Daily Current Affairs in Telugu 15 November – 2022
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో సత్య జిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ గెలుచుకున్న కార్లోస్ సౌరా :

గోవా జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 53వ ఎడిషన్ లో స్పానిష్ చలన చిత్ర దర్శకుడు మరియు రచయిత కార్లోస్ సౌరా ను సత్య జిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 2022 తో సత్కరించనున్నారు.ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53వ ఎడిషన్ నవంబర్ 20నుంచి 28 2022 వరకు గోవాలో జరగనుంది.ఈ ఏడాది 79దేశాలు నుంచి 280 సినిమాలు ఇక్కడ ప్రదర్శిచనున్నారు.భారత్ దేశం నుంచి 25.ఫీచర్ ఫిలిం ఫేర్ లు మరియు 20నాన్ ఫీచర్ ఫిలిం ఇండియన్ పనోరమా లో ప్రదర్శించబడతాయి.అయితే 183 సినిమా అంతర్జాతీయ ప్రోగ్రామింగ్ లో భాగంగా ఉంటాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో సత్య జిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ గెలుచుకున్న కార్లోస్ సౌరా
ఎప్పుడు : నవంబర్ 15
బ్రెజిల్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వాన్ రేస్ 2022 ను కైవసం చేసుకున్న బ్రిటన్ రేసర్ జార్జి రసెల్
:

బ్రిటన్ రేసర్ జార్జి రసెల్ బ్రెజిల్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వాన్ రేస్ 2022 ను కైవసం చేసుకున్నాడు. రేసుల్లో రసెల్ మాజీ చాంపియన్ లూయిస్ హమిల్టన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని మరి విజేతగా నిలిచాడు. దీంతో ఈ రేసులో ఇద్దరు బ్రిటన్ రేసులో రెండు స్థానాలను దక్కించుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : బ్రెజిల్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వాన్ రేస్ 2022 ను కైవసం చేసుకున్న బ్రిటన్ రేసర్ జార్జి రసెల్
ఎవరు : జార్జి రసెల్
ఎప్పుడు : నవంబర్ 15
ముంబై ఇండియా జట్టుకు ఐపిఎల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ :

వెస్టిండీస్ దేశ మాజీ క్రికెటర్ ఐపిఎల్ లో ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ తరపున ఆడిన కీరన్ పోలార్డ్ తన ఐపిఎల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అందులో ఆటగాడిగా రిటైర్ అయిన ముంబై ఇండియన్ తో అతని బందం కొనసానుంది.ఎందుకంటే వచ్చే సీజన్ లో ముంబై ఇండియన్ టీం బ్యాటింగ్ కోచ్ గా పోలార్డ్ వ్యవహరించనున్నారు. కిరన్ పోలార్డ్ 2010లో ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి మొత్తం 13సీజన్ లలో 189 మ్యాచ్ లు ఆడిన కిరన్ పోలార్డ్ 28.67 సగటుతో 3412 పరుగులు చేసాడు. అందులో 16హాఫ్ సెంచరీలు ఉన్నాయి.పార్ట్ టైం బౌలర్ గా 69వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ముంబై ఇండియా జట్టుకు ఐపిఎల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్
ఎవరు : వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్
ఎప్పుడు : నవంబర్ 15
పర్యావరణ పరిరక్షణ సూచిలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్ :

కాలుష్య బారి నుంచి పుడమి తల్లిని పరిరక్షించుకునే చర్యల్లో మన దేశం తన నిబద్దతను చాటుకుంటుంది.గతంలో కన్నా మెరుగైన పనితీరుతో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. పర్యావరణ మార్పు ఆచరణ సూచీ 2023 లో 8వ స్థానంలో ర్యాంకు ను పొందింది. గతంలో కన్నా రెండు స్థానాల మేరకు ఉన్నతి సాధించడం విశేషం పునరుత్పాదక ఇంధనాలకు ప్రదాన్యమివ్వడం కర్బన ఉద్గారాల కట్టడి చర్యల ఇందుకు దోహదపడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య కారక దేశం అయిన చైనా ఈ ఏడాది 13స్థానాలను కోల్పోయి 51 ర్యాంకులో నిలిచింది. కొత్తగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రణాలికలు రూపొందించడంతో మొత్తం మీద చాలా తక్కువ స్థాయి రేటింగ్ ను పర్యావరణ సంస్థలు ఇచ్చాయి. అమెరికా మూడు స్థానాలను మెరుగుపరుచుకుని 52 వ స్థానం పొందింది. ఇరాన్ 63 ,సౌది అరేబియా 62 ,కజకిస్తాన్ 61 ర్యాంకులో చిట్టచివరి స్థానంలో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : పర్యావరణ పరిరక్షణ సూచిలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : నవంబర్ 15
ప్రముఖ తెలుగు నటుడు పద్మ భూషణ్ గ్రహీత కృష్ణ కన్నుమూత :

ప్రముఖ తెలుగు నటుడు కృష్ణ అని పిలువబడే ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి (80) గారు గుండె పోటుతో కన్నుమూసారు. ఆయన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి.ఆయన ఆరు దశాబ్దాల పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో చురుగ్గా ఉన్న ఆయన 350 పైగా చిత్రాలు పనిచేసారు. అతను కుల గోత్రాలు (1961) ,పరువు ప్రతిష్ట వంటి చిత్రాలో చిన్న నటుడిగా తన సినీ జీవితం ప్రారంబించారు. 2009లో ఆయన పద్మ భూషణ్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ తెలుగు నటుడు పద్మ భూషణ్ గ్రహీత కృష్ణ కన్నుమూత
ఎవరు : కృష్ణ
ఎప్పుడు : నవంబర్ 15
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |