
Daily Current Affairs in Telugu 18&19 September -2022
నంజరాయన్ ట్యాంక్‌ను పక్షుల అభయారణ్యంగా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం :

తమిళనాడు రాష్ట్రము లోని నంజరాయన్ ట్యాంక్‌ను పక్షుల అభయారణ్యంగా ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2022లో తిరుప్పూర్ జిల్లాలోని నంజరాయన్ ట్యాంక్ వద్ద పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తిరుప్పూర్ జిల్లాలో దాదాపు 126 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నంజరాయన్ ట్యాంక్ తమిళనాడులో 17వ పక్షి సంరక్షణ కేంద్రం కానుంది. 2021 డిసెంబరులో, రాష్ట్ర ప్రభుత్వం విల్లుపురం సమీపంలో ఉన్న కాజువేలి చిత్తడి నేలను “కజువేలి పక్షుల అభయారణ్యంగా ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : నంజరాయన్ ట్యాంక్‌ను పక్షుల అభయారణ్యంగా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
ఎక్కడ : తమిళనాడు రాష్ట్రం
ఎప్పుడు :సెప్టెంబర్ 18
గ్లోబల్ క్లీన్ ఎనర్జీ యాక్షన్ ఫోరమ్ కు అద్యక్షత వహించనున్న జితేంద్ర సింగ్ :

గ్లోబల్ క్లీన్ ఎనర్జీ యాక్షన్ ఫోరమ్ కోసం ప్రతినిధి బృందానికి జితేంద్ర సింగ్ నాయకత్వం వహిస్తారు. గ్లోబల్ క్లీన్ ఎనర్జీ యాక్షన్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు సంయుక్త మంత్రుల బృందానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారి నేతృత్వం వహిస్తారు. డాక్టర్ జితేందర్ సింగ్ 19 సెప్టెంబర్ 2022న అమెరికాకు బయలుదేరుతారు. అతను యు.ఎస్ లోని పెన్సిల్వేనియాలో 2022 సెప్టెంబర్ 21 నుండి 23 వరకు క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ (CEM13) మరియు మిషన్ ఇన్నోవేషన్ (MI-7) సంయుక్త సమావేశాలలో కూడా పాల్గొంటాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : గ్లోబల్ క్లీన్ ఎనర్జీ యాక్షన్ ఫోరమ్ కు అద్యక్షత వహించనున్న జితేంద్ర సింగ్
ఎవరు : జితేంద్ర సింగ్
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు :సెప్టెంబర్ 18
మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాద్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ సింగ్ :

మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శిగా విజయ్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు విజోయ్ కుమార్ సింగ్ సెప్టెంబర్ 19, 2022న రక్షణ మంత్రిత్వ శాఖ మాజీ సైనికుల సంక్షేమం కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అతను పంజాబ్ కేడర్‌కు చెందిన 1990-బ్యాచ్ IAS అధికారి, పరిపాలనలో 32 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్నవాడు. ఆయన ఇటీవల జౌళి మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు.ఈ నియామకానికి ముందు, అతను సిబ్బంది మరియు శిక్షణ విభాగంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.
క్విక్ రివ్యు :’
ఏమిటి : మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాద్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ సింగ్
ఎవరు : విజయ్ కుమార్ సింగ్
ఎక్కడ :డిల్లి
ఎప్పుడు :సెప్టెంబర్ 18
భారత మహిళల టెన్నిస్ సింగిల్స్ లో నంబర్ వన్ గా నిలిచిన అంకితా డైనా :

ఐదేళ్ల తర్వాత భారత మహిళల టెన్నిస్ సింగిల్స్ లో నంబర్ వన్ గా కొత్త క్రీడాకారిణి వచ్చింది. 2017 నుంచి భారత టాప్ ర్యాంకర్ గా కొనసాగుతున్న అంకితా డైనా ఇటీవల విడుదల చేసిన సింగిల్స్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయింది. చెన్నై ఓపెన్ లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన కర్మన్ కౌర్ భారత కొత్త నంబర్ వన్ గా అవతరించింది. కర్మన్ 37 స్థానాలు ఎగబాకి 322వ ర్యాంక్ కు చేరగా.. చెన్నై ఓపెన్ లో తొలి రౌండ్లోనే ఓడిన అంకిత నాలుగు స్థానాలు పడిపోయి 329వ ర్యాంక్లో నిలిచింది.
క్విక్ రివ్యు :’
ఏమిటి : భారత మహిళల టెన్నిస్ సింగిల్స్ లో నంబర్ వన్ గా నిలిచిన అంకితా డైనా
ఎవరు : అంకితా డైనా
ఎప్పుడు :సెప్టెంబర్ 19
ఈజిప్టులో రెండు రోజుల అధికారిక పర్యటించనున్న భారత రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ :

ఈజిప్టులో రెండు రోజుల పాటు అధికారిక పర్యటన నిమిత్తం రాజ్‌నాథ్ సింగ్ ఆ దేశ రాజధాని కైరో చేరుకున్నారు . రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈజిప్టులో రెండు రోజుల అధికారిక పర్యటన కోసం 18 సెప్టెంబర్ 2022న కైరో చేరుకున్నారు. రక్షణ మరియు రక్షణ ఉత్పత్తి మంత్రి జనరల్ మహ్మద్ జాకీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ మరియు ఈజిప్టు మధ్య మెరుగైన రక్షణ సహకారానికి మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి ఒక అవగాహన ఒప్పందం కూడా సంతకం కూడా చేయనున్నారు. ఇద్దరు మంత్రులు ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను సమీక్షిస్తారు
క్విక్ రివ్యు :’
ఏమిటి : ఈజిప్టులో రెండు రోజుల అధికారిక పర్యటించనున్న భారత రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్
ఎవరు : రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్
ఎక్కడ : ఈజిప్టు
ఎప్పుడు :సెప్టెంబర్ 19
భూముల రీ-సర్వేపై రైతుల్లో అవగాహన కల్పిం చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నల్సార్ యునివర్సిటీ :

భూముల రీ-సర్వేపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు, పరిశోధనల నిర్వహణకు హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం, రాష్ట్ర సర్వే శాఖల మధ్య సెప్టెంబర్ 18న ఒప్పందం జరిగింది. హైదరాబాదులో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకుల పతి ఆచార్య బాలకిష్టారెడ్డి, సర్వే శాఖ శిక్షణ సంస్థ వైస్ ప్రిన్సిపల్ కుమార్ అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్సార్ విశ్వవిద్యాలయం ఆచార్యులు, భూరంగ నిపుణులు సునీల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థడైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్ రీ-సర్వే నిర్వహణలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాన్ని బాగస్వామ్యం చేయాలని ఆదే శించిన మేరకు చర్యలు తీసుకున్నాం. రైతులకు రీ-సర్వేపై అవగాహన. చట్టపర హక్కులపై స్పష్టత కల్పించడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో క్రియాశీలకంగా ఉంటాయి. ఈ ఒప్పందం ద్వారా రీ-సర్వేలో పాల్గొనే బాగస్వాములకు విశ్వవిద్యాలయం ద్వారా శిక్షణ అందుతుంది. రీ-సర్వే నిర్వహ ఇలో పార్టీలు పరస్పర అంగీకారం, ఇతర అంశాలపైన విశ్వవిద్యాలయం తనవంతు సహకారాన్ని అందిస్తుంది.
క్విక్ రివ్యు :’
ఏమిటి : భూముల రీ-సర్వేపై రైతుల్లో అవగాహన కల్పిం చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నల్సార్ యునివర్సిటీ
ఎవరు : నల్సార్ యునివర్సిటీ
ఎక్కడ : అమరావతి
ఎప్పుడు :సెప్టెంబర్ 19
నమీబియా నుంచి 8 చీతాలను దేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వం :

అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా భారత ప్రభుత్వం నమీబియా దేశం నుంచి 8 చీతాలను మనదేశానికి తీసుకొచ్చింది. వీటిని ప్రధాని నరేంద్రమోదీ గారు2022, సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్ లోని కునో పాల్పూర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో వదిలిపెట్టారు. వీటిలో రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. వీటిని 747 ఇండోజెట్లో నమీబియా రాజధాని విందాద్ నుంచి జైపూర్ అక్కడి నుంచి కునో నేషనల్ పార్క్ లో తరలించారు.భారత్ లో చివరిసారిగా 1948లో చీతా కనిపించింది. కేంద్రం వీటిని అంతరించిపోయిన వన్యప్రాణుల జాబి తాలో చేర్చింది. 2009లో అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి జైరాం రమేష్ ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకురావడానికి ఒక ప్రాజె క్టును ప్రారంభించారు. దీనికి 2020లో సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో చీతాలను తెచ్చేందుకు నమీబియా, దక్షి ణాఫ్రికాతో కేంద్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయిదేళ్లలో కేంద్రం ప్రణాలిక దశలో సమీబియా నుంచి తేవాలని నిర్ణంచింది.
క్విక్ రివ్యు :’
ఏమిటి : నమీబియా నుంచి 8 చీతాలను దేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వం
ఎవరు : భారత ప్రభుత్వం
ఎప్పుడు :సెప్టెంబర్ 18
ఆసియా క్రీడల పతక విజేత పూవమ్మపై రెందేల్లనిశేధం విధించిన ఏడిఎపి :

డోపింగ్ పరీక్షలో విఫలమైన ఆసియా క్రీడలలో పతక౦ సాధించిన పూవమ్మపై. యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానల్ (ఏడీఏపీ) రెండేళ్ల నిషేదం విధించింది. ఆమెను మూడు నెలలు మాత్రమే సస్పెండ్ చేయాలని క్రమశిక్షణ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టింది. నిరుడు ఫిబ్రవరిలో ఇండియన్ గ్రాండ్ ప్రి సందర్భంగా 32 ఏళ్ల పూనమ్మ వద్ద నుంచి నమూనాలు సేకరించారు. ఆమె వివర్ణ ఉత్ప్రేరకం వాడినట్లు పరీక్షల్లో తేలింది. 2018 ఆసియా క్రీడల్లో 1-10గ్రామ్ మహిళల మిక్స్డ్ డ్ రిలే గెలిచిన జట్లలో పూవమ్మ సభ్యురాలు 2012 ఆసియాక్రీడలలో 100మీ పరుగులో ఆమె వ్యక్తిగత కాలస్యం కూడా సాధించింది. పూవమ్మకు 2015 లో అర్జున అవార్డు లభించింది.
క్విక్ రివ్యు :’
ఏమిటి : ఆసియా క్రీడల పతక విజేత పూవమ్మపై రెందేల్లనిశేధం విధించిన ఏడిఎపి
ఎవరు : ఏడిఎపి
ఎప్పుడు :సెప్టెంబర్ 18
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |