Daily Current Affairs in Telugu 15 July -2022
దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితా 2022లో మొదటి స్థానంలో ఐఐటీ మద్రాస్ :

దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితా 2022లో ఐఐటీ మద్రాస్ వరుసగా, నాలుగో ఏడాది తన మొదటిస్థానాన్ని నిలుపుకొంది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్థానాన్ని ఆక్రమించింది. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ రో ఎంగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) 2022 కింద కేంద్ర విద్యాశాఖ ఆ జాబితాను రూపొందించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిని విడుదల చేశారు. మొత్తంగా విద్యాసంస్థల జాబితాలో.. ఐఐటీ మద్రాస్ మొదటిస్థానంలో ఉండగా, ఐఐఎస్సీ బెంగళూరు రెండు, ఐఐటీ బాంబే మూడో స్థానంలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాల పరంగా చూసుకుంటే.. ఐఐఎస్సీ బెంగళూరు, జేఎన్ యూ, జామియామిలియా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. అలాగే ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే.. ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలలని విద్యాశాఖ. పేర్కొంది. ఫార్మసీ విభాగానికి వస్తే.. జామియా హమార్ట్ మొదటి స్థానంలో నిలిచింది. -హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ రెండో స్థానం పొందగా. చండీగర్లోని పంజాబ్ యూనివర్సిటీ మూడో స్థానంలో ఉంది ఎస్ఆర్ఎఫ్-2022 ర్యాకింగ్స్ ను మొత్తం 11 విభాగాల్లో విడుదల చేశారు.దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం, మేనేజ్మెంట్, కళాశాలలు, ఫార్మసీ, మెడికల్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, లా, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎఆర్ఐఏ (అటల్ ర్యాకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అఛీవ్మెంట్స్).. ఈ విభాగాలుగా ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లోని విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల అంకంగా 2016 నుంచి ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితా 2022లో మొదటి స్థానంలో ఐఐటీ మద్రాస్
ఎవరు ; ఐఐటీ మద్రాస్
ఎప్పుడు : జులై 15
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ 2025కి ఆతిథ్యం ఇవ్వనున్న జపాన్ దేశం :

జపాన్ రాజధాని నగరం టోక్యో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ 2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 14, 2022న USAలోని ఒరెగాన్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశం ద్వారా టోక్యో ఆతిథ్య నగరంగా ఎంపికైంది .2024 ప్రపంచ అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ లు జరుగుతాయని కౌన్సిల్ ప్రకటించింది. క్రొయేషియాలోని మెదులిస్ మరియు పుల్లాలో మరియు క్రొయేషియాలోని మెదులిన్ మరియు 2026 ప్రపంచ అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ లు ఫ్లోరిడాలోని తల్లాహస్సీలో జరుగుతాయి.
- జపాన్ దేశ రాజధాని : టోక్యో
- జపాన్ దేశ కరెన్సీ : జపనీస్ యెన్
- జపాన్ దేశ ప్రధాన మంత్రి : పుమియో కిశిడో
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ 2025కి ఆతిథ్యం ఇవ్వనున్న జపాన్ దేశం
ఎవరు ; జపాన్ దేశం
ఎప్పుడు : జులై 15
సురినామ్ తమ దేశ అత్యున్నత పౌర అవార్డు గెలుచుకున్న శ్రీ శ్రీ రవిశంకర్ :

దక్షిణ అమెరికా తీరప్రాంత దేశమైన సురినామ్ తమ దేశ అత్యున్నత పౌర అవార్డు ‘ఆనరరీ ఆర్డర్ ఆప్ ది ఎల్లో స్టార్ తో భారత ఆధ్యాత్మిక గురువు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ను సత్కరించింది. సురినామ్ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతో ఈ ఆవార్డును ఆయనకు అందజేశారు. ఇప్పటివరకు దేశాదిపతులకు మాత్రమే ఇచ్చిన ఈ ఆవార్డు మొట్టమొదటి ఆధ్యాత్మికవేత్త,గా ఒక ఆసియా వాసి అందుకున్నారు. సురినామ్ దేశ అధ్యక్ష భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కడి భారత రాయబారి డాక్టర్ శంకర్ బాలచంద్రన్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సురినామ్ తమ దేశ అత్యున్నత పౌర అవార్డు గెలుచుకున్న శ్రీ శ్రీ రవిశంకర్
ఎవరు ; శ్రీ శ్రీ రవిశంకర్
ఎప్పుడు : జులై 15
ఎస్ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా జీవకా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరె క్టర్ అనిల్ అగర్వాల్ ఎన్నిక :

ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్ బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా జీవకా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరె క్టర్ అనిల్ అగర్వాల్ ఎన్నిక య్యారు ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగనున్నారు. జులై 15న ఎల్టిసీసీఐలో నిర్వహించిన 105వ వార్షిక సాధారణ సమావే శంలో అనిల్ అగర్వాల్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సుధాకర్ గారుఇరిగేషన్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మీలా దేవ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎస్ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా జీవకా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అగర్వాల్ ఎన్నిక
ఎవరు ; అనిల్ అగర్వాల్
ఎప్పుడు : జులై 15
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో లో పర్యటించిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్ :

అమెరికా అద్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో లో పర్యటించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ లో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని. తగిన ఆర్ధిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతియత్నాలకు ఇంకా కార్యక్షేత్రం సిద్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దశాబ్దం. క్రితమే సంబంధాలు తెగిపోయాయి ఇజ్రాయెల్ లో రాజకీయ అస్థిరత పాలసీసాలో బలహీన నాయకత్వం వల్ల శాంతి చర్చల ప్రక్రియ సాగడం లేదు. (లక్షలాది పాలస్తీనా పారులు ఇజ్రాయెల్ పాలన కింద మగ్గిపోతున్నారు. సొంత సార్వభౌమత్వ, స్వతం త్ర దేశాన్ని పొందే అర్హత రెండు దేశాల ప్రజలకు ఉందని బైడెన్ ఉద్ఘాటించారు. రెండు వర్గాల ప్రజలకు రెండు దేశాలని వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల మూలాలు ఇక్కడి ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచే ఉన్నాయని. పక్కపక్కనే శాంతియుతంగా, భద్రతతో కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు.
- ఇజ్రాయెల్ దేశ రాజధాని ;జెరూసలేం
- ఇజ్రాయెల్ దేశ కరెన్సీ : ఇస్రాయెల్ షెకెల్
- ఇజ్రాయెల్ దేశ అద్యక్షుడు :ఇసాక్ హెర్జోగ్
- ఇజ్రాయెల్ దేశ ప్రధాని :యార్ ల్యాపిద్
- అమెరికా దేశ రాజధాని ; వాషింగ్టన్ డిసి
- అమెరికా దేశ కరెన్సీ : యు.ఎస్ డాలర్
- అమెరికా దేశ అద్యక్షుడు : జో బైడెన్
- అమెరికా దేశ ఉపఅద్యక్షుడు కమల హ్యారిస్
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో లో పర్యటీంచిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్
ఎవరు ; అమెరికా అద్యక్షుడు జో బైడెన్
ఎప్పుడు : జులై 15
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సిఎండి గా బాద్యతలు చేపట్టిన మధులిక భాస్కర్ :

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎసిఎల్) తన జనరల్ మేనేజర్ మధులికా భాస్కర్ కు మూడు నెలల పాటు సిఎండిగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. ప్రస్త్తుతం కంపెనీ ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా ఉన్న అతుల్ సహాయ్ గారి యొక్క పదవీకాలం అతని ఫిబ్రవరి 28, 2022న ముగిసింది. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న న్యూ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్ జాతీయం చేయబడిన సాధారణ బీమా కంపెనీ. ఇది భారత ప్రభుత్వ ఆర్థిక -మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సిఎండి గా బాద్యతలు చేపట్టిన మధులిక భాస్కర్
ఎవరు ; మధులిక భాస్కర్
ఎప్పుడు : జులై 15
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |