
Daily Current Affairs in Telugu 17&18 December- 2022
2032 ఒలింపిక్ మరియు పారాలి౦పిక్ క్రీడలకు ఆర్గనైజింగ్ కమిటి ప్రారంభ సియివోగా సిండి హుక్ నియామకం :

బ్రిస్బేన్ (ఆస్త్రేలియాలో) జరిగే 2032 ఒలింపిక్ మరియు పారాలి౦పిక్ క్రీడలకు ఆర్గనైజింగ్ కమిటి ప్రారంభ సియివోగా అమెరికన్ ఎగ్సికుటివ్ సిండి హుక్ గారు నియమితులయ్యారు. సిండి హుక్ జూన్ వరకు సింగపూర్ లో డెలాయిట్ ఆసియా ఫసిఫిక్ యొక్క సియివో గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2032 ఒలింపిక్ మరియు పారాలి౦పిక్ క్రీడలకు ఆర్గనైజింగ్ కమిటి ప్రారంభ సియివోగా సిండి హుక్ నియామకం
ఎవరు : సిండి హుక్
ఎప్పుడు : డిసెంబర్ 17
2023 ప్రపంచ పుట్ బాల్ కప్ నకు ఆథిత్యం ఇవ్వనున్న మొరాకో దేశం :

ప్రపంచ పుట్ బాల్ గవర్నింగ్ బాడి అయిన FIFA అద్యక్షుడు జియాని ఇంఫాంటినో మొరాకో దేశ తదుపరి క్లబ్ ప్రపంచ కప్ నకు ఆథిత్యం ఇస్తుందని ప్రకటించారు. టోర్నమెంట్ ఫిబ్రవరి 1-11 2023 వరకు జరుగుతుంది. మొరాకో 2013 మరియు 2014 లో క్లబ్ ప్రపంచ కప్ నకు ఆథిత్యం ఇచ్చింది. ఈ టోర్నమెంట్ యొక్క ఇటీవల ఎడిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఫిబ్రవరి 2022 లో జరిగింది. దీనిని ఇంగ్లీష్ పుట్ బాల్ క్లబ్ చెల్సియా గెలుచుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2023 ప్రపంచ పుట్ బాల్ కప్ నకు ఆథిత్యం ఇవ్వనున్న మొరాకో దేశం
ఎవరు : మొరాకో దేశం
ఎప్పుడు : డిసెంబర్ 17
అంధుల టి-20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు :

అంధుల టి-20 వరల్డ్ కప్ 2012 లో జరిగిన ఇనాగురల్ టోర్నీ లో భారత్ పాకిస్తాన్ ఖంగుతినిపించి తొలిసారి ఈ ఫార్మాట్ లో చాంపియన్ గా నిలిచింది. అనంతరం 2017 లో జరిగిన రెండో ఎడిషన్ లోనూ భారత్ ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించి రెండో సారి జగజ్జేతగా అవతరించింది. 2012 జరిగిన ఇనాగురల్ టోర్నీ లో భారత్ పాకిస్తాన్ ను ఖంగుతినిపినించి తొలి సారి ఈ ఫార్మాట్ లో చాంపియన్ గా నిలిచింది. అనంతరం 2017 లో జరిగిన రెండో ఎడిషన్ లోనూ భారత్ ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి రెండో సారి జగజ్జేతగా అవతరించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంధుల టి-20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు
ఎవరు : భారత జట్టు
ఎప్పుడు : డిసెంబర్ 17
ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా రికార్డు నెలకొల్పిన అఫ్సిన్ ఘదేర్జాదేహ్ :

ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ఇరాన్ కు చెందిన అఫ్సిన్ ఘదేర్జాడేహ్ రికార్డు సృష్టించాడు. ఆయన సరిగ్గా 65.24సెంటి మీటర్ ల రెండు అడుగుల 1.68 అంగుళాలు )పొడవు ఉన్నారు.కాగా ఇప్పటి వరకు ఎడ్వర్డ్ హీర్నాండేజ్ (కొలంబియ) అతిపోట్టి మనిషిగా రికార్డు లో ఉండగా ఆయన అఫ్సిన్ 7 సెంటి మీటర్ లు పొట్టిగా ఉన్నాడు.దీంతో డిసెంబర్ 16 న గిన్నిస్ రికార్డ్ లో ఈయన చోటు సంపాదించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా రికార్డు నెలకొల్పిన అఫ్సిన్ ఘదేర్జాదేహ్
ఎవరు : అఫ్సిన్ ఘదేర్జాదేహ్
ఎప్పుడు : డిసెంబర్ 16
ఐర్లాండ్ దేశ రెండో సారి ప్రధాన మంత్రిగా లియో వరద్కర్ ఎన్నిక :

తాజాగా భారత సంతతి కి చెందిన లియో వరాడ్కర్ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 17 న ఆయన ప్రధానిగా బాద్యతలు చేపట్టనున్నారు.43 ఏళ్ల లియో ఐర్లాండ్ దేశ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది రెండో సారి ఫిన్ గేల్ పార్టికి చెందిన ఈయన 2017 నుంచి 2020 వరకు లియో ఐర్లాండ్ దేశ ప్రధానిగా పని చేసారు.ఐర్లాండ్ లోని యువ నాయకులలో లియో ఒకరు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐర్లాండ్ దేశ రెండో సారి ప్రధాన మంత్రిగా లియో వరద్కర్ ఎన్నిక
ఎవరు : లియో వరద్కర్
ఎప్పుడు : డిసెంబర్ 17
అతిపిన్న వయసులో టెస్ట్ మ్యాచ్ ఆడిన క్రికెటర్ గా నిలిచిన రెహాన్ అహ్మద్ :

పాకిస్తాన్ తో జరగనున్న మూడో టెస్ట్ లో 18 ఏళ్ల రెహాన్ అహ్మద్ ఎంపికయ్యారు. దాంతో పాటు అతను ఇంగ్లాండ్ తరపున టెస్ట్ మ్యాచ్ ఆడనున్న అతిపిన్న వయసుకుడిగా గుర్తింపు సాదించనున్నారు. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్ల 126 రోజులుగా మాత్రమే ఉంది. గతంలో ఈ రికార్డ్ డెన్నిస్ బ్రయాన్ క్లోజ్ పేరిట ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అతిపిన్న వయసులో టెస్ట్ మ్యాచ్ ఆడిన క్రికెటర్ గా నిలిచిన రెహాన్ అహ్మద్
ఎవరు : రెహాన్ అహ్మద్
ఎప్పుడు : డిసెంబర్ 17
ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచిన అర్జెంటిన దేశం :

అర్జెంటిన దేశం మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలి౦చింది.సూపర్ స్టార్ మెస్సి స్వప్నం సాకారం అయింది.అనేక మలుపులుతో అత్యంత ఉత్కంటభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్ ఓడిస్తూ అర్జెంటిన ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.అభిమానులను ఉర్రూతలూగించిన పోరులో అర్జెంటిన షూటౌట్ లో 4-2 తో పై చేయి సాదించింది. అర్జంటినా తరపున మెస్సి రెండు గోల్స్ 23పెనాల్టి ,108 పెనాల్టి) గోల్స్ కొట్టగా డిమారియ 36వ ఒక గోల్ సాధించాడు.ఫ్రాన్స్ తరపున స్టార్ ఆటగాడు ఎంబాబె సంచలన ప్రదర్శనతో ఆకట్టున్నారు. కాని మొత్తం మూడు గోల్స్ (80పెనాల్టి) 81 వ 118 పెనాల్టి) అక్కడే కొట్టినా జట్టును గెలిపించుకోలేక పోయాడు. అర్జంటినా దేశం చివరి సారి 1986లో మారడోనా నేతృత్వం లో ప్రపంచ కప్ సాధించింది.మొత్తంగా ఆ జట్టు మూడో జగజ్జేతగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచిన అర్జెంటిన దేశం
ఎవరు : అర్జెంటిన దేశం
ఎక్కడ: ఖతర్
ఎప్పుడు : డిసెంబర్ 18
2021 సంవత్సరానికి అనువాద పురస్కారం గెలుచుకున్న మాడ భూషి సంపత్ కుమార్ :

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అనువాద కులకు ఇచ్చే పురస్కారాన్ని 2021 సంవత్సరానికి గాను ప్రాచీన తెలుగు విశిష్ట అద్యయన కేంద్రం సంచాలకులు అయిన ఆచార్య మాడ భూషి సంపత్ కుమార్ గారికి ప్రకటించింది.ఈ పురస్కారం కింద రూ.2లక్షల నగదు జ్ఞాపిక ప్రధానం చేయనున్నారు. 21 వ తేదిన ముఖ్యమంత్రి గా స్టాలిన్ నుంచి ఆయన పురస్కారం స్వీకరించనున్నారు.భారతియార్ ,పట్టు కొట్టై కళ్యాణ సుందరం కవితలు కనిమోలి రాసిన కరువరై వాసనై ,మానావరి మని దర్ గల్ ,సామజిక శాస్త్రవేత్త తదితర గ్రంధాలను సంపత్ కుమార్ తెలుగులో అనువదించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2021 సంవత్సరానికి అనువాద పురస్కారం గెలుచుకున్న మాడ భూషి సంపత్ కుమార్
ఎవరు : మాడ భూషి సంపత్ కుమార్
ఎప్పుడు : డిసెంబర్ 18
Daily current affairs in Telugu Pdf November - 202 |
---|
Daily current affairs in Telugu 01-11-2022 |
>Daily current affairs in Telugu 02-11-2022 |
Daily current affairs in Telugu 03-11-2022 |
Daily current affairs in Telugu 04-11-2022</strong> |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 06-11-2022</strong> |
Daily current affairs in Telugu 07-11-2022 |
Daily current affairs in Telugu 08-11-2022 |
>Daily current affairs in Telugu 09-11-2022 |
Daily current affairs in Telugu 10-11-2022 |
Daily current affairs in Telugu 11-11-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |