
Daily Current Affairs in Telugu 15&16 October – 2022
ఇరాక్ దేశ నూతన అధ్యక్షుడిగా కుర్దీశ్ నేత అబ్దుల్ లతిఫ్ రషీద్ నియమకం :

ఇరాక్ నూతన అధ్యక్షుడిగా కుర్దీశ్ నేత అబ్దుల్ లతిఫ్ రషీద్ నియమి తులయ్యారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. దాదాపు ఏడాది కాలంగా నెలకొన్న ప్రతిష్తంభనకు తెరపడింది. 78 ఏళ్ల లతిఫ్ రషీద్ గతంతో జల మంత్రిత్వ శాఖలో పనిచేకారు. కాగా అతిపెద్ద పార్లమెంటరీ కూటమి నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నామినీని ఆహ్వానించేందుకు ఆయనకు 15 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రీమియర్ మనది అల్-కదేమీ స్థానంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాసమంత్రిని నామినేట్ చేయడం రషీద్ ముందున్న కర్తవ్యం.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇరాక్ దేశ నూతన అధ్యక్షుడిగా కుర్దీశ్ నేత అబ్దుల్ లతిఫ్ రషీద్ నియమకం
ఎవరు : అబ్దుల్ లతిఫ్ రషీద్
ఎక్కడ: ఇరాక్ దేశ ౦
ఎప్పుడు : అక్టోబర్ 15
మహిళల టీ20 ఆసియాకప్ 2022ను కైవసం గెలుచుకున్న ఇండియా జట్టు :

మహిళల టీ20 ఆసియాకప్ 2022ను ఇండియా కైవసం చేసుకున్నది. ఆసియాకప్ ఫైనల్లో ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయాన్ని నమోదు చేసింది. 66 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 8.3 ఓవర్లలోనే ఆ టార్గెట్ ను చేధించింది. క్రికెటర్ స్మృతి మందానా అజేయంగా 51 రన్స్ చేసింది. ఇండియా మహిళల జట్టు ఆసియాకప్ ను గెలవడం ఇది ఏడోసారి కావడం విశేషం
క్విక్ రివ్యు :
ఏమిటి : మహిళల టీ20 ఆసియాకప్ 2022ను కైవసం గెలుచుకున్న ఇండియా జట్టు
ఎవరు : ఇండియా జట్టు
ఎప్పుడు : అక్టోబర్ 15
బంధన్ బ్యాంక్ సంస్థ ప్రచారకర్తగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని నియమకం :

బ్యాంకింగ్ రంగంలో ఉన్న బంధన్ బ్యాంక్ సంస్థ ప్రచారకర్తగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని నియమించుకుంది. బ్యాంక్ సందేశాన్ని విస్తరించడంలో, సంస్థ ఉత్పత్తులు, సేవలను మరింత మందికి చేరువ చేయడంలో సౌరవ్ గంగూలీ సహాయపడతారని బంధన్ బ్యాంక్ తెలిపింది. 34 రాష్ట్రాల్లో 5,644 బ్యాంకింగ్ ఔట్ లెట్స్ ద్వారా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. మార్చి నాటికి కొత్తగా 551 శాఖలను తెరుస్తోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : బంధన్ బ్యాంక్. సంస్థ ప్రచారకర్తగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని నియమకం
ఎవరు : సౌరవ్ గంగూలీ
ఎప్పుడు : అక్టోబర్ 15
కువైట్ లో భారత కొత్త రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త ఆదర్శ్ స్వెకా నియామకం :

గల్ఫ్ ప్రాంతంలో భారత్ కు కీలక భాగస్వామి అయిన కువైట్ లో భారత కొత్త రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త ఆదర్శ్ స్వెకా నియమితులయ్యారు. 2002 బ్యాచికి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన స్వీకా ప్రస్తుతం ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రధాన కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కువైట్ లో సిబి జార్జ్ తర్వాత భారత రాయబారిగా స్వైకా బాధ్యతలు చేపట్టనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కువైట్ లో భారత కొత్త రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త ఆదర్శ్ స్వెకా నియామకం
ఎవరు : ఆదర్శ్ స్వెకా
ఎక్కడ: : కువైట్ లో
ఎప్పుడు : అక్టోబర్ 15
మధ్యప్రదేశ్ లో ని ఇండోర్ లో జరిగిన 17 వ ప్రవాసీ భారతీయ దివస్ :

17 వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్ మధ్యప్రదేశ్ లో ని ఇండోర్ లో జనవరి 2023 లో జరగనుంది. ప్రవాసీ భారతీయ దివస్ ను ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీన భారతదేశ అభివృద్ధిలో విదేశీ భారతీయ సమాజం యొక్క సహకారానికి గుర్తుగా జరుపుకుంటారు. ఇది 1915 జనవరి 9న మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన జ్ఞాపకార్ధం. 16వ PBD జనవరి 2019లో ఉత్తరప్రదేశ్ లో ని వారణాసిలో జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : మధ్యప్రదేశ్ లో ని ఇండోర్ లో జరిగిన 17 వ ప్రవాసీ భారతీయ దివస్
ఎక్కడ: మధ్యప్రదేశ్ లో ని ఇండోర్
ఎప్పుడు : అక్టోబర్ 16
రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ తో ఎంఒయుపై సంతకం చేసిన కోల్ ఇండియా లిమిటెడ్ :

రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో 1190 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోస౦ కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వియుఎన్ఎల్) తో ఎంఒయుపై సంతకం చేసింది. ఈ పార్క్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 4,846 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఆర్ఎ్వయుఎస్ఎల్ తో 5.400 కోటతో భారత్ లో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రం మధ్య మంచి సమన్వయానికి సంకేతం. IKS11, 821 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా రాజస్థాన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది..
క్విక్ రివ్యు :
ఏమిటి : రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ తో ఎంఒయుపై సంతకం చేసిన కోల్ ఇండియా లిమిటెడ్
ఎవరు : కోల్ ఇండియా లిమిటెడ్
ఎప్పుడు : అక్టోబర్ 16
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక 2022 107వ స్థానంలో నిలిచిన భారత్ :

దేశంలో ఆకలికేకలు ఏటికేడు పెరుగుతున్నాయనీ పోషకాహార లోపం తీవ్రమవుతుందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక 2022 ద్వారా స్పష్టమైంది. ఎందుకంటే ఈ ఏడాది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం మరింత దిగజారింది. 2021లో 101వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 107వ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది 116 దేశాల్లో 101వ స్థానంలో నిలిచిన భారత్ ఈసారి 121 దేశాల జాబితాలో 107వ స్థానంలో నిలిచింది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మన్ ఆర్గనైజేషన్ వెల్ష్ హంగర్ హిల్స్ సంయుక్తంగా ఈ ఈగ ఇండెక్స్. భారత్ లో ఆకలి స్థాయి తీవ్రమై పేర్కొంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్ 99వ స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ 84వ, నేపాల్ 81వ స్థానాల్లో భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఇక బెలారస్, హంగరీ, చైనా, టర్కీ, కువైట్ తో సహా 17 దేశాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక 2022 107వ స్థానంలో నిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : అక్టోబర్ 16
‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022’ కు ఎంపికైన హైదరాబాద్ నగరం :

సౌత్ కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (AIPH) 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ ఓవరాల్ ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022’తో పాటు ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ఫ్లూజివ్ గ్రోత్ ‘ విభాగంలో మరొకటి గెలుచుకుంది. కాగా ఈ అవార్డుకు ఎంపిక చేయబడిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ మాత్రమే కావడం విశేషం. ఈ కేటగిరీ అవార్డు మాత్రమే కాకుండా మొత్తం 6 కేటగిరీల్లో బెస్ట్ గా నిలిచి ఓవరాల్ వరల్డ్ గ్రీన్ సిటీ 2022’ అవార్డును తెలుగుకోవడం తెలంగాణకే కాకుండా మొత్తం భారతదేశానికి గర్వకారణ౦.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022’ కు ఎంపికైన హైదరాబాద్ నగరం
ఎవరు : హైదరాబాద్ నగరం
ఎప్పుడు : అక్టోబర్ 16
ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్ లో భారత్ కు దక్కిన అయిదో స్వర్ణం :

ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్ లో భారత్ కు అయిదో స్వర్ణం లభించింది. పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ లో రుద్రాంన్ష్, అర్జున్, కిరణ్ లతో కూడిన జట్టు పసిడి పతకం సొంతం చేసుకుంది. ఆదివారం టైటిల్ పోరులో భారత బృందం 16-10తో చైనా త్రయంపై విజయం సాధించింది ఈ టోర్నీలో రుద్రాక్షకు ఇది రెండో పసిడి 10 మీ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అతడు ఇంతకుముందు విజేతగా నిలిచాడు. మరో రజతం, కాంస్యం కూడా భారత్ ఖాతాలో చేరాయి 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ జూనియర్ ఈవెంట్ లో మాన్వి జైన్, సమీర్ జోడీ రజతం సాధించింది. స్వర్ణ పతక పోరులో ఈద్వయం చైనా టీమ్ చేతిలో ఓడిపోయింది. ఇదే ఈ అత్రి, సాహిల్ దురానె ద్వయం కాంస్యం గెలుచుకుంది భారత్ మొత్తంగా అయిదు స్వర్ణాలు, రజతం, అయిదు కాంస్యాలతో పతకాలతో జైన తర్వాత రెండో స్థానంలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్ లో భారత్ కు దక్కిన అయిదో స్వర్ణం
ఎవరు : భారత్
ఎప్పుడు : అక్టోబర్ 16
అల్యూమినియంతో తయారైన గూడ్స్ రైలును ప్రారంబించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ :

అల్యూమినియంతో తయారైన గూడ్స్ రైలును రైల్వే శాఖ తొలిసారి భువనేశ్వర్ నుంచి అక్టోబర్ 16న నడిపింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. ఉక్కుతో తయారైన రేక్ కన్నా ఇది అతి తేలికగా ఉండటంతోపాటు ఎక్కువ సామగ్రిని తరలించేదిగా రూపొందింది. బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్, హెండాల్ కో సంయుక్త భాగస్వామ్యంతో తయారైంది. ప్రస్తుతమున్న కన్నా ఇది 180 టన్నుల తక్కువ బరువు ఉంది. అంతే బరువు ఉన్న సామగ్రిని అదనంగా మోసుకెళుతుంది. రేజ్ బరువు తక్కువ ఉన్నందున రైలు వేగం పెరగ డంతోపాటు నడిపేందుకు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. రైల్వే శాఖ పర్యావరణ రక్షణ లక్ష్యాలకు అనుగుణంగా కాలుష్య ఉద్గారమూ తగ్గుతుంది. తేలికైన అల్యూమినియం వ్యాగన్లు అందుబాటులోకి రావడం దేశం గర్వించదగ్గ సందర్భమని రైల్వే మంత్రి పేర్కొన్నారు. 30 ఏళ్ల తరువాత కూడా పునర్వినియోగానికి ఈ ప్ర రేక్ అనుకూలమని, అప్పుడూ అంతే కొత్తగా కనిపిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాదిలోగా ఇలాంటి లక్ష వ్యాగన్లను సమకూర్చుకోవాలన్న రైల్వేశాఖ ప్రణాళిక మేరకు కార్యాచరణ చేపట్టామని తయారీ సంస్థ హిండాల్కో వివరించింది..
క్విక్ రివ్యు :
ఏమిటి : అల్యూమినియంతో తయారైన గూడ్స్ రైలును ప్రారంబించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ఎవరు : రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ఎప్పుడు : అక్టోబర్ 16
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |