Daily Current Affairs in Telugu 17-09-2021
‘ఎర్త్ట్ ప్రైజ్’ ఫైనలిస్టులో చోటు దక్కించుకున్న రెండు భారత ప్రాజెక్టులు :

బ్రిటన్ ప్రిన్స్ విలియం తొలిసారి అందజేయనున్న ‘ఎర్త్ ప్రైజ్’ ఫైనలిస్టులో రెండు భారతీయ ప్రాజెక్టులకు చోటు లభించింది. ఐదు విభాగాల్లో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన 750 ఎంట్రీలను వడపోసి, 15 ప్రాజెక్టులను తుది ఎంపికకు ఖరారు చేశారు. వీటిలో ఒక తమిళనాడు పాఠశాల విద్యార్థిని వినీష ఉమాశం కర్ కాగా, మరొకటి ఢిల్లీకి చెందిన విద్యుత్ మోహన్ ప్రతిపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు రంగ వ్యాపారుల సహకారంతో ఏర్పాటైన ‘ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ అలయెన్స్ మెంబర్స్’ నెట్వర్క్.. విజేతల ప్రాజెక్టులకు వనరులు సమకూర్చుతుంది. గత ఏడాది ప్రారంభించిన ఈ ప్రైజ్ ఫైనలిస్టుల జాబితాను ప్రిన్స్ విలియం సెప్టెంబర్17నప్రకటించారు. అక్టోబరు 17న లండన్ లో జరిగే కార్యక్రమంలో. ఈ 15 మంది ఫైనలిస్టుల్లో ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తారు. వారి ప్రాజెక్టులకు డెలాయిట్ ఆధ్వర్యంలోని ప్రైజ్ నెట్వర్క్ రూ.10.12 కోట్ల (1 మిలి యన్ పౌండ్ల) ఆర్థిక సాయం అందించనుంది. ‘
క్విక్ రివ్యు:
ఏమిటి : ‘ఎర్త్ట్ ప్రైజ్’ ఫైనలిస్టులో చోటు దక్కించుకున్న రెండు భారత ప్రాజెక్టులు
ఎవరు: వినీష ఉమాశంకర్, విద్యుత్ మోహన్
ఎప్పుడు: సెప్టెంబర్ 17
ప్రతిష్ఠాత్మక చాణక్య జాతీయ పురస్కారం దక్కించుకున్న యు. సత్యనారాయణ :

ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(చీఫ్ పీఆర్వో) యు. సత్యనారాయణకు ప్రతిష్ఠాత్మక చాణక్య జాతీయ పురస్కారం వరించింది. వైద్య సేవలకు సంబంధించిన అంశాలలో ప్రజా సంబంధాలను మెరుగ్గా, విస్తృతంగా అందించిన వారికి జాతీయ స్థాయిలో ఈ పురస్కారాన్ని అందజేస్తుంటారు. గోవాలో సెప్టెంబర్ 17న జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారి చేతుల మీదుగా సత్యనారాయణ ఈ అవార్డును స్వీకరించారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రుల్లో గత 20 ఏళ్లుగా ఈయన ప్రజాసంబంధాల అధికారిగా సేవలందిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ కాలంలో ఏఐజీ అందించిన వైద్యసేవలను, కరోనా పై అవగాహన కార్యక్రమాలను రోగులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పురస్కారం తన బాధ్యతలను మరింత పెంచిందనీ, ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రోత్సాహం, సహకారంతోనే విస్తృత సేవలందించ గలుగుతున్నానని సత్యనారాయణ పేర్కొన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : ప్రతిష్ఠాత్మక చాణక్య జాతీయ పురస్కారం దక్కించుకున్న యు. సత్యనారాయణ
ఎవరు: యు. సత్యనారాయణ
ఎప్పుడు: సెప్టెంబర్ 17
ఒకేసారి 8 మందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించిన కొలిజియం :

సుప్రీంకోర్టు కొలీజియం మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 8 మందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయిదుగురు ప్రధాన న్యాయమూర్తు లను బదిలీ చేయాలని ప్రతిపాదించింది. వ్యక్తి గత వినతులు, పరిపాలనా అవసరాల దృష్ట్యా ఒకేసారి 25 మంది న్యాయమూర్తుల బదిలీకి ఆమోదం తెలిపింది. ఇంకా మరో ముగ్గురి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎ. ఎం. ఖాన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం గత రెండు రోజులుగా విస్తృత కసరత్తు చేసి పూర్తి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా తెలంగాణా రాష్ట్ర హైకోర్టు సిజె గా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర గారు సిజె లు నియమితులయ్యారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సిజె రామచంద్ర రావు గారు పంజాబ్ హరియాన హైకోర్టు కు బదిలీ అయ్యారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : ఒకేసారి 8 మందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించిన కొలిజియం
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 17
తెలంగాణ విమోచన దినోత్సవం గా సెప్టెంబర్ 17 :

సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైద్రాబాద్ స్టేట్ భారతదేశంలో కలిసిన రోజు ఇది. 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో’ అనే పేరిట ఆపరేషన్ ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి ‘పోలీస్ యాక్షన్’ అనే పేరు పెట్టారు. భారతసేనల ధాటికి తట్టుకోలేక నిజాం నవాబు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. తన సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి అంగీకరించారు. సెప్టెంబరు 17న నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఆ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సంస్థానంలో ఉన్న గంగాబాద్, నాందేడ్, పర్బనీ, బీడ్ మహారాష్ట్రాలో, గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ కర్నాటక రాష్ట్రంలో విలీనం అయిపోయాయి. హైదరాబాద్ మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.
.
క్విక్ రివ్యు:
ఏమిటి : తెలంగాణ విమోచన దినోత్సవం గా సెప్టెంబర్ 17 :
ఎవరు: తెలంగాణ రాష్ట్రం
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: సెప్టెంబర్ 17
ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం: 17 సెప్టెంబర్

రోగుల భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి మరియు వారి యొక్క ఆరోగ్య సంరక్షణ ను సురక్షితంగా చేయడానికి తమ నిబద్ధతను చూపించమని ప్రజలను కోరడానికి సెప్టెంబర్ 17 న ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం జరుపుకుంటారు. రోగులు, కుటుంబాలు, సంరక్షకులు, సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సంరక్షణ నాయకులు మరియు పాలసీ-మేకర్స్ రోగుల భద్రతకు తమ నిబద్ధతను చూపించడానికి ఈ రోజు తెలియజేస్తుంది.. 2021 వరల్డ్ పేషంట్ సెక్యురిటి డే యొక్క థీమ్ ‘సురక్షితమైన తల్లి మరియు నవజాత సంరక్షణ’. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 2019 లో WHA72.6 తీర్మానం ద్వారా స్థాపించబడింది. ఏటా సెప్టెంబర్ 17 రోగి భద్రతా దినోత్సవం గా న జరుపుకుంటారు. ఇది 25 మే 2019 న 72 వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ఆమోదించబడింది.
క్విక్ రివ్యు:
ఏమిటి : ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం గా సెప్టెంబర్ 17
ఎప్పుడు: సెప్టెంబర్ 17
. బ్రిటన్ కంప్యూటర్ల సృష్టికర్త. క్లైవ్ సింక్లేర్ కన్నుమూత :

పాకెట్ కాలిక్యులేటర్లు, బుల్లి టీవీలు, ఎలక్ట్రిక్ కార్లు, వాచీలు, చవక ధర కంప్యూటర్ల సృష్టికర్త. సింక్లేర్ (81) కన్నుమూశారు. బ్రిటన్ కు చెందిన ఆయన తన మేధస్సుతో ప్రపంచానికి అనేక ఉపకరణాలను అందించి, అసంఖ్యాక ప్రజల అభిమానం పొందారు. 1980లో అందుబాటు ధరల్లో కంప్యూటర్లను తీసుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. తద్వారా ఎంతోమంది గేమింగ్, కోడింగ్ రంగంలో ప్రవేశించడానికి మార్గం సుగమం చేశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్ తో బాధపడిన ఆయన సెప్టెంబర్ 17న తుదిశ్వాస విడిచారు.. రిచ్మండ్లో 1940లో జన్మించిన ఆయన.. 17వ ఏటే చదువులకు స్వస్తి పలికారు. రేడియోనిక్స్ సంస్థను ప్రారంభించి, మెయిల్ ఆర్డర్ రేడియో కిట్లు, రేడియో ట్రాన్సిస్టర్ల తయారీ చేపట్టారు. ప్రపంచంలోనే తొలిసారిగా 1973లో పాకెట్ ‘కాలిక్యులేటర్ను అందుబాటులోకి తెచ్చారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : బ్రిటన్ కంప్యూటర్ల సృష్టికర్త. క్లైవ్ సింక్లేర్ కన్నుమూత
ఎవరు: . సింక్లేర్
ఎప్పుడు: సెప్టెంబర్ 17
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |