
Daily Current Affairs in Telugu 18 -04-2021
భారత స్టార్ వెయిట స్టర్ మీరాబాయి చాను ప్రపంచ రికార్డు:

భారత స్టార్ వెయిటస్టర్ మీరాబాయి చాను ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 49 కేజీల విభాగంలో క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కేజీలు ఎత్తి జియాంగ్ (చైనా, 118 కేజీలు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. స్నాచ్‌లో 86 కేజీలు లిఫ్ట్ చేసిన చాను మొత్తం మీద 205 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న ఓవరాల్ వెయిట్ జాతీయ రికార్డును బద్దలు కొట్టింది అంతేకాక కాంస్య పతకాన్ని కూడా గెలిచింది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్ లో మీరాబాయి 203 కేజీలు (88 కేజీలు స్నాచ్, 115 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే తప్పనిసరిగా పాల్గొనాల్సిన ఆరు క్వాలిఫయింగ్ ఈవెంట్లలో పోటీ పడిన మిరాభాయి చాను. టోక్యో ఒలింపిక్స్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. ఏడాది పైగా విరామం తర్వాత మీరాబాయి బరిలో దిగిన తొలి టోర్నీ ఇదే.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత స్టార్ వెయిట లిఫ్టర్ మీరాబాయి చాను ప్రపంచ రికార్డు
ఎవరు : మీరాబాయి చాను
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం సాదించిన భారత లిఫ్టర్ జిలీ దలా బెహరా :

ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో భారత లిఫ్టర్ జిలీ దలా బెహరా సత్తా చాటింది. ఏప్రిల్ 18న జరిగిన మహిళల 45 కేజీల విభాగం పోటీలో ఆమె పసిడి పతకం సొంతం చేసుకుంది. స్నాచ్‌లో 69 కేజీలు ఎత్తిన జిలీ.. క్లీన్ అండ్ జెర్క్‌లో 88 కేజీలు, మొత్తం మీద 157 కేజీలు లిఫ్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. అయితే 45 కేజీలు ఒలింపిక్ కేటగి రిలో లేకపోవడం నిరాశ కలిగించే అంశం. 2019 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన జిలలీ ఈసారి ఆ ప్రదర్శనను మెరుగుపరుచుకుంది. మరో భారత లిఫ్టర్ స్నేహ సోరెన్ (55 కేజీలు) కాంస్యం గెలి చింది. స్నాచ్‌లో 71 కేజీలు లిఫ్ట్ చేసిన స్నేహ.. క్లీన్ అండ్ జెర్క్ 93 కేజీలు.. మొత్తం మీద 164 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే టోక్యో ఒలిం పిక్స్ లో అర్హత సాధించిన మీరాబాయి చాను ‘(49 కేజీలు) క్లీన్ అండ్ జెర్క్లీ ప్రపంచ. రికార్డు సృష్టిస్తూ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం సాదించిన భారత లిఫ్టర్ జిలీ దలా బెహరా
ఎక్కడ: భారత లిఫ్టర్ జిలీ దలా బెహరా
ఎప్పుడు : ఏప్రిల్ 17
భారతదేశపు నేషనల్ స్టార్టప్ అడ్వెజరీ కౌన్సిల్ (ఎన్ఎస్ఐసి) అధ్యక్షత వహించిన పియూష్ గోయల్ :

దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌ల కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన చర్యలపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన నేషనల్ స్టార్టప్ అడ్వెజరీ కౌన్సిల్ (ఎన్ఎస్ఐసి) మొదటి సమావేశానికి కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పియూష్ గోయల్ ఏప్రిల్ 17న అధ్యక్షత వహించారు. ఈ కౌన్సిల్ భారతదేశంలో చాలా మంది వర్ధమాన ప్రారంభ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శక౦గా పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) సుస్థిర ఆర్థిక వృద్ధికి మరియు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు, కౌన్సిల్ అనేక మంది నాన్-అఫీషియల్ సభ్యులను కలిగి ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశపు నేషనల్ స్టార్టప్ అడ్వెజరీ కౌన్సిల్ (ఎన్ఎస్ఐసి) అధ్యక్షత వహించిన పియూష్ గోయల్
ఎవరు : కేంద్ర మంత్రి
ఎప్పుడు : ఏప్రిల్ 18
ప్రపంచ హెరిటేజ్ దినోత్సవం గా ఏప్రిల్ 18 :

ప్రపంచ వారసత్వ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18 న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. మన చుట్టూ మనం చూసే సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన పెంచే రోజును ఆచరిస్తారు. చారిత్రక కట్టడాలు మరియు సైట్లను ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యం, దీని ద్వారా మనం సమాజం యొక్క సాంస్కృతిక సమగ్రతను కూడా కాపాడుకోవచ్చు. ఈ సంవత్సరం థీమ్ “కాంప్లెక్స్ పాస్ట్స్: డైవర్స్ ఫ్యూచర్స్” ప్రపంచాన్ని ఎక్కువగా చేర్చడానికి మరియు వైవిధ్యాన్ని గుర్తించడానికి ప్రపంచ కాల్‌లను గుర్తించాల్సిన అవసరాన్ని ప్రతిబింబిస్తుంది.ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా, వారసత్వ ప్రదేశాలచే వివిధ కార్యక్రమాలు మరియు పర్యటనలు నిర్వహిస్తారు.1982 లో, ఐకోమోస్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ను ఏప్రిల్ 18 ను అంతర్జాతీయ స్మారక చిహ్నాలు మరియు సైట్ల దినోత్సవంగా జరుపుకోవాలని సూచించింది
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ హెరిటేజ్ దినోత్సవం గా ఏప్రిల్ 18
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : ఏప్రిల్ 18
భారత ఫుట్ బాల్ మాజీ ఆటగాడు అహ్మద్ హుస్సేన్ కన్నుమూత :

భారత ఫుట్ బాల్ స్వర్ణ యుగంలో భాగమైన అహ్మద్ హుస్సేన్ఇటీవల కన్నుమూసారు. 89 ఏళ్ల ఈ మాజీ ఫుట్ బాల్ ఆటగాడు కరోనాతో బెంగ ళూరులో తుదిశ్వాస విడిచారు. ఆడే రోజుల్లో అత్యుత్తమ డిఫెండర్ గా పేరు తెచ్చు కున్న ఆయన భారత్ తరపున 11 అంతర్జాతీయ మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించారు. హైదరాబాద్ కు చెందిన ఆయన 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలి చిన జాతీయ జట్టులో సభ్యుడు గా ఉన్నారు. 1958 టోక్యో ఆసియా క్రీడల్లోనూ భారత జట్టు లో బరిలో దిగాడు. దిగ్గజ కోచ్ రహీమ్ శిక్షణలో హైదరాబాద్ పోలీస్ జట్టుకు అహ్మద్ ఆడారు. మహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ తరపున ఆడిన ఆయన.. ఢాకాలో అగాఖాన్ గోల్డ్ కప్ గెలిచిన తొలి భారత క్లబ్బుగా ఆ జట్టు చరిత్ర సృష్టించా డంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత సాయ్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించి బెంగళూరులో స్థిరపడ్డారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత ఫుట్ బాల్ మాజీ ఆటగాడు అహ్మద్ హుస్సేన్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 17
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |