Daily Current Affairs in Telugu 17 June -2022
ఆర్ధిక సంక్షోభం కారణంగా వారానికి నాలుగు రోజులు మాత్రమే పనికి అనుమతి ఇచ్చిన శ్రీలంక దేశం :

ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను తాజాగా ఇంధన కొరత వేధిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ కొరత నేపధ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు పనిచేసేందుకు అనుమతించింది. ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టడంతో ఇంధనం, ఆహారం, మందుల దిగుమతికి సమస్యలు వేధిస్తుండటంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా పెట్రోల్, డీజిల్ కొరత నేపధ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు పనిచేసేందుకు అనుమతించింది. ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టడంతో ఇంధనం, ఆహారం, మందుల దిగుమతికి అవసరమైన విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత శ్రీలంకలో ఉంది.
- శ్రీలంక రాజధాని :కోలోంబో
- శ్రీలంక దేశ కరెన్సీ :శ్రీలంకన్ రూపి
- శ్రీలంక దేశ ప్రధాని : రాణిల్ విక్రమ సింఘే
- శ్రీలంక దేశ అద్యక్షుడు : గోటబాయ రాజపక్స
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆర్ధిక సంక్షోభం కారణంగా వారానికి నాలుగు రోజులు మాత్రమే పనికి అనుమతి ఇచ్చిన శ్రీలంక దేశం
ఎవరు: శ్రీలంక దేశం
ఎప్పుడు : జూన్ 17
ఐర్లండ్ జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఫోర్దరి ఫీల్డ్ :

ఐర్లండ్ జట్టు నుంచి మరో స్టార్ క్రికెటర్ విలియమ్ పోర్టరీ ఫీల్డ్ జూన్ 17న రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచి విలియమ్ పోర్టర్ ఫీల్డ్ కీలకపాత్ర పోషించాడు. పోర్టర్ ఫీల్డ్ 48 వన్డేల్లో 11 సెంచరీలు సహా 4343 పరుగులు చేశాడు. 2007 వరల్డ్ కప్ లో పాక్ పై గెలుపు, 2009 టి20 వరల్డ్ కప్ క్వాలిఫై, 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పైన సంచలన విజయ౦లో పోర్టరీ ఫీల్డ్ బాగంగా ఉన్నాడు. కాగా ఐర్లండ్ కు తొలి టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరించిచారు..
- ఐర్లాండ్ దేశ రాజధాని :డబ్లిన్
- ఐర్లాండ్ దేశ కరెన్సీ : యూరో
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐర్లండ్ జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఫోర్దరి ఫీల్డ్
ఎవరు: ఫోర్దరి ఫీల్డ్
ఎక్కడ : ఐర్లండ్
ఎప్పుడు : జూన్ 17
ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :

రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం జూన్ 17న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్ట సవరణ 2022కు సంబంధించి మార్పులు వెంటనే నాఖ అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బన్వర్ లాల్ పురోహిత్
- ఆంద్ర ప్రదేశ్ సిఎం :వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు : జూన్ 17
స్కెట్రాక్స్ బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా అవార్డును గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయ౦ :

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయానికి (జీహెచ్ఎస్ఐఏఎల్) మరో పురస్కారం లభించింది. విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలను వేగంగా అందిస్తున్నందుకు గాను ‘స్కెట్రాక్స్ బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా అవార్డును జూన్ 17న జీహెచ్ ఐఏఎల్ అధికారులు అందుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం సంవత్సరం కార్యనిర్వహణాధికారి ప్రదీప్ పణీకర్ వూట్లాడుతూ ప్రపంచంలోని ప్రముఖ 1000 విమానాశ్రయాల్లో 64వ స్థానంలో ఉన్న శంషాబాద్ 63వ స్థానానికి చేరిందన్నారు. 100 దేశాల్లో 550కి పైగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు చెక్-ఇన్, రాకపోకలు, బదిలీలు, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, షాపింగ్, భద్రత విభాగాల్లో అందిస్తున్న సేవలకుగాను ఈ పురస్కారాన్ని అందించిందన్నారు.
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయ౦ స్థాపన : 2008 మార్చ్ 28
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయ౦ ఉన్న ప్రదేశ౦ : హైదరాబాద్
- తెలంగాణా రాజధాని :హైదరబాద్
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందరరాజన్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్ర శేఖర్ రావు
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘స్కెట్రాక్స్ బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా అవార్డును గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయ౦
ఎవరు: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయ౦
ఎక్కడ: హైదరబాద్
ఎప్పుడు : జూన్ 17
బ్రిటిష్ ఆర్గనైజేషన్ – వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క నూతన సియివో గా సంతోష్ శుక్లా నియామకం :

భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంతోష్ శుక్లా బ్రిటిష్ ఆర్గనైజేషన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అయ్యారు. ఇటీవలే సంస్థ సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఆయనను నియమించింది. ప్రపంచ రికార్డుల అంతర్జాతీయ ధృవీకరణలో భాగంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (డబ్ల్యుబిఆర్) అగ్రగామిగా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : బ్రిటిష్ ఆర్గనైజేషన్ – వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క నూతన సియివో గా సంతోష్ శుక్లా నియామకం
ఎవరు: సంతోష్ శుక్లా
ఎప్పుడు : జూన్ 17
14వ బ్రిక్స్ శిఖరాగ్ర సభకు అతిథేయిగా వ్యవహరి౦చిన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ :

వీడియో లింకు ద్వారా ఈ నెల 23న వర్చువల్ పద్ధతిలో జరిగే 14వ బ్రిక్స్ శిఖరాగ్ర సభకు చైనా దేశ అధ్యక్షుడు జి జిన్ పింగ్ అతిథేయిగా వ్యవహరిస్తారని చైనా విదేశాంగశాఖ జూన్ 17న ప్రకటించింది. జూన్ 24న అంతర్జాతీయ అభివృద్ధిపై విస్తృత సమావేశం నిర్వహిస్తారు. రొటేషన్ పద్ధతిపై ఈ ఏడాది బ్రిక్స్ కు చైనా అధ్యక్షత వహిస్తోంది. జెనింగ్ పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సెనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమపోసా వర్చువల్ శిఖరాగ్ర సభలో పాల్గొంటారు. ఉన్నతస్థాయి బ్రిక్స్ భాగస్వామ్యాన్ని నిర్మించి, అంతర్జాతీయ అభివృద్ధిలో కొత్త శకాన్ని ప్రారంభించడమనే నినాదంతో ఈ ఏడాది బ్రిక్స్ భ జరుగుతోంది.
- చైనా దేశ రాజధాని : బీజింగ్
- చైనా దేశ కరెన్సీ : రెన్మిన్ బి
- చైనా దేశ అద్యక్షుడు : జిన్ పింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి : 14వ బ్రిక్స్ శిఖరాగ్ర సభకు అతిథేయిగా వ్యవహరి౦చిన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్
ఎవరు: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఎప్పుడు : జూన్ 17
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |