
Daily Current Affairs in Telugu 17-02-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
15వ CEC కప్ మహిళల ఐస్ హాకీ ఛాంపియన్ షిప్ 2022 ను గెలుచుకున్న ఖరు జట్టు :

లేహ్ లో జరిగిన 15వ సియిసి కప్ మహిళల ఐస్ హాకీ ఛాంపియన్ షిప్ 2022 ముగిసింది. జిల్లా యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ లడఖ్ వింటర్ స్పోర్ట్స్ క్లబ్ లేహ్ సహకారంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో ఏడు జట్లు పాల్గొన్నాయి. ఖరు జట్టు వారి విజయ౦తో ముగించింది మరియు 15వ CEC కప్ మహిళల ఐస్ హాకీ ఛాంపియన్షిప్ 2022ను కైవసం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 15వ CEC కప్ మహిళల ఐస్ హాకీ ఛాంపియన్ షిప్ 2022 ను గెలుచుకున్న ఖరు జట్టు
ఎవరు: ఖరు జట్టు
ఎప్పుడు: ఫిబ్రవరి 17
టర్కీ దేశం పేరును టర్కీయే గా మార్పు కు నిర్ణయం :

టర్కీ దేశం యొక్క పేరును టర్కీయే గా మార్చనుంది. దేశం పేరును అంతర్జాతీయ రంగంలో టర్కీ కి బదులుగా “టర్కీయే” వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో, ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ ప్రతిరోజూ ” టర్కీయే” అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది.
- టర్కీ దేశ రాజధాని :అంకారా
- టర్కీ దేశ కరెన్సీ : తర్కీష్ లీరా
- టర్కీ దేశ అధ్యక్షుడు : రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్
క్విక్ రివ్యు :
ఏమిటి: టర్కీ దేశం పేరును టర్కీయే గా మార్పు కు నిర్ణయం
ఎవరు: టర్కీ దేశం
ఎప్పుడు: ఫిబ్రవరి 17
భారతదేశం యొక్క UPI ప్లాట్ఫారమ్ ను అమలు చేసిన తొలి దేశంగా నిలిచిన నేపాల్ :

భారతదేశం యొక్క యుపిఐప్లాట్ఫారమ్ ను అమలు చేసిన మొదటి దేశంగా నేపాల్ దేశం అవతరించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క అంతర్జాతీయ విభాగం నేపాల్ లో ఇంటర్ పరబుల్ రియల్ టైమ్ పర్సన్-టు-పర్నన్ (P2P), పర్పన్ టు మర్చంట్ (P2M) మరియు పొటెన్షియల్ క్రాస్ ను పెంపొందించడాని పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.మర్చంట్ (P2M) మరియు పొటెన్షియల్ క్రాస్ ను పెంపొందించడానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
- నేపాల్ దేశ రాజధాని :ఖాట్మండు
- నేపాల్ దేశ కరెన్సీ :నేపాలీస్ రూపీ
- నేపాల్ దేశ ప్రదాని : షేర్ బహదూర్ దేబా
- నేపాల్ దేశ అద్యక్షుడు : బిధ్యా దేవి బండారి
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశం యొక్క UPI ప్లాట్ఫారమ్ ను అమలు చేసిన తొలి దేశంగా నిలిచిన నేపాల్
ఎవరు: నేపాల్ దేశం
ఎక్కడ: నేపాల్
ఎప్పుడు: ఫిబ్రవరి 17
పశ్చిమ బెంగాల్‌లో ‘వేస్ట్ టు వెల్త్ క్రియేషన్’ కార్యక్రమాన్ని ప్రారంబించిన సిడ్బి సంస్థ :

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సుందర్‌బన్స్‌లో మహిళలు చేపల స్కేల్‌తో ఆభరణాలు మరియు షోపీస్‌లను తయారు చేసే ‘వేస్ట్ టు వెల్త్ క్రియేషన్’ కార్యక్రమాన్ని సిడ్బి సంస్థ ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద సిడ్బి సంస్థ ప్రత్యామ్నాయ జీవనోపాధి నుండి నేరుగా ఆధాయామును పొందడంలో 50 మంది మహిళలకు ప్రయోజనాలను అందిస్తుంది. ఆతరువాత, వారిలో ప్రతి ఒక్కరూ ప్రతిరూపం కోసంఒక శిక్షకుడిగా మారాలని మరియు ఇతర ఆశావహుల మధ్య వారి యొక్క నైపుణ్యాలు వ్యాప్తి చేయాలని భావిస్తున్నారు.
- సిడ్బి సంస్థ పూర్తి రూపం :స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- సిడ్బి సంస్థ స్థాపన : 1990 ఏప్రిల్ 02
- సిడ్బి సంస్థ ప్రధాన కార్యాలయం : లక్నో
క్విక్ రివ్యు :
ఏమిటి: పశ్చిమ బెంగాల్‌లో ‘వేస్ట్ టు వెల్త్ క్రియేషన్’ కార్యక్రమాన్ని ప్రారంబించిన సిడ్బి సంస్థ
ఎవరు: SIDBI
ఎక్కడ: పశ్చిమ బెంగాల్‌లో
ఎప్పుడు: ఫిబ్రవరి 17
ఎక్సెలెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఇండిజినై జేషన్ అవార్డు గెలుచుకున్న అనంత్ టెక్నాలజీస్ :

హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు సాగిస్తున్న అనంత్ టెక్నాలజీస్ కు ఎక్సెలెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఇండిజినైజేషన్ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను సొసైటీ ఫ్ ఇండియన్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ అండ్ కోస్టేస్ (ఎస్ఐఏటీఐ) ఈ అవార్డు బహుకరించి ఫిబ్రవరి 17న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. శివన్. ఎస్ఐఏటీఐ అధ్యక్షుడు డాక్టర్ సి.జి. కృష్ణదాస్ నాయర్, హెచ్పీఎల్ సీఎండీ ఆర్.మాదవన్ చేతుల మీదుగా అనంత్ టెక్నాలజీస్ సీఎండీ డాక్టర్ సుబ్బారావు పావులూరి ఈ అవార్డు అందుకున్నారు. యుద్ధ విమానాల్లో వినియోగించే వియూహెచ్ఎఫ్ రేడియో కోసం యూహెచ్ఎస్ మాడ్యూల్ లను అభివృద్ధి చేసినంనందుకు గాను అనంత్ టెక్నాలజీస్ ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎక్సెలెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఇండిజినై జేషన్ అవార్డు గెలుచుకున్న అనంత్ టెక్నాలజీస్
ఎవరు: అనంత్ టెక్నాలజీస్
ఎప్పుడు: ఫిబ్రవరి 17
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నియామకం :

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ ను నియమించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2019 జూన్ నుంచి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన్ని ప్రభుత్వం రెండ్రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది..
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వా భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నియామకం
ఎవరు: గౌతమ్ సవాంగ్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: ఫిబ్రవరి 17
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |