన్ను ప్రతిరోజూ ఉత్తేజపరిచాయి.అన్ని ఫార్మాట్లలో 144 మ్యాచ్లు ఆడి 3,763 పరుగులు చేసిన నేను నా అంతర్జాతీయ కెరీర్ను ముగిస్తున్నా” అని సిమన్స్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. సిమన్స్ విండీస్ తరఫున ఎనిమిది టెస్టులు, 68 వన్డేలు: 68 టీ20 మ్యాచ్లు ‘ఆడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: లెండిల్ సిమన్స్
ఎప్పుడు : జులై 19
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల ట్రిపుల్ జంప్ లో టైటిల్ గెలుచుకున్న యులిమర్ రాజాస్ :

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల ట్రిపుల్గాంప్లో వెనిజులా స్టార్ యులిమర్ రాజాస్ హ్యాట్రిక్ కొట్టింది. ఆమె వరుసగా మూడో ప్రపంచ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో రొజాస్. 15.47 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచింది. రికెట్స్: (14.89 మీ. జమైకా) రజతం, టోరీ ప్రాంక్లిన్ (14.72 మీ. అమెరికా) కాంస్యం నెగ్గారు. 2017, 2019 ప్రపంచ అథ్లెటి ఛాంపియన్షిప్ లోనూ రొజాస్ స్వర్ణం గెలిచింది. మహిళల మారథాన్లో ఇదియోపియా రన్నర్ గొటెటామ్ విజేతగా నిలిచింది ఆమె 2 గంటల 18 నిమిషాల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి స్వర్ణం దక్కించుకుంది. ఈ క్రమంలో బ్రిటన్ మాజీ తార పొలారాడ్ క్లిప్ (2 గంటల 20 నిమిషాల 57 సెకన్లు 2009లో) పేరిట ఉన్న చాంపియన్షిప్ రికార్డును బద్దలు కొట్టింది. జుడిత్ కారిర్ (2 గంటల 18 నిమిషాల 20 సెకన్లు, కెన్యా) రజతం, సాల్: పీటర్ (2 గంటల 20 నిమిషాల 18 సెకన్లు, ఇజ్రాయిల్) కాంస్యం సొంతం చేసుకున్నారు. మహిళల’ 1500 మీటర్ల టైటిల్ను ఫెయిత్ కెప్టెన్ (కెన్యా) సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 3 నిమిషాల 5200 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది గదాప్ (3 నిమిషాల 5152 ఇథియోపియా) రజతం, లౌరా మిక్ (3 నిమిషాల 55:28 బ్రిటన్ కాంస్యం గెలుచుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల ట్రిపుల్ జంప్ లో టైటిల్ గెలుచుకున్న యులిమర్ రాజాస్
ఎవరు: యులిమర్ రాజాస్
ఎప్పుడు : జులై 19
డా సినారె పురస్కారానికి ఎంపికైన ఒడియా రచయిత్రి డా. ప్రతిభారాయ్ :

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, మహాకవి డా.సి. నారాయణ రెడ్డి గారి పేరిట సుశీల నారా యణరెడ్డి ట్రస్టు నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ ఏడాదికి గాను ఒడియా రచయిత్రి, జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డా. ప్రతిభారాయ్ కు అందజే యనున్నారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంట లకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే డా.సి. నారాయణరెడ్డి జయంతి ఉత్సవంలో ఆమెకు పురస్కారం ప్రదానం చేస్తారని ట్రస్టు ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డా సినారె పురస్కారానికి ఎంపికైన ఒడియా రచయిత్రి డా. ప్రతిభారాయ్
ఎవరు: డా. ప్రతిభారాయ్
ఎప్పుడు : జులై 19
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీన్ కమిషన్ ఛైర్మన్ గా మనోజ్ కుమార్ నియామకం :

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీన్ కమిషన్ (KVIC)లో మార్కెటింగ్ లో మాజీ నిపుణుడు మనోజ్ కుమార్, భారత ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడానికి పదోన్నతి పొందినట్లు సంస్థ యొక్క అధికారిక ప్రకటన తెలిపింది. కెవిఐసి మాజీ ఛైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కెవిఐసి మాజీ ఛైర్మన్ వినయ్ కుమార్ సక్సెనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీన్ కమిషన్ ఛైర్మన్ గా మనోజ్ కుమార్ నియామకం
ఎవరు: మనోజ్ కుమార్
ఎప్పుడు : జులై 19
ఫోర్బ్స్ రియల్ టైమ్ ర్యాంకింగ్ ప్రపంచంలోనే నాలుగో స్థాన౦ గౌతమ్ అదానీ :

ఫోర్బ్స్ రియల్ టైమ్ ర్యాంకింగ్ లో భారత సంపన్నుడు గౌతమ్ అదానీ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం కుటుంబీకులతో సహా ఆయన మొత్తం సంపద కాపు 114 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. ఐదో స్థానానికి చేరిన బిల్ గేట్స్ సంపద102 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ప్రపంచ కుబేరులో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 230 బి. డాలర్లతో ఇక ప్రపంచ కుబేరుల్లో తొలిస్థానంలో కొనసాగుతున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండోస్థానంలో ఉండగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు. 114 బి. డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి చేరుకోగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాత్రం పదోస్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అంబానీ సంపద విలువ 88 బి. డాలర్లుగాఉన్నట్టు పోర్భ్స్ అంచనా వేసింది. మరోవైపు ఆసియాలో సంస్థను ఉన్నట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. మరోవైపు ఆసియాలో సంపన్నుడిగా కొనసాగిన ముకేశ్ అంబానీ స్థానాన్ని గౌతమ్ అదానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆక్రమించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏడాదిలోనే రికార్డు స్థాయిలో సంపద వృద్ధి చేసుకున్న వ్యక్తిగానూ గౌతమ్ అదానీ రికార్డు సృష్టించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫోర్బ్స్ రియల్ టైమ్ ర్యాంకింగ్ ప్రపంచంలోనే నాలుగో స్థాన౦ గౌతమ్ అదానీ
ఎవరు: గౌతమ్ అదానీ
ఎప్పుడు : జులై 19
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |