
Daily Current Affairs in Telugu 18-02-2022
‘క్విట్ టొబాకో యాప్’ని ప్రారంబించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ :

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సౌత్-ఈస్ట్ ఆసియా రీజియన్ (SEAR) ‘క్విట్ టొబాకో యాప్’ని ప్రారంభించింది. పొగలేని మరియు ఇతర కొత్త ఉత్పత్తులతో సహా అన్ని రూపాల్లో పొగాకు వినియోగాన్ని వదులుకోవడానికి ఈ అప్లికేషన్ ప్రజలకు సహాయపడుతుంది. ఈ యాప్ ను WHO-SEAR రీజినల్ డైరెక్టర్ డాక్టర్స్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ గారు ప్రారంభించారు, WHO యొక్క ఏడాది పొడవునా ‘కమిట్ టు క్విట్ ప్రచారం సందర్భంగా, ఇది WHO సౌత్-ఈస్ట్ ఆసియా రీజియన్ ద్వారా ఏర్పాటు చేసిన తాజా పొగాకు నియంత్రణ చోరవ.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపన : 1948 ఏప్రిల్ 07
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రదాన కార్యాలయం : జెనివా స్విట్జర్ ల్యాండ్
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘క్విట్ టొబాకో యాప్’ని ప్రారంబించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎవరు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎక్కడ; న్యూయార్క్
ఎప్పుడు : ఫిబ్రవరి 18
దేశ చరిత్రలో ఇదే తొలిసారి38 మందికి ఒకే సారి ఉరిశిక్ష విధించిన అహ్మదాబాద్ హైకోర్ట్ :

49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించగా 11 మందికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి ఏఆర్ పాటిల్ తీర్పు వెలువరించారు. ఒక కేసులో ఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అహ్మదాబాద్ రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 2008లో 18 చోట్ల వరు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, మున్సిపల్ ఎల్టీ ఆస్పత్రి, కార్లు, పార్కింగ్ ప్రదేశాల్లో జరిగిన పేలుళ్లలో 58 మంది మృతి చెందగా, 200 మందికి గాయాలయ్యాయి. కొన్ని బాంబులను ముందే గుర్తించిన భద్రతా దళాలు వాటిని నిర్వీర్యం చేశాయి. దీంతో కొంత ప్రాణనష్టం తప్పింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి38 మందికి ఒకే సారి ఉరిశిక్ష విధించిన అహ్మదాబాద్ హైకోర్ట్
ఎవరు: అహ్మదాబాద్ హైకోర్ట్
ఎక్కడ; అహ్మదాబాద్
ఎప్పుడు : ఫిబ్రవరి 18
భారతదేశపు మొదటి జాతీయ సముద్ర భద్రతా సమన్వయకర్తగా జి అశోక్ కుమార్ నియామకం :

రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఐన జి అశోక్ కుమార్‌గారిని భారతదేశపు మొదటి జాతీయ సముద్ర భద్రతా సమన్వయకర్తగా ప్రభుత్వం నియమించింది. భద్రతపై విశ్వసనీయతను నిర్ధారించడానికి మరియు దేశం యొక్క సముద్ర భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం నిర్ణయాత్మకమైన చర్య తీసుకుంది. 14 సంవత్సరాల క్రితం 26/11 ముంబయి ఉగ్రదాడి తరువాత సముద్రంలో ఉగ్రవాదుల బృందం దాడి చేయడంతో సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి భారతదేశం చేస్తున్న స్థిరమైన ప్రయత్నాలలో భాగంగానే ప్రస్తుతం నేవీ మాజీ వైస్ చీఫ్‌గా ఉన్న జి అశోక్ కుమార్ నియామకం జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశపు మొదటి జాతీయ సముద్ర భద్రతా సమన్వయకర్తగా జి అశోక్ కుమార్ నియామకం
ఎవరు: జి అశోక్ కుమార్
ఎప్పుడు : ఫిబ్రవరి 18
తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ తో రికార్డ్ సృష్టించిన క్రికెటర్ షకిబుల్ గని :

అరంగేట్ర మ్యాచ్ లోనే ఓ ఆటగాడు సెంచరీ చేస్తే వాహ్వా అంటారు.అదే డబుల్ సెంచరీ సాధిస్తే వారెవ్వా అని పొగిడేస్తారు. మరి త్రిశతకం సాధిస్తే బిహార్ కుర్రాడు సకిబుల్ గని (841, 405 బంతుల్లో 56×4, 2×6) ఆ అద్భుతాన్ని అందుకున్నాడు. తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ లో అసాధారణ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా త్రిశతకం బాది. ఫస్ట్ క్లాస్ ఆరంగేట్ర మ్యాచ్ లో ఆ ఘనత అందుకున్న మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ప్లేట్ గ్రూప్ లో మిజోరాం జట్టుతో మ్యాచ్ లో అతడు చెలరేగిపోయాడు. మ్యాచ్ తొలి రోజే శతకం సాధించిన 22 ఏళ్ల సకిబుల్ఫిబ్రవరి 18న మరింతగా చెలరేగాడు. 136 పరుగుల ఓవరైనైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన గాను అతను బౌండరీల వేటలో దూసుకెళ్లాడు. మొత్తం 56 ఫోర్లు రికార్డులు బద్దలు కొట్టాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ తో రికార్డ్ సృష్టించిన క్రికెటర్ షకిబుల్ గని
ఎవరు: క్రికెటర్ షకిబుల్ గని
ఎప్పుడు : ఫిబ్రవరి 18
కన్నడ భాషలో ప్రముఖ కవి రచయిత చన్న వీర కవి కన్నుమూత :

కన్నడ భాషలో ప్రముఖ కవి, రచయిత చన్న వీర కనవి ఇటీవల కన్నుమూశారు. ఆయన వయస్సు 93. ఆయనను తరచుగా ‘సమన్వయ కవి’ (సయోధ్య కవి) అని పిలుస్తారు. కనవి తన జీవధ్వని (కవిత్వం) రచనకు 1981లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈయన కు జ్ఞాన పీత అవార్డు కూడా దక్కింది. కర్నాటక యూనివర్సిటీలో పబ్లికేషన్ విభాగంలో సేక్రటరి గా పనిచేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కన్నడ భాషలో ప్రముఖ కవి రచయిత చన్న వీర కవి కన్నుమూత
ఎవరు: చన్న వీర కవి
ఎప్పుడు : ఫిబ్రవరి 18
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |