Daily Current Affairs in Telugu 16&17 November – 2022
మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా సంధ్యా దేవనాథ్ నియామకం :

మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా సంధ్యా దేవనాథ్ గారిని నియమిస్తున్నట్లు సామాజిక మాద్యమ దిగ్గజం మెటా నవంబర్ 17న వెల్లడించింది.ఫేస్ బుక్ ,ఇన్ స్టాగ్రాం వాట్సాప్ ల మాతృ సంస్థ ఐన మెటా నుంచి ఇటివల అజిత్ మోహన్ గారు రాజీనామా చేసిన నేపద్యంలో ఆ స్థానంలో కి సంధ్య ను ఎంపిక చేసారు. సంధ్య దేవనధాన్ గారు 2016 లో మెటాలో సింగపూర్ వియత్నాం వ్యాపారాలు బృందాలతో పాటు ఆగ్నేయాసియా మెటా ఇ కామర్స్ కార్యక్రమాల బాద్యతలు నిర్వహిస్తూ 2020 లో ఇండోనేషియా కు వెళ్ళి ఏ పి ఎ సి కోసం గేమింగ్ లీడ్ గా పని చేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా సంధ్యా దేవనాథ్ నియామకం
ఎవరు : సంధ్యా దేవనాథ్
ఎప్పుడు : నవంబర్ 17
ఓ.ఎన్.జి.సి తదుపరి చైర్మన్ గా అరుణ్ కుమార్ సింగ్ గారు నియామకం ;

బిపిసి ఎల్ మాజీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ఓ.ఎన్.జి.సి తదుపరి చైర్మన్ గా నియమితులు కానున్నారు. ఇదే జరిగితే 60ఏళ్ళు నిండిన వ్యక్తి పి.ఎస్.యు బోర్డ్ లో ఉన్నత స్థాయి పదవి అయిన చైర్మన్ గా ఎంపిక కావడం ఇదే తొలి సారి అవుతుంది. చమురు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సర్ప్ కమ్ సెలక్షన్ కమిటి ఆగస్ట్ 27 న ఆరుగురు అబ్యార్డులను ఓ.ఎన్.జి.సి చైర్మన్ కోసం ఇంటర్ వ్యూ లు చేసిన అనంతరం అరుణ్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఓ.ఎన్.జి.సి తదుపరి చైర్మన్ గా అరుణ్ కుమార్ సింగ్ గారు నియామకం
ఎవరు : అరుణ్ కుమార్ సింగ్
ఎప్పుడు : నవంబర్ 17
నేపాల్ దేశ ఎన్నికల పరిశీలకునిగా భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ :

తమ దేశంలో జరిగే ఎన్నికలకు అంతర్జాతీయ పరిశీలకునిగా హాజరు కావాలని భారత ఎన్నికల సంఘం ఈ.సి ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గారిని నేపాల్ దేశ౦ ఆహ్వానించింది.నవంబర్ 20న నేపాల్ లో 275మంది సభ్యులు గల ఫెడరల్ పార్లమెంట్ కు ఏడు రాష్ట్రాలకు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమం లో ఈ నెల 18నుంచి 22వరకు రాజీవ్ కుమార్ నేపాల్ దేశ౦ లో భారత ఎన్నికల సంఘం అధికారులు బృందానికి నేతృత్వం వహించనున్నారని ఈసీ తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : నేపాల్ దేశ ఎన్నికల పరిశీలకునిగా భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్
ఎవరు : రాజీవ్ కుమార్
ఎక్కడ: నేపాల్ లో
ఎప్పుడు : నవంబర్ 16
పశ్చిం బెంగాల్ రాష్ట్ర గవర్నర్ గా సివి ఆనంద బోస్ నియామకం :

పశ్చిం బెంగాల్ రాష్ట్ర గవర్నర్ గా డాక్టర్ సివి ఆనంద బోస్ ను నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులు జారీ చేసారు. అక్కడ గవర్నర్ గా ఉన్న జగదీశ్ దన్ ఖండ్ ఉపరాష్ట్రపతి గా ఎన్నిక కావడంతో ఆ బాద్యతలు తాత్కాలికంగా మణిపూర్ గవర్నర్ గా ఉన్న లా గనేషన్ కు అప్పగించారు. జులై 18నుంచి ఆయన ఉభయ రాష్ట్రాల గవర్నర్ గా బాద్యతలు నిర్వహిస్తూ ఉన్నారు.ఈ నేపద్యంలోనే కేంద్ర ప్రభుత్వం పశ్చిం బెంగాల్ కు పూర్తి స్థాయి గవర్నర్ గా నియమించింది.ఈయన కేరళ రాష్ట్ర౦ కు చెందిన మాజీ ఐ.ఎ.ఎస్ అధికారి.ప్రస్తుతం మేఘాలయ ప్రభుత్వ సలహాదారునిగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : పశ్చిం బెంగాల్ రాష్ట్ర గవర్నర్ గా సివి ఆనంద బోస్ నియామకం
ఎవరు : సివి ఆనంద బోస్
ఎక్కడ: పశ్చిం బెంగాల్
ఎప్పుడు : నవంబర్ 16
ఆసియా ఎయిర్ గం చాంపియన్ షిప్ లో జూనియర్ వుమెన్ విభాగంలో మరో స్వర్ణం గెలుచుకున్న ఇషా :

సూపర్ ఫాం లో ఉన్న టీనేజ్ షూటింగ్ సంచలనం ఇషా సింగ్ మరో స్వర్ణ పథకం ను గెలుచుకుంది.జూనియర్ వుమెన్ 10మీ విభాగంలో పిస్టల్ టీం విభాగంలో ఇషా ,మను బాకర్ ,శిఖా నర్వార్ లతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది.నవంబర్ 17 న పసిడి పోరులో ఈ యువ త్రయం 16-12 తేడాతో ఆతిత్య కొరియా దేశ౦ పై గెలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా ఎయిర్ గం చాంపియన్ షిప్ లో జూనియర్ వుమెన్ విభాగంలో మరో స్వర్ణం గెలుచుకున్న ఇషా
ఎవరు : ఇషా
ఎప్పుడు : నవంబర్ 17
దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక అతిత్య అవార్డు గెలుచుకున్న రామోజీ ఫిలిం సిటి :

దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ పర్యాటక ఆతిత్య సేవల పురస్కారం రామోజీ ఫిలిం సిటి కి దక్కింది.పర్యాటక ఆతిత్య రంగాల ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటి ఈ అవార్డ్ ను ఎంపిక చేసినట్లు దక్షిణ భారత హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రకటించింది.బెంగళూర్ లో శాంగ్రిలా హోటల్ నవంబర్ 17 న సమాఖ్య వార్షిక సమ్మేళనం లో కర్నాటక సిఎం బసవరాజ్ బొమ్మై పాల్గొని రామోజీ ఫిలిం సిటి ఎండి సి హెచ్ విజయేశ్వరి కి ఈ పురస్కారం అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక అతిత్య అవార్డు గెలుచుకున్న రామోజీ ఫిలిం సిటి
ఎవరు : రామోజీ ఫిలిం సిటి
ఎప్పుడు : నవంబర్ 17
విజయవంతంగా ప్రయోగించిన యు.ఎస్ మూన్ రాకెట్ ఆర్టిమిస్ -1 :

నాసా కలల మూన్ రాకెట్ ఆర్టిమిస్ -1 ప్రయాణం ఎట్టకేలకు విజయవంతంగా ఆరంభం అయింది.రెండు హరికేన్ లు సాంకేతిక లోపాలు ఇంధన లికేజి వంటి సమస్యలను అధిగమించి నవంబర్ 17 న తెలవారు జామున ఫ్లోరిడా లోని కెనడి అంతరిక్ష కేంద్రం నుంచి గాలి లోకి ఎగిరింది.చరిత్రలో అత్యంత శక్తి వంతమైన దిగా చెబుతున్న ఈ రాకెట్ వ్యోమగాములు లేని ఖాళి ఓరియన్ స్పేస్ క్యాప్యుల్స్ తో బయలు దేరింది.జాబిలీ కక్ష్య లోకి చేరే ఈ క్యాప్యుల్స్ మొత్తంగా 25రోజులు పాటు 13 లక్షల మైళ్లు ప్రయాణిస్తుంది.అనంతరం భూ వాతావరణంలోకి ప్రవేశించి ఫసిఫిక్ మహా సముద్రం లో దిగుతుంది.కాగా ఇందులో 1969 నాటి చంద్ర యాత్ర లోనూ ఈ ఎర్త్ స్టేషన్ కీలక పాత్ర పోషించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : విజయవంతంగా ప్రయోగించిన యు.ఎస్ మూన్ రాకెట్ ఆర్టిమిస్ -1
ఎవరు : యు.ఎస్
ఎక్కడ: యు.ఎస్ లో
ఎప్పుడు : నవంబర్ 16
ఐటిటిఎఫ్ అథ్లెట్ కమిషన్ లో చోటు దక్కించుకున్న భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ :

ఇటీవలే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న కు ఎంపికైన భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ మరో ఘనత అందుకున్నారు.అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య అథ్లెట్ ల కమిషన్ లో చోటు దక్కించుకున్న భారత తొలి క్రీడాకారుడిగా అతను నిలిచాడు.ఈ కమిషన్ లో నలుగురు చొప్పున పురుష ,మహిళా అథ్లెట్ లను ఎన్నుకున్నారు.కాగా ఇప్పటికే శరత్ భారత ఒలింపిక్ సంఘం లో అథ్లెట్ ల కమిషన్ కు ఉపాధ్యక్షునిగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐటి టి ఎఫ్ అథ్లెట్ కమిషన్ లో చోటు దక్కించుకున్న భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్
ఎవరు : శరత్ కమల్
ఎప్పుడు : నవంబర్ 16
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |