
Daily Current Affairs in Telugu 19-01-2020
సంగీత విద్వాంసురాలు సునంద పట్నాయక్ కన్నుమూత:

ఓడిశాకు చెందిన ప్రముఖ శాస్త్రీయ సంగెత విద్వాంసురాలు సునంద పట్నాయక్ (85) జనవరి 19 కన్నుమూశారు.వృద్దాప్యం వల్ల వచ్చ్సు రుగ్మతలతో బాదపడుతూ కోల్ కతా లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె మృతి చెందారు.కవి బైకుంట నాథ్ పట్నాయక్ కుమార్తే అయిన సునంద పట్నాయక్ పలు జాతీయ అవార్డులతో పాటు ఓడిశా సంగీత అకాడమి నుంచి సత్కారాలు పొందారు.ఆమె పై నిర్మినించిన లఘు చిత్రం నీల మాధవ్ 2010లో జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ లఘు చిత్రం గా అవార్డు సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సంగీత విద్వాంసురాలు సునంద పట్నాయక్ కన్నుమూత:
ఎక్కడ: భువనేశ్వర్
ఎవరు: సునంద పట్నాయక్
ఎప్పుడు: జనవరి 19
కృష్ణ నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ గా చంద్రశేఖర్ నియమకం:

కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ గా బాద్యతల ను గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్ జై.చంద్ర శేఖర్ అయ్యర్ చేపట్టారు.కేఆర్ ఎంబీ చైర్మన్ గా పని చేసిన ఆర్ కే గుప్తా కేంద్ర జల సంబ్యుడిగా బాద్యతలు తీసుకోవడంతో ఆ స్తానం ఖాళి ఏర్పడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కృష్ణ నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ గా చంద్రశేఖర్ నియమకం
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు: చంద్రశేఖర్
ఎప్పుడు:జనవరి 19
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
కె 4 క్షిపణి ప్రయోగం విజయవంతం:

జలాంతర్గాముల నుంచి ప్రయోగించే కె4 బాలిస్టిక్ క్షిపణి డి.ఆర్.డి.ఓ అధిలారులు జనవరి 19న విశాఖ తీరంలో సుదూర ప్రాంతం నుంచి విజయవవంతంగా ప్రయోగించారు.సముద్రంలో ఉండే జలాంతర్గామి నుంచి కె4 బాలిస్టిక్ క్షిపణి ని ప్రయోగించగా అది 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని విజయవంతం గా ద్వంసం చేసింది.ఈ క్షిపనుల ను డి.ఆర్.డి.ఓ పరిధిలో డి.ఆర్.డి.ఎల్ శాస్త్రవేత్తలు అబివృద్ది చేశారు.2500కేజీల బరువున్న అణ్వాయుదాలను కె4 క్షిపణి నుంచి ప్రయోగించవచ్చు.గత సంవత్సరం నవంబర్ 8న క్షిపణి ప్రయోగం చేయాలన్ని శాస్త్ర వేత్తలు భావించిన వాతావరణం అనుకూలించక ప్రయోగాన్ని వాయిదా వేశారు .
క్విక్ రివ్యూ:
ఏమిటి: కె 4 క్షిపణి ప్రయోగం విజయవంతం
ఎక్కడ: విశాఖ పట్నం
ఎప్పుడు:జనవరి 19
ఖేల్ ఇండియా క్రీడల్లో రజతం సాధించిన వెయిట్ లిఫ్టర్ గణేష్ :

ఖేల్ ఇండియా క్రీడల్లో మూడో సీజన్లో తెలంగాణా వియిట్ లిఫ్టర్ గణేష్ కు రజతంతో మేరిశారు.తెలంగాణా క్రీడా పాటశాల కు చెందిన అతను జనవరి 19న అండర్ -17 బాలుర 73 కేజీల విభాగంలో మొత్తం 245 కిలోల బరువులెత్తి రెండో స్థానంలో నిలిచాడు. కిరణ్ (25కేజీల –మహారాష్ట్ర ) పసిడి సొంతం చేసుకున్నాడు .బాలికల 64 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ షేక్ మహమ్మద్ చాంద్ కాంస్యం నెగ్గింది.అండర్ -17 ఖోఖో లో తెలంగాణా బాలుర జట్టు కాంస్యం కైవసం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఖేల్ ఇండియా క్రీడల్లో రజతం సాధించిన వెయిట్ లిఫ్టర్ గణేష్
ఎక్కడ: గుహవతి
ఎవరు: గణేష్
ఎప్పుడు:జనవరీ 19
సత్య సాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ గా రత్నాకర్:

సత్య సాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ గా ఆర్.జే రత్నాకర్ ను నియమించారు.జనవరి 17 న ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు బోర్డు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సబ్యులు రత్నాకర్ ను మేనేజింగ్ ట్రస్టీ గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ట్రస్టు లో 9మంది సబ్యులుండగా ఆయనకు మేనేజింగ్ ట్రస్టీ బాద్యతలు అప్పగించారు.2010 మార్చి 16న సత్యసాయి బాబా స్వయంగా ట్రస్టు సబ్యుడిగా నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సత్య సాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ గా రత్నాకర్
ఎక్కడ: పుట్టపర్తి
ఎవరు: ఆర్.జే రత్నాకర్
ఎప్పుడు: జనవరి 19