
Daily Current Affairs in Telugu 17-06-2021
రెవ్ అప్” అనే యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం :

జూన్ 15న “2020 ఇయర్ ఆఫ్ AI” చొరవలో భాగంగా, తెలంగాణ రాష్ట ప్రభుత్వం నాస్కామ్ ఆధారిత తెలంగాణ AI మిషన్ (టి-ఎయిమ్) ను ప్రారంభించింది. మరియు T-AIM లో భాగంగా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంబంధిత స్టార్టప్‌లను ప్రారంభించడానికి మరియు శక్తివంతం చేయడానికి “రెవ్ అప్” అనే యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంను మొదటిసారిగా ప్రారంభమవుతుంది AI మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలకు తెలంగాణ మరియు హైదరాబాద్ ల ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చడానికి లక్ష్యంగా ఉంది. వృద్ధి దశ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ వివిధ రంగాలను కవర్ చేస్తుంది. దీని ప్రారంభోత్సవంలో, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, “తెలంగాణను AI లో నాయకుడిగా ఉంచాలనే దృష్టికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం క్రియాశీల పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించినది.
క్విక్ రివ్యు :
ఏమిటి: రెవ్ అప్” అనే యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
ఎవరు: తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: జూన్ 17
మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క నూతన చైర్మన్ గా సత్య నాదెళ్ల నియమకం ;

భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు సత్య నాదెళ్ల మరోఘనతను సాధించారు. టెక్ దిగ్గజ సంస్థ ఐన మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్ గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ తాంసన్ స్థానంలో, ప్రస్తుత౦ సీఈవోను కొత్త కంపెనీ ఎంపిక చేసింది. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కాగా సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తరువాత చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తాంసన్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నట్లు జూన్ 16న కంపెనీ తెలిపింది. స్టీవ్ బాల్మెర్ నుండి 2014 లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల, లింక్డ్ఇన్,న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అనేక డీల్స్‌తో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో కీలకపాత్ర పోషించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క నూతన చైర్మన్ గా సత్య నాదెళ్ల నియమకం
ఎవరు: సత్య నాదెళ్ల
ఎప్పుడు: జూన్ 17
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్పీకర్ గా సెల్వం ఎన్నిక :

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం సెల్వం గారు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బిజేపి బలం పెరిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరపున ఆరు మంది సభ్యులు ఎన్నికల్లో గెలిచారు. ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి 16 సీట్లలో గెలిచి పుదుచ్చేరి అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. సీఎంగా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగం స్వామి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి రెండు మంత్రి పదవులతో పాటుగా స్పీకర్ పదవిని ఎన్ఆర్ కాంగ్రెస్ కేటాయించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్పీకర్ గా సెల్వం ఎన్నిక
ఎవరు: ఎన్బలం సెల్వం
ఎక్కడ: పుదుచ్చేరి
ఎప్పుడు: జూన్ 17
అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గరు వ్యోమగాములను పంపిన చైనా దేశం ;

డ్రాగన్ దేశం చైనా కొత్తగా నిర్మించిన అంతరిక్ష కేంద్రానికి తన వ్యోమగాములను పంపింది. ముగ్గురు చైనా వ్యోమగాములు నింగికెగిరారు. లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా ‘షెన్‌జౌ -12’క్యాప్సూల్‌లో ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. భూ కక్ష్యలో సొంతంగా నిర్మిస్తున్న ఒక రోదసి కేంద్రంలోకి తొలిసారిగా ముగ్గురు వ్యోమగాములను పంపింది. వీరు మూడు నెలల పాటు అక్కడే ఉంటారు తి యానే పేరుతో రోదసి కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన కోర్ భాగాన్ని ఏప్రిల్ 29న అంతరిక్షంలోకి పంపింది. మే 29న కొన్ని ఉపకరణాలు, వ్యోమగాములకు అవసరమైన సర కులను అక్కడికి చేరవేసింది.. అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కోర్ మాడ్యు,లోకి వ్యోమగాములను తాజాగా పంపింది. స్థానిక కాలమానం ప్రకారం జూన్ 17న ఉదయం 9.22 గంటలకు షెంఝౌ-12 అనే వ్యోమనౌకలో వ్యోమగాములు కమాండర్ నీ హైషెంగ్ (56). లియు బోమింగ్ (54), టాంగ్ హోంగ్బో (15). WA తియాంఝా-2 అనే సరకు రవాణా వ్యోమనౌకతో అనుసంధానమై ఉంది..ఈ ప్రయోగంతో చైనా అంతరిక్ష పరిశోధనల్లో తన సత్తా మరోసారి చాటింది
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతరిక్ష కేంద్రం లోకి ముగ్గరు వ్యోమగాములను పంపిన చైనా దేశం
ఎవరు: చైనా దేశం
ఎక్కడ: చైనా \
ఎప్పుడు: జూన్ 17
ప్రపంచ పోటి తత్వ సూచిలో మొదటి స్థానం లో నిలిచినా స్విట్జర్ ల్యాండ్:

ఐఎండి (ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్మెంట్) ఏటా విడుదల చేసే ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత దేశం 43వ ర్యాంకును నిలబెట్టుకుంది. ఈ ఏడాది కూడా కొవిడ్-19 ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఉంటుందని ఐఎండీ గుర్తించింది. 64 దేశాలతో కూడిన ఈ పోటీతత్వ సూచీ జాబితాలో స్విట్జ ర్లాండ్ అగ్రస్థానంను దక్కించుకుంది. స్వీడెన్ గత ఏడాది ఆరో స్థానంలో ఉండగా, తాజాగా రెండో స్థానానికి ఎగబాకింది. డెన్మార్క్ ఒక స్థానాన్ని కోల్పోయి మూడో ర్యాంకు దక్కించు కుంది. నెదర్లాండ్స్ నాలుగో స్థానం, సింగపూర్ అయిదో స్థానాన్ని పొందాయి. 2020లో తొలి స్థానంలో ఉన్న సింగపూర్ ఈసారి నాలుగు స్థానాలు కోల్పోవడం గమనార్హం. ఈ పోటీ తత్వ సూచీని ప్రారంభించి 33 ఏళ్లు కాగా, తొలిసారిగా తైవాన్ తొలి 10 స్థానాల్లో చోటు (8వ ర్యాంకు) దక్కించుకుంది. గత ఏడాది 11వ స్థానంలో ఉంది. యూఏఈ, యూఎస్ ఏలు గత ఏడాది మాదిరే 9, 10 స్థానాల్లో నిలి చాయి. ఆసియా ఆర్ధిక వ్యవస్థల్లో సింగపూర్ (5), హాంకాంగ్ (7), తైవాన్ (8), చైనా (16)లు అగ్ర స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ పోటి తత్వ సూచిలో మొదటి స్థానం లో నిలిచినా స్విట్జర్ ల్యాండ్
ఎవరు: భారత్
ఎప్పుడు: జూన్ 17
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ గా ముక్కామాల శ్రీనివాస్ ఎన్నిక :

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ ప్రవాసాంధ్రుడు ముక్కా మల శ్రీనివాస్ (బాబీ) ఎన్నికయ్యారు. ఈ సంఘానికి చైర్మన్ గా ఎన్నికైన తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు. కృష్ణాజిల్లా తోట్ల ఆసుపత్రి మాజీ చైర్మన్ ముక్కామల అప్పారావు కు ఈ సందర్భంగా జూన్ 17న గ్రామస్తులు శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ గా ముక్కామాల శ్రీనివాస్ ఎన్నిక ;
ఎవరు: ముక్కామాల శ్రీ వాస్
ఎప్పుడు: జూన్ 17
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |