
Daily Current Affairs in Telugu 16 June -2022
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు :

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత తిరిగి బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో తన పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు. ఫిన్లాండ్ లో జరుగుతున్న పావో నుర్నీ గేమ్స్ లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఇక టోక్యో ఒలింపిక్స్ లో 2021, ఆగస్టు 7న జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ నీరజ్ చోప్రా ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణపతకం గెలుచుకున్నాడు. తద్వారా అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా ఓవరాల్ వ్యక్తిగతంగా ఒలింపిక్స్ లో దేశానికి స్వర్ణం అందించిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. గతేడాది మార్చిలో పాటియాలాలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు
ఎవరు: నీరజ్ చోప్రా
ఎప్పుడు :జూన్ 16
ఖేలో ఇండియా మహిళల వెయిలిఫ్టింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పథకం గెలిచిన మీరా భాయ్ :

టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను సత్తా చాటింది. ఖేలో ఇండియా మహిళల వెయిలిఫ్టింగ్ టోర్నమెంట్లో మీరా స్వర్ణంతో మెరిసింది. అయితే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (స్నాచ్ లో 88 కేజీలు)ను మాత్రం ఆమె అధిగమించలేక పోయింది. జూన్ 16న జరిగిన 49 కేజీల విభాగం పోటీలో స్నాచ్ లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ లో 105 కేజీలు లిఫ్ట్ చేసిన మీరా మొత్తం మీద 191 కేజీలతో అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్ లో మొదట 186 కేజీలు విజయవంతంగా ఎత్తిన మీరా ఆ తర్వాత 89 కేజీలు లిఫ్ట్ చేసే ప్రయ త్నంలో విఫలమైంది. వచ్చే నెలలో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో స్పాట్ లో 90 కేజీలను అదిగమించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత స్టార్ లిఫ్టర్ కు తాజా ప్రదర్శన కాస్త భారత స్టార్ లిఫ్టర్ కు తాజా ప్రదర్శన కాస్త నిరాశ కలిగించేదే. ఇదే విభాగంలో జ్ఞానేశ్వరి’ యాదవ్ (170 కేజీలు) రజతం గెలవగా, జిల్లి దలా బెహరా (166 కేజీలు) కాంస్యం సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఖేలో ఇండియా మహిళల వెయిలిఫ్టింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పథకం గెలిచిన మీరా భాయ్
ఎవరు: మీరా భాయ్
ఎప్పుడు :జూన్ 16
పృథ్వి-2 క్షిపణిని విజయవంతం గా ప్రయోగించిన భారత్ :

అణ్వాయుధాన్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న (పృథ్వి-2 క్షిపణిని ఒడిశాలోని చాందీపుర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించి నట్లు రక్షణ పరిశోధనల అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు అధికారులు తెలిపారు. రెండు ఇంజిన్లతో కూడిన పృథ్వి -2 క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలం లోని 350 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిందగలదు. 500 నుంచి 1000 కిలోల వరకు బరువైన అస్త్రాలను ఇది మోసుకెళగలదు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పృథ్వి-2 క్షిపణిని విజయవంతం గా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు :జూన్ 16
ప్రపంచ పోటీతత్వ “సూచీలో 37 వ స్థానంలో నిలిచిన భారత్ :

ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందడం వల్ల వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ స్థానం 43 నుంచి 6 స్థానాలు మెరుగై, 37కు చేరిందని ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. 63 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో డెన్మార్క్ దేశం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. కాగా స్విట్జర్లాండ్ దేశం మొదటి స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానంలో చిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ పోటీతత్వ “సూచీలో 37 వ స్థానంలో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ : భారత్
ఎప్పుడు : జూన్ 16
అమెరికా ప్రభుత్వంలో మరో కీలక పదవికి నామినేట్ రాదా అయ్యంగార్ :

ఇండియన్ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యం గార్ ప్లంబ్ కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ సర్కారు ఆమెను నామినేట్ చేసింది. ఆమె ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్ సెక్రటరీకి చీఫ్ అప్ స్టాప్ గా ఉన్నారు. అంతకుముందు గూగుల్, ఫేస్ బుక్ సంస్థల్లో డైరెక్టర్ గా పని చేశారు. మరో ఇండియన్ అమెరికన్ గౌతమ్ రానా స్లొవేకియాలో అమెరికా రాయబారిగా నియమితులు కానున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా ప్రభుత్వంలో. మరో కీలక పదవికి నామినేట్ రాదా అయ్యంగార్
ఎవరు: రాదా అయ్యంగార్
ఎక్కడ : అమెరికా
ఎప్పుడు :జూన్ 16
ప్రముఖ ఉర్దూ పండితుడు, సాహితీవేత్త గోపీచంద్ నారంగ్ కన్నుమూత

ప్రముఖ ఉర్దూ పండితుడు, సాహితీవేత్త గోపీచంద్ నారంగ్(91) | కన్నుమూశారు. సునిశిత విశ్లేషణలతో ఫయీజ్ కవితలకు ప్రాచుర్యంలోకి తీసుకువ చ్చిన ఆయనకు భారత్ తోపాటు పాకిస్తాన్లో ఎందరో అభిమానులున్నారు. అమెరికాలోని చార్లోట్టెలో ఉంటున్న తన కుమారుడి ఇంట ఆయన కన్నుమూశారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఆయన 60కి పైగా పుస్తకాలు రాశారు. భారత ప్రభుత్వ౦ చే పద్మశ్రీ, పద్మభూషణ్ తో పాటు, సీతారా- ఇంతియాజ్ లో పాక్ ప్రభుత్వం నారంగ్ ను గౌరవించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ ఉర్దూ పండితుడు, సాహితీవేత్త గోపీచంద్ నారంగ్ కన్నుమూత
ఎవరు: గోపీచంద్ నారంగ్
ఎప్పుడు :జూన్ 16
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |