Daily Current Affairs in Telugu 18 November – 2022
కుటుంబ నియంత్రణలో భారత్ కు దక్కిన ప్రతిష్టాత్మక ‘ఎక్సెల్ అవార్డ్ – 2022 :

కుటుంబ నియంత్రణలో అత్యాధునిక విదానాల వినియోగం, నాయకత్వానికి ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ఎక్సెల్ అవార్డ్ – 2022 భారత్ కు వరించింది. అత్యాధునిక, అత్యంత నాణ్యమైన కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరిస్తున్న దేశాల విభాగంలో ఒక్క భారత్ మాత్రమే ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. రాయ్లాండ్ లో జరుగుతున్న అంతర్జాతీయ కుటుంబ నియంత్రణ సదస్సు (ఐసిఎప్పి 2022) సమావేశంలో ఈ ఆవార్డును ప్రకటించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ నవంబర్ 18న ట్విటర్లో వెల్లడించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 2015-16లో 51% ఉన్న గర్భనిరోధక రేటు (ఇంట్రాసెప్టివ్ ప్రెవలెన్స్ రేట్) 2010-20 నాటికి 67 శాతానికి చేరింది.
- దేశంలో పునరుత్పత్తి సామర్థ్యమున్న 15-49 ఏళ్ల వయసు వివాహితుల్లో కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరించినవారు (డిమాండ్ సాటి స్పైడ్) 2015-16లో 66% ఉండగా, 2019-20 నాటికి అది 76 శాతానికి చేరుకొంది.సుస్తిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఈ రేటు 15 శాతానికి చేరుకోవాలని లక్ష్యం పెట్టు కోగా, ఇప్పటికే భారత్ దీన్ని అధిగమించడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి : కుటుంబ నియంత్రణలో భారత్ కు దక్కిన ప్రతిష్టాత్మక ‘ఎక్సెల్ అవార్డ్ – 2022
ఎవరు : ‘ఎక్సెల్ అవార్డ్ – 2022
ఎప్పుడు : నవంబర్ 18
తొలినాటి గెలాక్సీలను గుర్తించిన అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు :

ఇప్పటివరకూ, పరిశోధకుల కంటపడని తొలినాటి గెలాక్సీలను అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు గుర్తించింది. వీటిలో ఒకటి. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్ బ్యాంగ్ పరిణామం అనంతరం 35 కోట్ల ఏళ్ల తర్వాత ఏర్పడింది. అంతరిక్ష ప్రమాణాల్లో చెప్పాలంటే ఇది చాలా తొలినాటి గెలాక్సీ మునుపటి హబుల్ టెలిస్కోపునకు అది దొరకలేదు. ఇప్పటివరకూ కనుగొన్నవాటిలో ఇదే అత్యంత సుదూర నక్షత్ర మండలంగా నిలిచింది. హబుల్ గుర్తించిన సుదూర గెలాక్సీ, బిగ్ బ్యాంగ్ అనంతరం 15 కోట్ల ఏళ్ల తర్వాత ఏర్పడింది. జేమ్స్ వెజ్ టెలిస్కోపు నుంచి అందుతున్న డేటాను బట్టి గతంలో ఉహించినదాని కన్నా చాలా త్వరగానే తొలినాటి ప్రేక్షరాలు ఏర్పరాయని స్పష్టమవుతోంది.బిగ్ బ్యాంగ్ అనంతరం కొన్ని లక్షల సంవత్సరాలనే అవి పుట్టుకొచ్చి ఉంటాయని శాస్త్రవేత్తలు. విశ్లేషిస్తున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు అందించిన డేటాను విశ్లేషించిన హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : తొలినాటి గెలాక్సీలను గుర్తించిన అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు
ఎవరు : జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు
ఎప్పుడు : నవంబర్ 18
‘క్వీన్స్ కామన్వెల్త్ అవార్డ్ గెలుచుకున్న భారత్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక :

ప్రపంచ ప్రఖ్యాత ‘క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటిషన్ లో భారత్ కు చెందిన 13 ఏళ్ల కు చెందిన బాలిక సత్తా చాటింది. ఉత్తరాఖండ్ కు చెందిన మౌలికా పాండే. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన పద్మశ్రీ జాదవ్ మొలాయి పాయెంగ్ యదార్ధ జీవితగాధను తన రచనా కౌశలంతో కళ్లకు కట్టింది. ఈ ఏడాది నిర్వహించిన పోటీకి ‘ది. మొలాయి పారెస్ట్ శీర్షికతో కథ రాసి జూనియర్ విభాగంలో రన్నరప్ గా నిలిచింది. బకింగ్ హామ్ ప్యాలెస్ లో నవంబర్ 18న వైభవంగా జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాణి కెమిల్లా నుంచి మౌలిక పౌర పురస్కారాన్ని అందుకొంది. జూనియర్ సీనియర్ గాల్లో విజేతలుగా నిలిచినవారిలో భారత్ తో పాటు న్యూలాండ్ ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన 16-17 యువతి యువకులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘క్వీన్స్ కామన్వెల్త్ అవార్డ్ గెలుచుకున్న భారత్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక
ఎప్పుడు : నవంబర్ 18
నీతి ఆయోగ్‌లో పూర్తికాల సభ్యునిగా సీనియర్ ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ వీరమణిని నియమకం :

నీతి ఆయోగ్‌లో పూర్తికాల సభ్యునిగా సీనియర్ ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ వీరమణి గారిని ప్రభుత్వం నియమించింది. లాభాపేక్షలేని పబ్లిక్ పాలసీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక-ఛైర్మన్ అయిన వీరమణి, 2007-09 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. నీతి ఆయోగ్‌లో పూర్తికాల సభ్యునిగా వీరమణి నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారు. ఈ మేరకు నవంబర్ 15న కేబినెట్ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : నీతి ఆయోగ్‌లో పూర్తికాల సభ్యునిగా సీనియర్ ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ వీరమణిని నియమకం
ఎవరు : డాక్టర్ అరవింద్ వీరమణి
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : నవంబర్ 18
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సూరజ్ భాన్ నియామకం :

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సూరజ్ భాన్ గారిని నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ (NPS ట్రస్ట్) నియమించింది.నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద నిధుల నిర్వహణకు ట్రస్ట్ బాధ్యత వహిస్తుంది. 1983లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌లో చేరి చండీగఢ్‌లోని లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సూరజ్ భాన్ నియామకం
ఎవరు : సూరజ్ భాన్
ఎప్పుడు : నవంబర్ 18
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |