Daily Current Affairs in Telugu 17 October – 2022
‘వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడి :

కేంద్రం ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన కింద ‘వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అన్ని సబ్సిడీ ఎరువులను ఒకే బ్రాండ్ కింద మార్కెట్ చేయడం తప్పనసరి చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పీఎం కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా జరుగుతున్న రెండు రోజుల కార్యక్రమంలో సింగిల్ బ్రాండ్ భారత్ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. సబ్ సిడి ఎరువుల అక్రమ మార్గంలో తరలింపుకు చెక్ పెట్టేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం కింద యూరియా, డి అమ్మెనియా ఫాస్పేట్ (డీఏపీ), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ), ఎస్పీకే వంటివి ఒకే బ్రాంక్ కింద విక్రయాలు జరుగుతాయి. అంతేగాక సుమారు 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను(పీఎంకేఎస్ కే) కూడా ప్రారంభించారు. ఇవి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు అందిచడమే కాకుండా. బహుళ సేవలను అందించే ఒక షాపుగా పనిచేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడి
ఎవరు : నరేంద్ర మోడి
ఎప్పుడు : అక్టోబర్ 17
ప్రపంచ హిందీ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న ఫిజి దేశం :

ఫిజీ వచ్చే ఏడాది ప్రపంచ హిందీ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుందని, ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని ద్వీప దేశంలోని భారత హైకమిషనర్ పళనిస్వామి కార్తిగేయన్ ధృవీకరించారు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో హిందీ మాట్లాడే పండితులు, భాషా విద్యావేత్తలు, ఇతర అధికారులు పాల్గొంటారు. భాషలలో హిందీ దక్షిణ పసిఫిక్ దేశంలో మాట్లాడే మూడు అధికారిక భాషలలో హిందీ ఒకటి, మిగిలిన రెండు ఫిజియన్ మరియు ఇంగ్లీష్.ఫిజి హిందీ ని ‘ఫిజియన్ బాత్’ లేదా ‘ఫిజియన్ హిందుస్తానీ’ అని కూడా 1879 మరియు 1916 మధ్య ద్వీపానికి తీసుకువచ్చిన ఇండ్, చెరకు మరియు పత్తి తోటలపై పని చేయడానికి కార్మికులుగా నియమించబడిన బ్రిటీష్ ఇండెంచర్డ్ లేబర్ సిస్టమ్ యొక్క గరిష్ట సమయంలో ఈ భాష అభివృద్ధి చెందింది.ఫిజీ జనాభాలో భారతదేశం దాదాపు 38 శాతం. 2021 నాటికి, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దేశంలో సుమారుగా 3.20 లక్షల మంది ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ హిందీ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న ఫిజి దేశం
ఎవరు : ఫిజి దేశం
ఎక్కడ: ఫిజి దేశంలో
ఎప్పుడు : అక్టోబర్ 17
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ జూనియర్ పురుషుల విభాగం రజతపతకం గెలుచుకున్న సమీర్ :

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ జూనియర్ పురుషుల విభాగం 25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ లో భారత కుర్రాడు సమీర్ రజతం గెలుచు . కున్నాడు. ఫైనల్లో అతడు 23 హిట్ల తో రెండో స్థానంలో నిలి చాడు. చైనాకు షూటర్ వాంగ్ ‘షివెన్ 25 హిట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. చైనాకే చెందిన షూటర్ లియు యాంగ్పాన్ కాంస్య పతకం సాధించాడు. మరో ముగ్గురు భారత షూటర్లు జతిన్, ఆదర్శ్ సింగ్, హర్షవర్ధన్ యాదవ్ అర్హత రౌండ్ ను దాటలేకపోయారు ఈషా సింగ్, శిఖ నర్వాల్, వర్ష సింగ్ల త్రయం జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో టైటిల్ రౌండ్కు ఆర్హత సాధించింది
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ జూనియర్ పురుషుల విభాగం రజతపతకం గెలుచుకున్న సమీర్
ఎవరు : సమీర్
ఎప్పుడు : అక్టోబర్ 17
100 మీటర్ల హర్డిల్స్ లో జాతీయ రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజి :

100 మీటర్ల హర్డిల్స్ లో 13 సెక్షన్ల లోపు ప్రదర్శన చేసిన భారత తొలి మహిళా అథ్లెట్ గా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజి రికార్డు సృష్టించింది. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ ఆమె జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్వర్ణం సాధించింది. రైల్వేస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న 22 ఏళ్ల జ్యోతి 12 82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో మేలో ఆమె 1804 సెకన్లతో నెలకొల్పిన ‘జాతీయ రికార్డు బద్దలైంది. ఇదే పోటీలో తెలంగాణ అమ్మాయి నందిని 13.51 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్యం దక్కించుకుంది స్వప్న (ఝార్ఖండ్) 19.26 సెకన్ల టైమింగ్ లో రజతం నెగ్గింది. ఇటీవల జాతీయ క్రీడల్లో జ్యోతి 1279 సెకన్లలో కొత్త రికార్డు నెలకొల్పింది. కానీ ఆ పోటీలో గాలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో రికార్డును పరిగణ లోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఆసియా స్థాయిలో రెండో వేగవంతమైన హర్డిల్స్ అథ్లెట్ జ్యోతినే కావడం విశేషం. విశాఖకు చెందిన ఆమె భువనేశ్వర్లో శిక్షణ పొందుతోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 100 మీటర్ల హర్డిల్స్ లో జాతీయ రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజి
ఎవరు : జ్యోతి యర్రాజి
ఎప్పుడు : అక్టోబర్ 17
స్వీడన్ దేశ నూతన ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టెర్సన్ ఎన్నిక :

స్వీడన్ దేశ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఉల్ఫ్ క్రిస్టెర్సన్ (59)ను ఆ దేశ పార్ల మెంటు అక్టోబర్ 17న ఎన్ను కుంది. కేవలం మూడు ఓట్ల ఆధిక్యంతో (176-173) ఆయన డెమోక్రాట్లపై విజయం సాధించారు. మూడు పార్టీల సంయుక్త భాగస్వామ్యంతో ప్రధాని పదవికి పోటీపడిన ఆయన సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయారు. పార్లమెంటులో ఇతర పార్టీలేవైనా పూర్తి అధిక్యాన్ని చూపించేవరకు స్వల్ప మెజారిటీ ఉన్నవారే ప్రధానిగా కొనసాగే అవకాశాన్ని ‘ఆ దేశ రాజ్యాంగం కల్పిస్తోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : స్వీడన్ దేశ నూతన ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టెర్సన్ ఎన్నిక
ఎవరు : ఉల్ఫ్ క్రిస్టెర్సన్
ఎక్కడ: : స్వీడన్ దేశ౦
ఎప్పుడు : అక్టోబర్ 17
సాన్ డియాగో ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన ఇగా స్వియాటెక్ :

స్వియాటెక్ ఖాతాలో ఎనిమిదో టైటిల్ మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఎనిమిదో టైటిల్ ను సాధించింది. అమెరికాలో జరిగిన సాన్ డియాగో ఓపెన్ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో స్పియాటెక్ (పోలాండ్) 6-3, 3-6, 6-0తో క్వాలిఫయర్ డొనా వెకిచ్ (క్రొయేషియా)పై గెలిచి 1,16,340 డాలర్ల ప్రైజ్ మనీ (రూ.95 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు దక్కించుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : సాన్ డియాగో ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన ఇగా స్వియాటెక్
ఎవరు : ఇగా స్వియాటెక్
ఎప్పుడు : అక్టోబర్ 17
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |