Daily Current Affairs in Telugu 16 September -2022
సియామ్ అధ్యక్షుడిగా 2022-23 కాలానికి గాను వినోద్ ‘అగర్వాల్ ఎన్నిక :

సియామ్ అధ్యక్షుడిగా 2022-23 కాలానికి వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ ఎండీ వినోద్ ‘అగర్వాల్ ను సెప్టెంబర్ 16న ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేశ్ చంద్ర, కోశాధికారిగా టైమర్ ఇండియా. కమర్షియల్ వెహికల్స్ ,ఎండీ సత్య ఆర్యను ఎన్నుకున్నారు. ఇంటర్నెట్ తో అనుసంధానత, విద్యుత్తు వాహనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం సహా అధునాతన భద్రతా సదుపాయాలను అందిపుచ్చుకోవడంలో వాహన రంగం నిమగ్నమై ఉందని ఈ సందర్భంగా వినోద్ అగర్వాల్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సియామ్ అధ్యక్షుడిగా 2022-23 కాలానికి గాను వినోద్ ‘అగర్వాల్ ఎన్నిక
ఎవరు : వినోద్ ‘అగర్వాల్
ఎప్పుడు :సెప్టెంబర్ 16
ఆహార భద్రత అట్లాస్ ను కలిగి ఉన్న మూడవ రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రం :

తూర్పు భారతదేశంలో బీహార్ మరియు ఒడిశా తర్వాత జార్ఖండ్ తన గ్రామీణ ప్రాంతాలకు ఆహార భద్రత అట్లాస్ ను కలిగి ఉన్న మూడవ రాష్ట్రంగా అవతరించింది. ఈ అట్లాస్ కలిగి ఉన్న ఒడిశా మరియు బీహార్ తమ అట్లాస్ ను 2018లో ప్రారంభించాయి. ఈ అట్లాస్ రాష్ట్రంలో ఆహార భద్రత పరిస్థితిని మ్యాపింగ్ చేసే ప్రయత్నం ఇది. ముంబైలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ రీసెర్చ్ పరిశోధనలో భాగంగా ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ (IHD) దీనిని తయారు చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆహార భద్రత అట్లాస్ ను కలిగి ఉన్న మూడవ రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రం
ఎవరు : బిహర్ రాష్ట్రం
ఎక్కడ : బిహర్ రాష్ట్రం
ఎప్పుడు :సెప్టెంబర్ 16
దేశంలోనే మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కేంద్రం కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ :

భారతదేశంలోని మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రీ ప్రొడక్షన్ రనన్ను ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు (భారత ప్రభుత్వం) ప్రారంభించింది.2015లో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన రెండు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో ఇది ఒకదానిలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కేంద్రం కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్
ఎవరు : రాజీవ్ చంద్ర శేఖర్
ఎప్పుడు :సెప్టెంబర్ 16
ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం గెలుచుకున్న భారత పారిశ్రామిక వేత్త స్వాతి పిరమల్క్ :

ప్రముఖ భారత శాస్త్రవేత్త, పారిశ్రా మికవేత్త స్వాతి పిరమాల్ ఫ్రాన్స్ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. వాణిజ్యం, పరిశ్రమలు, సైన్స్, ఔషధ రంగాల్లో సేవలు, భారత్ ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న పిరమాల్ గ్రూప్ వైస్ చైర్పర్సన్ స్వాతి పిరమాల్ (66) వ్యవహరిస్తున్నారు. ఈ వారంలో ప్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి క్యాధరిన్ కోలోనా భారత పర్యటనలో స్వాతి పిరమాలక్కు ‘ది చెవాలియర్ డి లా . లీజియన్ ది హానర్ ఆర్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని అందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ‘ఎమ్మాన్యుయేల్ మ్యాక్షన్ తరఫున ముంబయి ‘ఆమె’ ఈ అవార్డును బహూకరించారు. ఇంతకు గ్రూప్ వైస్ ముందు 2016లో ఫ్రాన్స్ రెండో అత్యున్నత పురస్కారం “చెవాలియర్ డీ ఎల్ ఆర్రె నేషనల్ దు మెరిట్” ను స్వాతి పిరమాల్ పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం గెలుచుకున్న భారత పారిశ్రామిక వేత్త స్వాతి పిరమల్క్
ఎవరు : స్వాతి పిరమల్క్
ఎప్పుడు :సెప్టెంబర్ 16
ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో రెండో స్థాన౦ లో నిలిచిన గౌతమ్ అధాని :

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో రెండో స్థానానికి చేరారు. కొన్ని గంటల సేపు మాత్రమే ఆయన ఆ స్థానంలో ఉన్నారు. సెప్టెంబర్ 16న స్టాక్ మార్కెట్ల పతనం నేపధ్యంలో, తన గ్రూప్ షేర్లూ నష్టపోవడంతో అదానీ సంపద విలువ తగ్గి మళ్లీ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో ఫ్రాన్స్ సంస్థ ఎల్పీఎమ్ హెచ్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ 151.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. సెప్టెంబర్ 16న ఉదయం గ్రూప్ షేర్లు రాణించడంతో అదానీ నికర సంపద విలువ 155.7 బిలియన్ డాలర్లకు చేరింది. తదుపరి చాలా వరకు బిల్ గ్రూప్ షేర్లు నష్టాల్లోకి జారడంతో, ఆయన సంపద విలువ 152.2 డాలర్లకు దిగి రావడం వల్లే పరుల్లో ఆయన స్థానాలు మారడానికి కారణమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంపద విలువ పరంగా ముకేశ్ ని అదిగమించిన ఆదానీ ఏప్రిల్లో 100బి.డా. సంపదను సాధించారు. ”ఆగస్టులోనే మైక్రో వెలిసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు కు బిలేట్ నే వెనక్కి నెట్టి పద ప్రపంచ అగ్రగామి నాలుగో కుబేరుడిగా నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో రెండో స్థాన౦ లో నిలిచిన గౌతమ్ అధాని
ఎవరు : గౌతమ్ అధాని
ఎప్పుడు :సెప్టెంబర్ 16
ఐపీఎల్ ముంబయి ఇండియన్స్ జట్టు ప్రాధాన్ కోచ్ గా మార్క్ బౌచర్ ఎంపిక :

దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ఐపీఎల్ జట్టు ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్ గా నియమితుడయ్యాడు. రానున్న ఐపీఎల్ సీజన్లో బౌచర్ చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తాడని ముంబయి ఫ్రాంచైజీ శ సెప్టెంబర్ 16న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ముంబయి ఇండియన్స్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మహేల జయవర్షనెకు పదోన్నతి కల్పించిన నేపథ్యంలో అతని స్థానంలో బౌచరు బాధ్యతలు అప్పగించింది. 15 ఏళ్ల బౌచర్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుకు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెలలో మొదలయ్యే టీ20 ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా జోల్ ఫదవి నుంచి తప్పుకుంటానని బౌచర్ ఇటీవలే ప్రకటించాడు, “మంబయి ఇండియన్స్ కు ప్రధాన కోచ్ గా నియమితుడవడం. గర్వంగా ఉంది ప్రపంచ క్రీడారంగంలో ముంబయి విజయంతమైన ఫ్రాంచైజీ ఆ చరిత్ర, సాధించిన ఘనంచే నిదర్శము” అని బౌచర్ తెలిపాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐపీఎల్ ముంబయి ఇండియన్స్ జట్టు ప్రాధాన్ కోచ్ గా మార్క్ బౌచర్ ఎంపిక
ఎవరు : మార్క్ బౌచర్
ఎప్పుడు :సెప్టెంబర్ 16
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |