Daily Current Affairs in Telugu 17 July -2022
ప్రపంచకప్ మాటింగ్ టోర్నీలో కాంస్య పతకం గెలుచుకున్న అంజుమ్ మౌద్గిల్ :

కొరియాలో జరుగుతున్న ప్రపంచకప్ మాటింగ్ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ పొజిషన్ ఈవెంట్ లో అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకం నెగ్గగా. పురుషుల 50 మీటర్ల రైఫిల్ పాషన్ టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ సంజీవ్ రాజ్పుట్లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో అంజుమ్ 402.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 12-16తో చెక్ రిపబ్లిక్ జట్టు చేతిలో ఓడిపోయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచకప్ మాటింగ్ టోర్నీలో కాంస్య పతకం గెలుచుకున్న అంజుమ్ మౌద్గిల్
ఎవరు: అంజుమ్ మౌద్గిల్
ఎప్పుడు: జులై 17
సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 లో మూడో టైటిలు సొంతం చేసుకున్న పివి సింధు :

ప్రపంచ మాజీ ఛాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సాధించింది.. వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ మొట్టమొదటి సారి సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో విజయ ఢంకా మోగించింది. ఈ ఏడాది సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్ నెగ్గిన ఈ హైదరాబాద్ షట్లర్.. ఇప్పుడు మూడో టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-9, 11-21, 21-15 తేడాతో వాంగ్ జియి (చైనా) పై గెలిచింది ప్రత్యర్థిపై 1-0 విజయాల ఆధిక్యంతో తుదిపోరులో అడుగుపెట్టిన నందు దూకుడు కొనసాగించింది. వాంగ్ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ కీలక సమయాల్లో బలంగా నిలబడి 58 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 లో మూడో టైటిలు సొంతం చేసుకున్న పివి సింధు
ఎవరు: పివి సింధు
ఎప్పుడు: జులై 17
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న హెచ్.పి.సి.ఎల్ :

స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంలో భాగంగా 3,00,000 విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారుచేయటంతో పాటు 8,09.278 మంది విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేసినందుకు హిందూ స్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)కు అరుదైన గౌరవం దక్కింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో హెచ్పీసీఎల్ చోటు దక్కించు కుంది. ఈ మేరకు ఆదివారం సీ పురంలో హెచ్ పీసీఎల్ ప్రతినిధులకు రికార్డ్ పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా హెచ్పీసీఎల్ ఈడీ వి.రతన్ రాజ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో 15 రోజుల పాటు విభిన్న కార్యక్రమాలను నిర్వహించామన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న హెచ్.పి.సి.ఎల్
ఎవరు: హెచ్.పి.సి.ఎల్
ఎప్పుడు: జులై 17
మొబైల్ చార్జింగ్ అనే యాప్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే :

మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (MOMSME) మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర మంత్రి నారాయణ్ టాటు, రాణే ‘ రెపోస్ పే’ అనేఒక ‘మొబైల్ ఎలక్ట్రిక్ చార్జింగ్’ ప్లాట్ ఫారమ్ ను మరియు ‘ఫిస్-గెటల్’ అనేది ఒక పెన్టిక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ) ఫ్లాట్ఫారమ్ ‘ఫ్యూయిలింగ్ ఇండియాలో ప్రారంభించారు. మహారాష్ట్రలోని ముంబైలో 2022 ఈవెంట్. “రిపోస్ పి” అనేది ఒక వ్యక్తి అప్లికేషన్ (యాప్)లో మొబైల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికలేని చేసే వారి వాహనాలకు దార్డ్ చేసి ఫ్లాట్ఫారమ్, ”ఫిస్-గెటల్’ అనేది ఫిన్టిక్ ప్లాట్ ఫారమ్ ఇది టెక్నాలజీ ద్వారా ఇంధన వినియోగదారులకు క్రెడిట్ ని అందిస్తుంది. ఎనర్జీ ఫినిటిక్ ప్లాట్ ఫారమ్ బల్క్ వినియోగదారులను క్రెడిటిపై ఇంధనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మొబైల్ చార్జింగ్ అనే యాప్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే
ఎవరు: నారాయణ్ రాణే
ఎప్పుడు: జులై 17
ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ఎక్సప్రెస్ వే ను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి :

ఉత్తరప్రదేశ్ (యుపి) లోని జలాన్ లోని ఒరై తహసీల్లోని కైతేరి గ్రామంలో 296 కి.మీ పొడవైన బుందేల్ ఖండ్ ఎక్సప్రెస్ వెను ప్రధాని (పిఎం) నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (సీఎం) యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది యుపిలోని ఏడు జిల్లాల గుండా వెళుతుంది మరియు దాదాపు రూ. 14,850 కోట్లతో ఇది నిర్మించబడింది. దీనిని UPEIDA (ఉత్తర ప్రదేశ్ ఎక్సేస్పే అండస్ట్రియల్ డెవలప్మెంట్ అధారిటీ)వారు అభివృద్ధి చేసారు. ఇది నాలుగు లేన్ ఎక్సప్రెస్ వే ఆరు లేన్లుగా విస్తరించబడుతుంది, ఇది UPలోని ఏడు జిల్లాల గుండా వెళుతుంది. నిర్మాణానికి శంకుస్థాపన ఫిబ్రవరి 2020న ప్రధాన మంత్రి ద్వారా వేయబడింది మరియు చివరకు, ఎక్సప్రెస్ వే దాదాపు 2.8 నెలల్లో పూర్తయింది.ఇది చిత్రకూట్ జిల్లాలోని భరత్ కూప్ సమీపంలోని గోండా గ్రామం వద్ద NH (నేషనల్ హైవే)- 35 నుండి ఏటావా జిల్లాలోని కుర్రల్ గ్రామం వరకు విస్తరించి ఉంది, ఇక్కడ అది ఆగా-లక్నో ఎక్స్ ప్రెస్ తో కలిసిపోతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ఎక్సప్రెస్వేను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ: ఉత్తరప్రదేశ్ లో
ఎప్పుడు: జులై 17
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |