
Daily Current Affairs in Telugu 18&19 June -2022
ప్రేగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలచిన గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ :

గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ మరో టైటిల్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రేగ్ మాస్టర్స్ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్ లో స్పెయిన్ గ్రాండ్మాస్టర్ డేవిడ్ ఆంటోన్ పై విజయం సాధించిన హరికృష్ణ మొత్తం 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి లీ క్వాంగ్ లీమ్ (వియత్నాం)తో కలిసి అతను 5.5 పాయింట్లతో సమానంగా ఉన్నాడు. కానీ చివరి రౌండ్ లో ఉత్తమ నెగ్గడంతో ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. మరో భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ (4) ఏడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. చాలెంజర్స్ విభాగంలో అన్ని రౌండ్లు ముగిసే సరికి నీమన్ (యుఎస్), విన్సెంట్ (జర్మనీ) చెరో 6.5 పాయింట్లతో సమానంగా నిలిచారు. దీంతో టైబ్రేక్ నిర్వహించగా అందులోనూ వాళ్లు సమంగా నిలిచారు చివరకు రెండు గేమ్ బ్లిట్జ్ మ్యాచ్ లో విన్సెట్ 2-0తో నెగ్గి ట్రోఫీ అందుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రేగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలచిన గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ
ఎవరు: పెంటేల హరికృష్ణ
ఎప్పుడు : జూన్ 18
ఇషా సింగ్ జావెలిన్ త్రోలో విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్న నీరజ్ చోప్రా :

ఒలింపిక్ చాంపియన్ అయిన నీరజ్ చోప్రా సూపర్ ఫాం ను కొనసాగిస్తున్నాడు. కోర్టానే గేమ్స్ జావెలిన్ త్రోలో అతడు స్వర్ణం గెలుచుకున్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో అతడు రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)ను ఓడించాడు. 24 ఏళ్ల నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలో 86.69 మీటర్లు విసిరాడు. అదే అత్యుత్తమ త్రో అయింది. వాల్కట్ (86.64మీ) రజతం, పీటర్స్ (81 75) కాంస్యం గెలుచుకున్నారు. నీరజ్ జూన్ – 89.30 మీటర్ల త్రోతో పావో నుర్కి క్రీడల్లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. అక్కడ పీటర్స్ 86, 60మీ త్రోతో కాంస్య పథకం సాధించాడు. నుర్మి క్రీడల్లో స్వర్ణం సాధించిన హెలాండర్ తాజా ఈవెంట్లో పోటీపడలేదు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇషా సింగ్ జావెలిన్ త్రోలో విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్న నీరజ్ చోప్రా
ఎవరు: నీరజ్ చోప్రా
ఎప్పుడు : జూన్ 18
జాతీయ స్థాయి షూటింగ్ చాంపియన్ షాప్ లో విజేతగా నిలిచిన తెలంగాణ వాసి ఇషా సింగ్ :

తెలంగాణ షూటింగ్ సంచలనం ఇషా సింగ్ పసిడి గురి కొనసాగు తోంది. తాజాగా ఆమె కుమార్ సురేంద్ర స్మారక జాతీయ స్థాయి షూటింగ్ చాంపియన్ షాప్ లో విజేతగా నిలిచింది. జూన్ 19 న 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా స్వర్ణం ఖాతాలో వేసుకుంది. మను బాకర్, రహి సర్నోబత్ లాంటి స్టార్ షూటర్లను వెనక్కినెట్టి ఆమె టైటిల్ నెగ్గడం విశేషం. అర్హత రౌండ్ లో 585 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిన ఇషా ఫైనల్లోనూ అదే దూకుడు. ప్రదర్శించింది. క్వాలిఫికేషన్లో లో మను బాకర్ (583). రహి (582) తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. తుదిపోరులో ఇషా 30 పాయింట్లు ఖాతాలో వేసుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. విభూతి (హరియాణ 23), చింకి యాదవ్ (మధ్యప్రదేశ్- 17) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ స్థాయి షూటింగ్ చాంపియన్ షాప్ లో విజేతగా నిలిచిన తెలంగాణ వాసి ఇషా సింగ్
ఎవరు: ఇషా సింగ్
ఎప్పుడు : జూన్ 18
సరికొత్త రికార్డు నమోదు చేసిన భారత స్టార్ జిమ్నాస్ట్ ప్రణతి :

దోహాలో 2022 జూన్ 18న జరిగిన ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్స్ వాల్ట్ విభాగంలో భారత స్టార్ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఓవరాల్ గా 13.367 స్కోరుతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ పోటీలో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారత జిమ్నాస్ట్ గా నిలిచింది. 2019లో మంగోలియాలోని ఉలాన్ బాటర్ లో జరిగిన ఆసియా చాంపియన్ షిప్ లో మొదటిసారిగా కాంస్యం నెగ్గింది. తాజాగా జరిగిన పోటీలో సియో జియాంగ్ (కొరియా– 14.084), షోకో మియాట (జపాన్– 13.884) వరు సగా స్వర్ణ, రజత పతకాలు గెలి చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సరికొత్త రికార్డు నమోదు చేసిన భారత స్టార్ జిమ్నాస్ట్ ప్రణతి
ఎవరు: జిమ్నాస్ట్ ప్రణతి
ఎప్పుడు : జూన్ 18
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమకం :

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో సీజేగా సేవలందిస్తున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ డిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17వ తేదీన పంపిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ తాజాగా ఆమోదముద్ర వేశారు. మొత్తం అయిదు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం, ఒక ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేస్తూ కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి యథాతధంగా ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ జూన్ 19న ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సీజేగా పదోన్నతి పొందారు. ఈయన 1964 ఆగస్టు 2న అస్సాం రాజధాని గువాహటిలో జన్మించారు. తండ్రి సురేంద్ర నాథ్ భూయాన్ ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ గా సేవలందించారు. జస్టిస్ ఉజ్జల్ భయాన్ ప్రాథమిక స్థాయి నుంచి ఎల్ఎల్ఎం. వరకు గువాహటిలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1991 వరకు గువాహటిలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1991 మార్చి 20న న్యాయవాదిగా పేరు నమోదు చేసు కొని అక్కడి హైకోర్ట్ వృత్తి జీవితం ప్రారంభించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమకం
ఎవరు: ఉజ్జల్ భూయాన్
ఎక్కడ ; తెలంగాణ రాష్ట్ర౦లో
ఎప్పుడు : జూన్ 18
ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన‘ని ప్రారంబించిన ప్రధాని నరేంద్ర మోడి :

ప్రసూతి మరియు శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై కేంద్ర ప్రభుత్వ౦ దృష్టి సారించి, ప్రధానమంత్రి మోదీ ‘ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన’ని ప్రారంభించారు. దీని వ్యయం 800 కోట్లు. ఈ పథకం కింద గర్భిణులు, బాలింతలకు ప్రతినెలా అంగన్వాడీ కేంద్రాల నుంచి 2 కిలోల శెనగలు, 1 కిలోల శెనగలు, 1 కిలోల ఎడిబుల్ ఆయిల్ ను ఉచితంగా అందజేయాలి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన’ని ప్రారంబించిన ప్రధాని నరేంద్ర మోడి
ఎవరు: ప్రధాని నరేంద్ర మోడి
ఎప్పుడు : జూన్ 18
సోమాలియాదేశ ప్రధానమంత్రిగా హమ్లా అబ్ది బర్రెను నియామకం

సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహముద్ జుబ్బాలాండ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ఛైర్మన్ హమ్లా అబ్ది బర్రెను ప్రధానమంత్రిగా నియమించారు. సెమీ అటానమస్ స్టేట్ జుబాలాండ్కు చెందిన 48 ఏళ్ల హంజా అబ్ది బర్రే ఎం ఒహమద్ హుస్సేన్ రోబుల్ స్థానంలో ఉన్నారు. బారే అనేక ప్రజా మరియు రాజకీయ పాత్రలలో పనిచేశారు మరియు 2011 నుండి 2017 వరకు పీస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ (PDP) సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు మరియు నెత్తుటి సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో సుదీర్ఘ ఆలస్యంగా జరిగిన ఎన్నికల తర్వాత, గతంలో 2012 నుండి 2017 వరకు పనిచేసిన మొహముద్ మేలో రెండవసారి అధ్యక్షుడిగా గ్గేలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సోమాలియాదేశ ప్రధానమంత్రిగా హమ్లా అబ్ది బర్రెను నియామకం
ఎవరు: హసన్ షేక్ మొహముద్
ఎప్పుడు : జూన్ 18
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తొలి మహిళా ఛైర్పర్సన్ గా రంజనా ప్రకాశ్ దేశాయ్ నియామకం :

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఛైర్పర్సన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్ గారు నియమితులయ్యారు. ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ ఈమె. రంజనాదేశాయ్ (72) నియామకంపై గెజెట్ నోటిఫికేషన్ ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ జూన్ 19న విడుదల చేసింది. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం మరియు పత్రికా ప్రమాణాలను నిర్వహించడం మరియు మెరుగుపరచడం అనే లక్ష్యంతో మొదటి స్ట్రెస్ట్ కమీషన్ సిఫార్సుల మేరకు 1966లో ప్రెస్ కౌన్సిల్ ఇండియాను మొదటిసారిగా పార్లమెంటు ఏర్పాటు చేసింది. ప్రస్తుత కౌన్సిల్ ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ 1978 ప్రకారం పనిచేస్తుంది.. ఇది నైతిక ఉల్లంఘనలకు మరియు పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించినందుకు వ్యతిరేకంగా మరియు పత్రికల ద్వారా వచ్చిన ఫిర్యాదులను వరుసగా తీర్పునిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తొలి మహిళా ఛైర్పర్సన్ గా రంజనా ప్రకాశ్ దేశాయ్ నియామకం
ఎవరు: రంజనా ప్రకాశ్ దేశాయ్
ఎప్పుడు : జూన్ 18
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |